Moviesmurali krishnaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/socialstars-lifestylee35695a3-8b03-4012-bb21-de51dd3eb833-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/socialstars-lifestylee35695a3-8b03-4012-bb21-de51dd3eb833-415x250-IndiaHerald.jpgఆర్ఆర్ఆర్ మూవీ తర్వాత గ్లోబల్ స్టార్‌గా మారాడు యంగ్ టైగర్ ఎన్టీఆర్. ఆయనకు వరుస పెట్టి అవకాశాలు క్యూ కడుతున్నాయి. ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో రూపొందుతున్న దేవరలో నటిస్తున్నాడు. ఈ చిత్రం రెండు పార్టులుగా తెరకెక్కబోతున్న సంగతి విదితమే. ఈ సినిమాతోనే అతిలోక సుందరి శ్రీదేవి తనయ జాన్వీ కపూర్ తెలుగులోకి ఎంట్రీ ఇస్తుంది. సైఫ్ అలీఖాన్ ప్రతి నాయకుడి పాత్రలో మెరబోతున్నాడు. అన్ని అనుకున్నట్లు జరిగితే.. ఏప్రిల్ 5న మూవీ విడుదల అయ్యేది. కానీ సైఫ్‌కి గాయం కావడం.. వీఎఫ్ఎక్స్, గ్రాఫిక్స్ కోసం మరింత సమయం పట్టడsocialstars lifestyle{#}Research and Analysis Wing;RRR Movie;Graphics;Saif Ali Khan;Kannada;Ayan Mukerji;Sridevi Kapoor;koratala siva;NTR;war;Jr NTR;Hero;Tollywood;Chitram;prashanth neel;Prasanth Neel;Cinema;Yash;bollywoodమరో బాలీవుడ్ మూవీకీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన తారక్...!!!మరో బాలీవుడ్ మూవీకీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన తారక్...!!!socialstars lifestyle{#}Research and Analysis Wing;RRR Movie;Graphics;Saif Ali Khan;Kannada;Ayan Mukerji;Sridevi Kapoor;koratala siva;NTR;war;Jr NTR;Hero;Tollywood;Chitram;prashanth neel;Prasanth Neel;Cinema;Yash;bollywoodWed, 06 Mar 2024 14:40:00 GMTఆర్ఆర్ఆర్ మూవీ తర్వాత గ్లోబల్ స్టార్‌గా మారాడు యంగ్ టైగర్ ఎన్టీఆర్. ఆయనకు వరుస పెట్టి అవకాశాలు క్యూ కడుతున్నాయి. ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో రూపొందుతున్న దేవరలో నటిస్తున్నాడు. ఈ చిత్రం రెండు పార్టులుగా తెరకెక్కబోతున్న సంగతి విదితమే. ఈ సినిమాతోనే అతిలోక సుందరి శ్రీదేవి తనయ జాన్వీ కపూర్ తెలుగులోకి ఎంట్రీ ఇస్తుంది. సైఫ్ అలీఖాన్ ప్రతి నాయకుడి పాత్రలో మెరబోతున్నాడు. అన్ని అనుకున్నట్లు జరిగితే.. ఏప్రిల్ 5న మూవీ విడుదల అయ్యేది. కానీ సైఫ్‌కి గాయం కావడం.. వీఎఫ్ఎక్స్, గ్రాఫిక్స్ కోసం మరింత సమయం పట్టడంతో ఈ సినిమా రిలీజ్ డేట్ కాస్త.. అక్టోబర్‌కు వెళ్లింది. ఈ సినిమా కోసం సుమారు రూ. 300 కోట్లు పెట్టినట్లు సమాచారం.

అక్టోబర్ 10న దేవర విడుదల కానుంది. ఇదే కాకుండా వరుస లైనప్స్‌తో బిజీగా మారిపోయాడు తారక్. బాలీవుడ్ కూడా రా రా అంటూ పిలిచింది. వార్ 2కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు జూనియర్ ఎన్టీఆర్. బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్‌తో తెరపంచుకోబోతున్నాడు. బీ టౌన్ ప్రముఖ నిర్మాణ సంస్థ యష్ రాజ్ ఫిలిమ్స్ సినిమాటిక్ యూనివర్స్‌లో భాగంగా తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని అయాన్ ముఖర్జీ డైరెక్ట్ చేస్తున్నాడు. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ స్టార్ అయ్యింది కూడా. తారక్ లేకుండానే హృతిక్, ఇతర తారాగణంపై కొన్ని సన్నివేశాలు చిత్రీకరించారు. ఇందులో యంగ్ టైగర్ నెగిటివ్ షేడ్స్‌లో కనిపించబోతున్నట్లు టాక్ నడుస్తోంది. వార్ 2 ఈ ఏడాది ఆగస్టులో రిలీజ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. అయితే ఇప్పుడో ఇంట్రస్టింగ్ న్యూస్ ఒకటి హల్ చల్ చేస్తుంది. తొలి సినిమా విడుదల కాకుండా.. మరో ఆఫర్ కొల్లగొట్టాడు తారక్.

జూనియర్ ఎన్టీఆర్ .. మరో బాలీవుడ్ మూవీకి సైన్ చేసినట్లు తెలుస్తోంది. వార్ 2 తెరకెక్కిస్తున్న యష్ రాజ్ బ్యానర్‌లోనే మరో చిత్రంలో తారక్ నటించనున్నాడట. వార్ 2 తర్వాత ఈ చిత్రం ఉండబోతుందని సమాచారం. అయితే ఈ సారి ఫుల్ లెంగ్త్‌లో కనిపించబోతున్నాడట. సోలో హీరోగా కనిపించబోతున్నాడని టాక్. మొత్తానికి టాలీవుడ్ లోనే కాదూ.. బాలీవుడ్ లో పాగా వేసేందుకు టార్గెట్ ఫిక్స్ చేసినట్లున్నాడు తారక్. ఏదైనా అఫియల్ ఎనౌన్స్ రావాల్సి ఉంది. ఇవే కాకుండా యంగ్ టైగర్ చేతిలో దేవర 2తో పాటు కన్నడ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో మరో సినిమాకు కూడా ఓకే చెప్పాడని తెలుస్తోంది. మొత్తానికి.. అన్ని ఇండస్ట్రీలను మడతపెట్టేస్తున్నాడు ఈ నందమూరి వారసుడు. వరుస లైనప్స్‌తో మొత్తం రెండు మూడేళ్ల వరకు కాల్షీట్లు అన్ని ఫిల్ అయినట్లు కనిపిస్తున్నాయి. ఆర్ఆర్ఆర్ తర్వాత గ్యాప్ ఇచ్చిన తారక్.. ప్రస్తుతం దేవర కోసం కష్టపడుతున్నాడు. ఈ మూవీ కోసం వెయిట్ చేస్తున్నారు ఫ్యాన్స్.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - murali krishna]]>