PoliticsVijayaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/sunita-chandrababu-jagan3f338466-85a6-44f5-9389-ae68043767a0-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/sunita-chandrababu-jagan3f338466-85a6-44f5-9389-ae68043767a0-415x250-IndiaHerald.jpgజగన్ అంటే ఉన్న మంట, కసి కారణంగా ఆమె ఆరోపణలకు ఎల్లోమీడియా అత్యంత ప్రాధాన్యతిస్తోంది. హత్యలో అవినాష్ ప్రమేయముందన్న ఆధారాలను సీబీఐ కూడా చూపించలేకపోయింది. కొంతకాలం గుటు టేకౌట్ ప్రకారం అవినాష్ కు నిందితులకు సంబంధముందని వాదించిన సీబీఐ కూడా తన వాదనను తర్వాత ఉపసంహరించుకున్నది. అయితే ఇపుడు తాజాగా అవినాష్, భాస్కరరెడ్డే కాకుండా హత్యలో జగన్ పాత్రకూడా ఉందనే ఆరోపణలు మొదలుపెట్టింది. ఇక్కడే సునీత ఆరోపణల మీద అందరికీ అనుమానాలు పెరిగిపోతున్నాయి. sunita chandrababu jagan{#}devineni avinash;kadapa;Y S Vivekananda Reddy;Letter;CBI;Reddy;CBN;Jagan;Father;Wife;Husbandఅమరావతి : సునీత వ్యవహారం తేలిపోతోందా ?అమరావతి : సునీత వ్యవహారం తేలిపోతోందా ?sunita chandrababu jagan{#}devineni avinash;kadapa;Y S Vivekananda Reddy;Letter;CBI;Reddy;CBN;Jagan;Father;Wife;HusbandTue, 05 Mar 2024 03:00:00 GMT

ఎన్నికలు సమీపిస్తున్న నేపధ్యంలో జగన్మోహన్ రెడ్డి వ్యతిరేకులంతా ఒక్కొక్కళ్ళు ముసుగులో నుండి బయటకు వస్తున్నారు. తాజాగా జగన్ కజిన్ సునీత చేసిన వ్యాఖ్యలే ఇందుకు ఉదాహరణగా నిలుస్తోంది. తన తండ్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్యలో కడప ఎంపీ అవినాష్ రెడ్డి, ఆయనే తండ్రి భాస్కరరెడ్డి ప్రమేయం ఉందని మాత్రమే సునీత ఆరోపణలు చేస్తున్నారు. అదికూడా ఎలాంటి ఆధారాలను చూపకుండానే ఆరోపణల మీద ఆరోపణలు చేసేస్తున్నారు.





జగన్ అంటే ఉన్న మంట, కసి కారణంగా ఆమె ఆరోపణలకు ఎల్లోమీడియా అత్యంత ప్రాధాన్యతిస్తోంది.  హత్యలో అవినాష్ ప్రమేయముందన్న ఆధారాలను సీబీఐ కూడా చూపించలేకపోయింది. కొంతకాలం గుటు టేకౌట్ ప్రకారం అవినాష్ కు నిందితులకు సంబంధముందని వాదించిన సీబీఐ కూడా తన వాదనను తర్వాత ఉపసంహరించుకున్నది. అయితే ఇపుడు తాజాగా అవినాష్, భాస్కరరెడ్డే కాకుండా హత్యలో జగన్ పాత్రకూడా ఉందనే ఆరోపణలు మొదలుపెట్టింది. ఇక్కడే సునీత ఆరోపణల మీద అందరికీ అనుమానాలు పెరిగిపోతున్నాయి.





ఇంతకాలం నిందితులను జగన్ రక్షిస్తున్నాడని మాత్రమే అనుమానం వ్యక్తంచేసిన సునీత ఇపుడు జగన్ పాత్రపైన కూడా సీబీఐ దర్యాప్తు చేయాలని డిమాండ్ చేయటమే విడ్డూరంగా ఉంది. విచిత్రం ఏమిటంటే  వివేకాను చంపానని ఒప్పుకుని, ఎలా చంపింది పూసగుచ్చినట్లు వివరించిన దస్తగిరి బెయిల్ మీద బయట తిరుగుంటే బెయిల్ రద్దుచేసి జైలుకు పంపాలని సునీత అసలు మాటమాత్రంగా కూడా డిమాండ్ చేయటంలేదు. దస్తగిరి బెయిల్ రద్దుచేయాలని వివేకా పీఏ కృష్ణారెడ్డి పిటీషన్ వేస్తే దాన్ని సునీత వ్యతిరేకించారు.





ఇక్కడే సునీత వైఖరి మీద అందరికీ అనుమానాలు మొదలయ్యాయి. జగన్ పైన చేసిన ఆరోపణలతో ఆమె చంద్రబాబు తరపున మాట్లాడుతున్నారని అర్ధమైపోయింది. సరిగ్గా ఎన్నికలకు ముందు ఇలాంటి నిరాధార ఆరోపణలను చేశారంటేనే విచిత్రంగా ఉంది. వివేకా రెండో భార్య షమీమ్ సీబీఐకి లేఖ రాసి సునీతతో పాటు ఆమె భర్త నర్రెడ్డి రాజశేఖరరెడ్డి మీదే అనుమానాలు వ్యక్తంచేస్తే పట్టించుకోవటంలేదు. పైగా షమీమ్ తమపైన కుట్రచేస్తున్నట్లు సునీత ఎదురు ఆరోపణలు చేశారు. అంటే ఆమె ఎవరిపైనైనా ఆరోపణలు చేయచ్చు, ఆమె ఆరోపణలమీద సదరు వ్యక్తులను వెంటనే జైలులో పెట్టాలి. అదే ఎదుటివాళ్ళు తనపైన ఆరోపణలు చేస్తే మాత్రం కుట్ర.






మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Vijaya]]>