PoliticsChakravarthi Kalyaneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/supreme-courtf0df9a95-7d22-43f3-ae0f-3468fae63133-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/supreme-courtf0df9a95-7d22-43f3-ae0f-3468fae63133-415x250-IndiaHerald.jpgచట్టంలో, రాజ్యాంగంలో లేని అంశాలపై కోర్టులు స్వేచ్ఛ తీసుకోవచ్చు. కొన్ని విషయాల్లో భవిష్యత్తు తరాలను దృష్టిలో పెట్టుకొని కొన్ని కీలక తీర్పులు వెలువరిస్తుంటారు. గంజాయి స్మగ్లింగ్ కేసులో కొంతమంది నిందితులను పోలీసులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. ఆ నిందితులు కూడా తాము నేరం చేస్తున్నట్లు ఒప్పుకున్నారు. దీనిపై శిక్ష విధించిన హైకోర్టు నిర్ణయాన్ని సుప్రీం కోర్టు తప్పుపట్టింది. గంజాయి పట్టివేత కేసులో ఇద్దరు వ్యక్తులకు తెలంగాణ హైకోర్టు విధించిన శిక్షను సుప్రీం కోర్టు కొట్టివేసింది. విచారణ సందర్భంగాsupreme court{#}marijuana;sandeep;November;High court;Supreme Court;court;Telangana;policeగంజాయి స్మగ్లర్ల కేసులో సుప్రీం ఆసక్తికర తీర్పు?గంజాయి స్మగ్లర్ల కేసులో సుప్రీం ఆసక్తికర తీర్పు?supreme court{#}marijuana;sandeep;November;High court;Supreme Court;court;Telangana;policeWed, 06 Mar 2024 09:15:02 GMTచట్టంలో, రాజ్యాంగంలో లేని అంశాలపై కోర్టులు స్వేచ్ఛ తీసుకోవచ్చు. కొన్ని విషయాల్లో భవిష్యత్తు తరాలను దృష్టిలో పెట్టుకొని కొన్ని కీలక తీర్పులు వెలువరిస్తుంటారు.  గంజాయి స్మగ్లింగ్ కేసులో కొంతమంది నిందితులను పోలీసులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు.  ఆ నిందితులు కూడా తాము నేరం చేస్తున్నట్లు ఒప్పుకున్నారు. దీనిపై శిక్ష విధించిన హైకోర్టు నిర్ణయాన్ని సుప్రీం కోర్టు తప్పుపట్టింది.


గంజాయి పట్టివేత కేసులో ఇద్దరు వ్యక్తులకు తెలంగాణ హైకోర్టు విధించిన శిక్షను సుప్రీం కోర్టు కొట్టివేసింది. విచారణ సందర్భంగా హైకోర్టు తీర్పును తీవ్రంగా తప్పుపట్టింది. వీసమెత్తు సాక్ష్యాధారాలు లేకుండానే నిందితులపై శిక్ష విధించారని.. విచారణ కోర్టు వేసిన శిక్షను ఏ మాత్రం సమీక్షించకుండా యాంత్రికంగా ఆమోదించిందని మండి పడింది. నిందితులకు శిక్ష నుంచి విముక్తి ప్రసాదిస్తూ తీర్పు జారీ చేసింది.  కారులో 80 కిలోల గంజాయిని తరలిస్తున్నారన్న ఆరోపణలపై మహ్మద్ ఖాలిద్ తో పాటు మరో వ్యక్తిని పోలీసులు 2009లో అరెస్టు చేశారు.


2010లో విచారణ కోర్టు నార్కోటిక్ చట్టం కింద.. నిందితుల నేరానికి పాల్పడ్డారంటూ తీర్పు చెప్పింది. దీనిపై వారు హైకోర్టులో అప్పీల్ చేయగా.. 2022 నవంబరు లో విచారణ కోర్టు ఇచ్చిన ఆదేశాలనే సమర్థించింది. దీనిపై నిందితులు సుప్రీం కోర్టులో పిటిషన్ వేశారు. జస్టిస్ బీఆర్ గవాయి, జస్టిస్ సందీప్ మెహతాలతో కూడిన ధర్మాసనం ఈ తీర్పుపై విచారణ జరిపింది.


పోలీసు అధికారి రికార్డు చేసిన నిందితుల వాంగూల్మాన్ని ఎవిడెన్స్ యాక్ట్ లోని సెక్షన్ 25 ప్రకారం సాక్ష్యంగా అంగీకరించలేమని.. ఈ విషయాన్ని విచారణ కోర్టు, హై కోర్టు పూర్తిగా విస్మరించాయిన ధర్మాసనం పేర్కొంది. ఈ కేసులో పట్టుబడిన గంజాయిని సరిగా భద్రపరచలేదని ధర్మాసనం పేర్కొంది. మర్చి బస్తాలతో కలిపి గంజాయిని పట్టుకున్నట్లు రికార్డుల్లో ఉంది. కానీ మిర్చిని వేరు చేసి వాస్తవానికి దొరికిన గంజాయి ఎంత అన్నదానిని సదరు లెక్కించనేలేదు. అని సుప్రీం కోర్టు వ్యాఖ్యానించింది.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chakravarthi Kalyan]]>