PoliticsVijayaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/pawan-nagababu-vizag46b4e6c5-2d1b-43e3-ba1d-644dced00271-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/pawan-nagababu-vizag46b4e6c5-2d1b-43e3-ba1d-644dced00271-415x250-IndiaHerald.jpgవిశాఖ దక్షిణం నియోజకవర్గంలో పోటీకి రెడీ అయిన వంశీకృష్ణ యాదవ్, సాధిక్, ప్రసాద్ రెడ్డి తదితరులు కూడా చప్పపడిపోయారట. కారణం ఏమిటంటే ఇక్కడి నుండి టీడీపీనే రంగంలోకి దిగబోతోందని తాజా సమాచారమట. పెందుర్తి టికెట్ మాత్రం జనసేన నేత పంచకర్ల రమేష్ కు ఖాయమంటున్నారు. కారణం ఏమిటంటే రమేష్ టీడీపీ అధినేత చంద్రబాబునాయుడుకు అత్యంత సన్నిహితుల్లో ఒకళ్ళు కావటమే. రమేష్ ను చంద్రబాబే జనసేనలోకి పంపారనే ప్రచారం జరుగుతోంది. ఇలాంటి కారణాల వల్లే జనసేన నేతల్లో వైరాగ్యం పెరిగిపోతోందని సమాచారం.pawan nagababu vizag{#}sathish;vijayakumar;Yelamanchili;Pendurthi;Nagababu;sandeep;Hyderabad;Joseph Vijay;prasad;Anakapalle;Janasena;TDP;Assembly;Partyఉత్తరాంధ్ర : నేతల్లో వైరాగ్యం పెరిగిపోతోందా ?ఉత్తరాంధ్ర : నేతల్లో వైరాగ్యం పెరిగిపోతోందా ?pawan nagababu vizag{#}sathish;vijayakumar;Yelamanchili;Pendurthi;Nagababu;sandeep;Hyderabad;Joseph Vijay;prasad;Anakapalle;Janasena;TDP;Assembly;PartyWed, 06 Mar 2024 05:00:00 GMT

జనసేన  నేతలు చాలా నీరసపడిపోతున్నట్లు సమాచారం. రాబోయే ఎన్నికల్లో పార్టీ తరపున పోటీచేయాలని చాలామంది ఆశావహులు గట్టిగానే ప్రయత్నాలు చేసుకుంటున్నారు. అయితే ఆశావహుల్లో చాలామందికి తీరని నిరాశ తప్పటంలేదట. కారణం ఏమిటంటే టికెట్లు దక్కే అవకాశాలు దాదాపు లేవని తేలిపోయింది. విషయం ఏమిటంటే అనకాపల్లి ఎంపీగా పవన్ అన్న నాగబాబు ఏర్పాట్లు చేసుకున్నారు. నాగబాబు పోటీకి చేయాలని అనుకుంటే టికెట్ ఖాయమే అని అందరికీ తెలిసిందే.





అందుకనే ఆయన కూడా అనకాపల్లి పార్లమెంటు పరిధిలోకి వచ్చే ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలపై ఒకటికి రెండుసార్లు సమీక్షలు చేసుకున్నారు. అనకాపల్లి ఎంపీగా నాగబాబును ప్రకటించటమే మిగిలుంది అనుకున్న సమయంలో సడెన్ గా మాయమైపోయారు. అనకాపల్లిలో నాగబాబు పోటీచేయటంలేదని తేలిపోయింది. అచ్యుతాపురం సెజ్ ప్రాంతంలో అద్దెకు తీసుకున్న ఇంటిని నాగబాబు ఖాళీ చేసి హైదరాబాద్ వెళ్ళిపోయారని పార్టీ వర్గాల సమాచారం. పోటీ ఖాయమని అనుకున్న నాగబాబుకే టికెట్ దిక్కులేకుండా పోయింది ఇక తామెంత అనే వైరాగ్యం జనసేన నేతల్లో బాగా పెరిగిపోతోందట.




అనకాపల్లిలో నాగబాబు వ్యవహారాలను దగ్గరుండి చూసుకున్న సుందరపు బ్రదర్స్ సుందరపు విజయకుమార్, సుందరపు సతీష్ ఇపుడు పత్తాలేకుండా పోయారట. విజయకుమార్  యలమంచిలి ఇన్చార్జిగా ఉన్నారట. సతీష్ ను పవనే దూరంపెట్టేశారంటు ప్రచారం జరుగుతోంది. విజయ్ కుమార్, సతీష్ ఇద్దరు నాగబాబును అడ్డంపెట్టుకుని వసూళ్ళకు దిగారనే ఆరోపణలు వినబడుతున్నాయి. అందుకనే పవన్ దూరంపెట్టేశారట. అలాగే భీమిలీ సీటు జనసేనకే దక్కిందని టపాకాయలు కాల్చి సంబరాలు చేసుకున్న పంచకర్ల సందీప్ చప్పబడిపోయారట. ఎందుకంటే సీటులో టీడీపీ పోటీచేస్తుందని స్వయంగా పవనే చెప్పారట.





విశాఖ దక్షిణం నియోజకవర్గంలో పోటీకి రెడీ అయిన వంశీకృష్ణ యాదవ్, సాధిక్, ప్రసాద్ రెడ్డి తదితరులు కూడా చప్పపడిపోయారట. కారణం ఏమిటంటే ఇక్కడి నుండి టీడీపీనే రంగంలోకి దిగబోతోందని తాజా సమాచారమట. పెందుర్తి టికెట్  మాత్రం జనసేన నేత పంచకర్ల రమేష్ కు ఖాయమంటున్నారు. కారణం ఏమిటంటే రమేష్ టీడీపీ అధినేత చంద్రబాబునాయుడుకు అత్యంత సన్నిహితుల్లో ఒకళ్ళు కావటమే. రమేష్ ను చంద్రబాబే జనసేనలోకి పంపారనే ప్రచారం జరుగుతోంది. ఇలాంటి కారణాల వల్లే జనసేన నేతల్లో వైరాగ్యం పెరిగిపోతోందని సమాచారం.




మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Vijaya]]>