MoviesPurushottham Vinayeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/srk-did-not-insult-ram-charan8b18aae0-041d-4170-8b23-a86a35857c25-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/srk-did-not-insult-ram-charan8b18aae0-041d-4170-8b23-a86a35857c25-415x250-IndiaHerald.jpgభారతదేశ అపర కుబేరుడు రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్ అంబానీ చిన్న కుమారుడు అనంత్ అంబానీ, రాధికా మర్చంట్ ప్రీ వెడ్డింగ్ సెలబ్రెషన్స్ చాలా గ్రాండ్‏గా జరిగిన సంగతి తెలిసిందే.గుజరాత్ రాష్ట్రం‏లోని జామ్ నగర్ ప్రాంతంలో జరిగిన ఈ వేడుకలకు ప్రపంచ దేశాల సంపన్నులు, వ్యాపారవేత్తలు, సినీ సెలబ్రెటీలు హాజరవ్వడం జరిగింది.మార్చి 1 వ తేదీ నుంచి బాలీవుడ్ ఇండస్ట్రీ మొత్తం కూడా జామ్ నగర్‏లోనే ఉండిపోయింది. ఇక సౌత్ నుంచి మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, ఉపాసన, సూపర్ స్టార్ రజినీకాంత్ ఇంకా ఐశ్వర్య రజినీకాంత్ హాజరయ్యారు.బRam Charan - Sharukh Khan{#}Shahrukh Khan;Idili;Huzur Nagar;Reliance;Makeup;Mukesh;aishwarya;Rajani kanth;Ram Charan Teja;bollywood;Salman Khan;Pawan Kalyanరిలాక్స్ ఫ్యాన్స్.. షారుఖ్ చరణ్ని అవమానించలేదు?రిలాక్స్ ఫ్యాన్స్.. షారుఖ్ చరణ్ని అవమానించలేదు?Ram Charan - Sharukh Khan{#}Shahrukh Khan;Idili;Huzur Nagar;Reliance;Makeup;Mukesh;aishwarya;Rajani kanth;Ram Charan Teja;bollywood;Salman Khan;Pawan KalyanTue, 05 Mar 2024 19:17:01 GMTభారతదేశ అపర కుబేరుడు రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్ అంబానీ చిన్న కుమారుడు అనంత్ అంబానీ, రాధికా మర్చంట్ ప్రీ వెడ్డింగ్ సెలబ్రెషన్స్ చాలా గ్రాండ్‏గా జరిగిన సంగతి తెలిసిందే.గుజరాత్ రాష్ట్రం‏లోని జామ్ నగర్ ప్రాంతంలో జరిగిన ఈ వేడుకలకు ప్రపంచ దేశాల సంపన్నులు, వ్యాపారవేత్తలు, సినీ సెలబ్రెటీలు హాజరవ్వడం జరిగింది.మార్చి 1 వ తేదీ నుంచి బాలీవుడ్ ఇండస్ట్రీ మొత్తం కూడా జామ్ నగర్‏లోనే ఉండిపోయింది. ఇక సౌత్ నుంచి మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, ఉపాసన, సూపర్ స్టార్ రజినీకాంత్ ఇంకా ఐశ్వర్య రజినీకాంత్ హాజరయ్యారు.బాలీవుడ్ ఖాన్ త్రయం షారుఖ్, అమిర్, సల్మాన్ నాటు నాటు పాటకు డాన్స్ చేయడం జరిగింది.ఇక నాటు నాటు పాటలోని ఎన్టీఆర్, రామ్ చరణ్ సిగ్నేచర్ స్టేప్ మ్యాచ్ చేయాలని ఖాన్ త్రయం ఎంతో కష్టపడ్డారు. కానీ వారికి కుదరలేదు. దీంతో అక్కడే ఉన్న రామ్ చరణ్ ను షారుఖ్ ఖాన్ వేదికపైకి పిలిచాడు. ఆ సమయంలో బాద్ షా చెప్పిన డైలాగ్ ఇప్పుడు సోషల్ మీడియాలో దూమారం రేపుతుంది. 


ఇక రామ్ చరణ్ ను స్టేజీపైకి రావాలని పిలిచిన సమయంలో.. ఇడ్లీ వడ రామ్ చరణ్ అంటూ షారుఖ్ సంబోధించారు. ఈ విషయాన్ని చరణ్ పర్సనల్ మేకప్ ఆర్టిస్ట్ నెట్టింట షేర్ చేయడంతో మెగా ఫ్యాన్స్ షారుఖ్ తీరుపై కోపం వ్యక్తం చేస్తున్నారు. షారుఖ్ నుంచి ఇలాంటి ప్రవర్తన ఊహించలేదంటూ సీరియస్ అవుతున్నారు. దీంతో షారుఖ్ అన్న మాటలపై క్లారిటీ ఇస్తున్నారు అతడి ఫ్యాన్స్. షారుఖ్ చరణ్ ను అవమానించలేదని.. కేవలం తన మూవీలోని డైలాగ్ మాత్రమే చెప్పాడంటూ అందుకు సంబంధించిన వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు.షారుఖ్ ఖాన్ గతంలో ప్రధాన పాత్రలో నటించిన చిత్రాల్లో 'వన్ 2 కా 4'. ఈ మూవీలో షారుఖ్ ఓ డైలాగ్ చెబుతారు. ఆ మూవీలో సౌత్ లో ఫేమస్ అయిన వాటి గురించి మాట్లాడుతూ.. ఇడ్లీ, వడ, సూపర్ స్టార్ రజినీకాంత్ అంటూ షారుఖ్ సంబోధిస్తారు. ఇక అదే డైలాగ్‏ను అంబానీ ఈవెంట్లో చరణ్ ను పిలిచేటప్పుడు ఉపయోగించాడు షారుఖ్ ఖాన్. రజినీకాంత్ పేరు స్థానంలో రామ్ చరణ్ పేరు పెట్టి షారుఖ్ ఆ డైలాగ్ చెప్పారంటూ బాద్ షా ఫ్యాన్స్ షేర్ చేస్తున్నారు.
" style="height: 731px;">



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Purushottham Vinay]]>