HealthPurushottham Vinayeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/health/movies_news/health-tips158a56c9-3250-41b4-87db-c56c57828407-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/health/movies_news/health-tips158a56c9-3250-41b4-87db-c56c57828407-415x250-IndiaHerald.jpgఎండాకాలం వస్తుందంటేనే చాలా మంది భయపడుతూ ఉంటారు.కొంతమందికి ఎండాకాలంలో వచ్చే వేడిని వడదెబ్బని తట్టుకోవడం చాలా కష్టంగా ఉంటుంది. కొంతమందికి విపరీతంగా చెమటలు పోస్తూ ఉంటాయి.ఇలాంటప్పుడు ఒంట్లో నీటి శాతం తగ్గి అలసటగా ఉంటుంది.ఈ అలసట సమయంలో వట్టి వాటర్ తాగితే పెద్దగా ప్రయోజనం ఉండదు.ఇప్పుడు మనం చెప్పుకోబోయే ఈ నాలుగు రకాల జ్యూస్లు తీసుకోవడం వల్ల ఒంట్లో నీరసం తగ్గి అలసట తీరుతుంది.మరి అవేంటో చూద్దామా. మొదటిది సగ్గుబియ్యం తో చేసిన జావా.సగ్గుబియ్యంలో వేడిని తగ్గించే గుణాలు చాలా ఉన్నాయి.అందువల్ల ఈ సగ్గుబియ్యం తోHealth Tips{#}Jaggery;Aqua;Gas Stove;Curry leaves;Ginger;salt;Manamఈ జ్యూస్ లు తాగడం వల్ల ఒంట్లో వేడి మాయం?ఈ జ్యూస్ లు తాగడం వల్ల ఒంట్లో వేడి మాయం?Health Tips{#}Jaggery;Aqua;Gas Stove;Curry leaves;Ginger;salt;ManamWed, 06 Mar 2024 19:43:41 GMTఎండాకాలం వస్తుందంటేనే చాలా మంది భయపడుతూ ఉంటారు.కొంతమందికి ఎండాకాలంలో వచ్చే వేడిని వడదెబ్బని తట్టుకోవడం చాలా కష్టంగా ఉంటుంది. కొంతమందికి విపరీతంగా చెమటలు పోస్తూ ఉంటాయి.ఇలాంటప్పుడు ఒంట్లో నీటి శాతం తగ్గి అలసటగా ఉంటుంది.ఈ అలసట సమయంలో వట్టి వాటర్ తాగితే పెద్దగా ప్రయోజనం ఉండదు.ఇప్పుడు మనం చెప్పుకోబోయే ఈ నాలుగు రకాల జ్యూస్లు తీసుకోవడం వల్ల ఒంట్లో నీరసం తగ్గి అలసట తీరుతుంది.మరి అవేంటో చూద్దామా. మొదటిది సగ్గుబియ్యం తో చేసిన జావా.సగ్గుబియ్యంలో వేడిని తగ్గించే గుణాలు చాలా ఉన్నాయి.అందువల్ల ఈ సగ్గుబియ్యం తో చేసిన జావా తాగితే ఆరోగ్యానికి ఎంతో మంచిది.ముందుగా స్టవ్ వెలిగించి ఒక గిన్నె తీసుకొని మూడు గ్లాస్ లు వాటర్ పోసి వాటర్ బాగా వేడెక్కి తెర్లుతూ ఉన్నపుడు ఒక టీ గ్లాస్ సగ్గుబియ్యం వేసి బాగా వుండికించాలి.ఇందులో కాస్త పటిక బెల్లం వేసి కరిగే వరకు కలిపుకోవాలి.చల్లారిన తరువాత కొంచెం చిక్కబడుతుంది ఇలా రెడీ చేసిన సగ్గుబియ్యం జావని తీసుకోవడం వల్ల చాలా మంచిది.రెండవది సబ్జాలతో చేసిన జ్యూస్.ఒక హాఫ్ కప్ సబ్జాలని ఇరవై నిముషాలు బాగా నానబెట్టాలి.


తర్వాత రెండు గ్లాస్ ల వాటర్ తీసుకొని అందులో నాలుగు స్పూన్ లా పటిక బెల్లం పొడి వేసి రెండు నిమ్మకాయల రాసాన్ని కలపాలి.ఇప్పుడు ముందుగా నానబెట్టుకున్న సబ్జాలని వేసి బాగా కలిపి కొంచం సాల్ట్ వేసి రెండు పూటలా తీసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఒంట్లో వేడి వెంటనే తగ్గుతుంది.మూడవది ఒక కప్ పెరుగులో రెండు చెంచాల చెక్కెర వేసి కరిగే వరకు బాగా కలపాలి.ఇప్పుడు ఇందులో ఒక గ్లాస్ వాటర్ ఒక కాయ నిమ్మరసం కలిపి తీసుకోవాలి.దీని వల్ల ఎండ వల్ల వచ్చే వడదెబ్బని తట్టుకోవచ్చు.నాలుగవది బార్లీ గింజలతో చేసిన జావా.ముందుగా బార్లీ గింజలని లైట్ గా వేపి పొడిచేసుకోవాలి.ఇప్పుడు హాఫ్ కప్పు పొడిని తీసుకుని అందులో ఒక కప్ వాటర్ పోసి బాగా కలపాలి.తర్వాత ఒక పాన్లో నాలుగు కప్పులు వాటర్ పోసుకొని ఒక ముక్క అల్లం రుచికి సరిపడా ఉప్పు వేసి బాగా కాగాక, కలిపి పెట్టుకున్న బార్లీ పొడిని వేసుకువాలి.ఇది కొంచెం ఉడికాకా అందులో కొంచం కరివేపాకు హాఫ్ నిమ్మ చెక్క రాసాన్ని వేసి బాగా కలపాలు.ఇది ఉడికి కొంచెం దగ్గర పడగానే దించి చల్లారాక తాగాలి.ఇలా చేయడం వల్ల ఎండాకాలం లో వచ్చే సమస్యలని అధిక దాహన్ని అరికట్టవచ్చు.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Purushottham Vinay]]>