PoliticsChakravarthi Kalyaneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/jagan46161314-28b4-4763-a61e-1b10c8b60dab-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/jagan46161314-28b4-4763-a61e-1b10c8b60dab-415x250-IndiaHerald.jpgఏపీలో గతేడాది పంట నష్టపోయిన రైతులకు ఇన్ పుట్ సబ్సిడీ నిధులు విడుదలయ్యాయి. తాడేపల్లి లోని క్యాంపు కార్యాలయంలో కంప్యూటర్ బటన్ నొక్కి సీఎం జగన్ నిధులు విడుదల చేశారు. గతేడాది ఖరీఫ్,రబీలో మిశాన్ తుపాను వల్ల నష్టపోయిన రైతులకు ఇన్ పుట్ సబ్సిడీ విడుదల చేసిన జగన్.. వ్యవసాయ ఉద్యాన వన రైతులకు పంటనష్ట పరిహారాన్ని రైతుల ఖాతాలో జమ చేశారు. గతేడాది ఖరీఫ్ లో కరవు, రబీ లో మిశాన్ తుపాను వల్ల నష్టపోయిన రైతులకు పంట నష్టం అందిస్తున్నామన్న జగన్.. పంట నష్ట పరిహారాన్ని పారదర్శకంగా నిర్ణయించి వివక్ష , లంచాలకు తావు లేjagan{#}prakruti;Tadepalli;December;CM;Governmentరైతుల ఖాతాల్లోకి జగన్ డబ్బు.. ఫుల్‌ హ్యాపీస్‌?రైతుల ఖాతాల్లోకి జగన్ డబ్బు.. ఫుల్‌ హ్యాపీస్‌?jagan{#}prakruti;Tadepalli;December;CM;GovernmentWed, 06 Mar 2024 23:06:33 GMTఏపీలో గతేడాది పంట నష్టపోయిన రైతులకు ఇన్ పుట్ సబ్సిడీ నిధులు విడుదలయ్యాయి.  తాడేపల్లి లోని క్యాంపు కార్యాలయంలో కంప్యూటర్ బటన్ నొక్కి సీఎం జగన్ నిధులు విడుదల చేశారు. గతేడాది ఖరీఫ్,రబీలో  మిశాన్ తుపాను వల్ల నష్టపోయిన రైతులకు ఇన్ పుట్ సబ్సిడీ విడుదల చేసిన జగన్.. వ్యవసాయ ఉద్యాన వన రైతులకు  పంటనష్ట పరిహారాన్ని  రైతుల ఖాతాలో జమ చేశారు. గతేడాది ఖరీఫ్ లో కరవు, రబీ లో మిశాన్ తుపాను వల్ల నష్టపోయిన రైతులకు పంట నష్టం అందిస్తున్నామన్న జగన్.. పంట నష్ట పరిహారాన్ని పారదర్శకంగా నిర్ణయించి వివక్ష , లంచాలకు తావు లేకుండా అందిస్తున్నామన్నారు.

 
58 నెలల పాలనలో రైతులకు అందాల్సిన సహాయం , అందాల్సిన సమయంలో అందిసున్నాం  మాది రైతు పక్షపాత ప్రభుత్వంమని చెప్పేందుకు  చాలా సంతోషపడుతున్నానన్న సీఎం జగన్‌..  వైకాపా ప్రభుత్వ హయాంలో రైతులకు నమ్మకం,భరోసా  కల్గించేలా చర్యలు తీసుకున్నామన్నారు. మిచన్ తుపాను వల్ల 3 లక్షల 25 వేల టన్నుల రంగుమారిన , తడిసిన  ధాన్యాన్ని కొనుగోలు చేశామన్న సీఎం జగన్‌.. ప్రకృతి వైపరీత్యాల వల్ల నష్టపోయిన రైతులకు ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా నిలిచామన్నారు.


గతేడాది ఖరీఫ్, డిసెంబర్ లో రబీలో మిచన్ తుపాను వల్ల పంట నష్టపోయిన రైతులకు ఇవాళ పరిహారం అందించారు. రైతులకు పంటల బీమా , పెట్టుబడి సాయం  అందించడంలో 58 నెలల కాలంలో కొత్త ఒరవడి సృష్టించామన్న సీఎం జగన్‌.. గతేడాది ఖరీఫ్ లో  7 జిల్లాల్లోని  103 మండలాను కరవు మండలాలుగా ప్రకటించామన్నారు. గతేడాది ఖరీఫ్ లో కరవు వల్ల పంట నష్టపోయిన 6.94 లక్షల మంది రైతులకు ఇన్ పుట్ సబ్సిడీ గా 847 కోట్లు ఇవాళ ఇస్తున్నామన్నారు.

 
డిసెంబర్ లో మిచాన్ తుపాను వల్ల నష్టపోయిన 4.61  లక్షల మంది రైతలకు  442 కోట్లు ఇన్ పుట్ సబ్సిడీ ఇస్తున్నామన్న సీఎం జగన్‌.. మొత్తంగా పంటనష్టపోయిన  11 లక్షల 60 వేల మంది రైతులకు 1295 కోట్ల ను ఇన్ పుట్ సబ్సిడీగా ఇవాళ విడుదల చేస్తున్నామన్నారు.





మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chakravarthi Kalyan]]>