Moviesmurali krishnaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/socialstars-lifestyle981934c4-0905-489b-b8f4-80a616f5cdce-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/socialstars-lifestyle981934c4-0905-489b-b8f4-80a616f5cdce-415x250-IndiaHerald.jpgటాలెంటెడ్ సుకుమార్ దర్శకత్వంలో మైత్రీ మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం పుష్ప 2: ది రూల్. పార్ట్-1 ఊహించనివిధంగా సక్సెస్ కావడంతో పార్ట్-2పై భారీ అంచనాలు రేపుతోంది.2024 ఆగస్టు 15న ఈ మూవీ విడుదల కానుంది. పుష్ప రాజ్ పాత్రలో అల్లు అర్జున్ నటిస్తున్న ఈ విడుదల కోసం పాన్ ఇండియా ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అతనితో పాటు ప్రతిభావంతుడైన ఫాహద్ ఫాజిల్, నేషనల్ క్రష్ రష్మిక మందన్న కీలక పాత్రలు చేస్తున్నారు.వీరిద్దరు ఇప్పటికే కీలక షూటింగ్ లో పాల్గొన్నారు. అయితే ఆశ్చర్యకsocialstars lifestyle{#}sukumar;Crush;Sanjay Dutt;vegetable market;Arjun;raj;Allu Arjun;Tollywood;Chitram;Cinema;Success;bollywood;Indiaపుష్ప 2’లో అతిథి పాత్రలో కనిపించనున్న బాలీవుడ్ స్టార్..!!పుష్ప 2’లో అతిథి పాత్రలో కనిపించనున్న బాలీవుడ్ స్టార్..!!socialstars lifestyle{#}sukumar;Crush;Sanjay Dutt;vegetable market;Arjun;raj;Allu Arjun;Tollywood;Chitram;Cinema;Success;bollywood;IndiaWed, 06 Mar 2024 14:20:00 GMTటాలెంటెడ్ సుకుమార్ దర్శకత్వంలో మైత్రీ మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం పుష్ప 2: ది రూల్. పార్ట్-1 ఊహించనివిధంగా సక్సెస్ కావడంతో పార్ట్-2పై భారీ అంచనాలు రేపుతోంది.2024 ఆగస్టు 15న ఈ మూవీ విడుదల కానుంది. పుష్ప రాజ్ పాత్రలో అల్లు అర్జున్ నటిస్తున్న ఈ విడుదల కోసం పాన్ ఇండియా ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అతనితో పాటు ప్రతిభావంతుడైన ఫాహద్ ఫాజిల్, నేషనల్ క్రష్ రష్మిక మందన్న కీలక పాత్రలు చేస్తున్నారు.వీరిద్దరు ఇప్పటికే కీలక షూటింగ్ లో పాల్గొన్నారు. అయితే ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే లెజెండరీ నటుడు సంజయ్ దత్ పార్ట్-2 నటించే అవకాశాలున్నాయట. బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ ‘పుష్ప 2’లో అతిథి పాత్రలో కనిపించనున్నారని కొత్త రూమర్ చక్కర్లు కొడుతోంది. ఏ కథాంశానికైనా సరిపోయే నటుడిగా ఆయనకు మంచి పేరుంది. అయితే ఇదే వార్తకు సంబంధించి అఫీషియల్ ప్రకటించాల్సి ఉంది. ‘పుష్ప 2’లో మొదటి భాగంలోని కీలక పాత్రలతో పాటు పలు కొత్త పాత్రలను పరిచయం చేస్తూ త్వరలోనే అభిమానుల్లో ఆసక్తిని మరింత పెంచనున్నారు. అయితే పుష్ప2 లో నటించడానికి మరికొందరు బాలీవుడ్ నటులు ఆసక్తిగా ఉన్నారట.అల్లు అర్జున్ మెగా వారసత్వంలో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చినా.. ఆ తర్వాత తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్నాడు. గంగోత్రి, ఆర్య, పరుగు, రేసుగుర్రం, అలవైకుంఠపురంలో, పుష్ప లాంటి లతో టాలీవుడ్ లో కాకుండా బాలీవుడ్ లో ను తన మార్కెట్ ను పెంచుకున్నాడు. పుష్ప లో మంచి నటన కనబర్చించినందుకు ఉత్తమ జాతీయ అవార్డును సొంతం చేసుకున్నాడు. ఈ సక్సెస్ ఇచ్చిన ఉత్సాహంతో పుష్ప2 షూటింగ్ ను శరవేగంగా చేస్తున్నాడు. ఈ మూవీ నుంచి విడుదలైన గ్లింప్స్, లుక్స్ ప్రేక్షకుల్లో మంచి హైప్ ను క్రియెట్ చేసింది. ఇటీవల బెర్లిన్ లో సందడి చేసిన అల్లు అర్జున్ పుష్ప3 కూడా తెరకెక్కే అవకాశాలున్నట్టు హింట్ ఇచ్చారు.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - murali krishna]]>