PoliticsVijayaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/nagababu-anakapalli8e57e117-e80a-4767-af72-ac525349186b-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/nagababu-anakapalli8e57e117-e80a-4767-af72-ac525349186b-415x250-IndiaHerald.jpgఇక్కడ విషయం ఏమిటంటే నాగబాబు గెలవాలంటే ముందు తెలుగుదేశంపార్టీ నుండి ఓట్ల బదిలీ కావాలి. జనసేన ఓట్లు గంపగుత్తగా పడటంతో పాటు కాపుల ఓట్లు పడాలి, తర్వాత టీడీపీ నుండి ఓట్లు బదిలీకావలి. ఆ తర్వాత మిగిలిన సామాజికవర్గం ఓట్లు నాగబాబుకు పడాలి. ఇవన్నీ జరగాలంటే ముందు టీడీపీ అసెంబ్లీ అభ్యర్ధుల ఎంపిక సక్రమంగా జరగాలి. ఈ ఎంపికలోనే టీడీపీలో బాగా గొడవలవుతున్నాయి. ఇదే సమయంలో జనసేన అభ్యర్ధుల ఎంపికలో కూడా వివాదాలు పెరిగిపోతున్నాయి. nagababu anakapalli{#}Anakapalle;Nagababu;Pawan Kalyan;Janasena;Assembly;TDP;Partyఉత్తరాంధ్ర : నాగబాబు చేతులెత్తేశారా ?ఉత్తరాంధ్ర : నాగబాబు చేతులెత్తేశారా ?nagababu anakapalli{#}Anakapalle;Nagababu;Pawan Kalyan;Janasena;Assembly;TDP;PartyMon, 04 Mar 2024 05:00:00 GMT

మెగా బ్రదర్స్ లో మధ్యముడైన నాగబాబు చేతులెత్తేశారా ? గ్రౌండ్ లెవల్లో జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే అందరిలోను ఇదే అనుమానం పెరిగిపోతోంది. ఇంతకీ విషయం ఏమిటంటే కొంతకాలంగా నాగబాబు ఉత్తరాంధ్రలో కీలకమైన అనకాపల్లి పార్లమెంటు నుండి పోటీచేయాలని అనుకున్నారు. అనుకున్నట్లే అనకాపల్లి పార్లమెంటు పరిధిలోని అసెంబ్లీ  నియోజకవర్గాలపై రెగ్యులర్ గా సమీక్షలు కూడా చేస్తున్నారు. ఇప్పటికే రెండుసార్లు సమీక్షలు పూర్తిచేశారు.





మొత్తం అసెంబ్లీనియోజకవర్గాల వారీగా సామాజికవర్గ సమీకరణల లెక్కలు, జనసేనకు గెలుపు అవకాశాలు అన్నింటినీ గట్టిగానే లెక్కలు వేసుకున్నారు. అన్నీ వేసుకునే రంగంలోకి దిగారు. అనకాపల్లిలోని అచ్యుతాపురం సెజ్ ప్రాంతంలో ఒక ఇంటిని అద్దెకు కూడా తీసుకున్నారట. దాదాపు రెండునెలలు అక్కడ ఉన్న నాగబాబు సడెన్ గా ఇంటిని కాళీచేసేశారని పార్టీవర్గాలు చెప్పాయి. ఇదే సమయంలో నాగబాబును తొందరపడద్దని పార్టీ అధినేత పవన్ కల్యాణ్  చెప్పారని తెలిసింది. తొందరవద్దని పవన్ సూచించటం, గ్రౌండ్ లెవల్లో సమీకరణలు మారిపోవటంతో పోటీ విషయంలో మెగాబ్రదర్స్ పునరాలోచనలో పడినట్లు సమాచారం.





ఇక్కడ విషయం ఏమిటంటే నాగబాబు గెలవాలంటే ముందు తెలుగుదేశంపార్టీ నుండి ఓట్ల బదిలీ కావాలి. జనసేన ఓట్లు గంపగుత్తగా పడటంతో పాటు కాపుల ఓట్లు పడాలి, తర్వాత టీడీపీ నుండి ఓట్లు బదిలీకావలి. ఆ తర్వాత మిగిలిన సామాజికవర్గం ఓట్లు నాగబాబుకు పడాలి. ఇవన్నీ జరగాలంటే ముందు టీడీపీ అసెంబ్లీ అభ్యర్ధుల ఎంపిక సక్రమంగా జరగాలి. ఈ ఎంపికలోనే టీడీపీలో బాగా గొడవలవుతున్నాయి. ఇదే సమయంలో జనసేన అభ్యర్ధుల ఎంపికలో కూడా వివాదాలు పెరిగిపోతున్నాయి.





ఈ డెవలప్మెంట్ ను చూసుకున్న పవన్, నాగబాబును తొందరపడద్దని చెప్పారట. దాంతో నాగబాబు ఎందుకొచ్చిన తలనొప్పని పోటీ విషయంలో వెనక్కుతగ్గినట్లు తెలుస్తోంది. అంటే నాగబాబు అభ్యర్ధిత్వాన్ని బహిరంగంగా ప్రకటించకముందే పోటీకి రెడీ అయిపోవటం, వెనక్కు తగ్గటం కూడా అయిపోయిందని అర్ధమవుతోంది. మరి నోటిఫికేషన్ వచ్చేనాటికి ఇంకెతమంది పోటీ నుండి వెనక్కుతగ్గుతారో అనే విషయమై పార్టీలో అయోమయం పెరిగిపోతోంది. మరి చివరకు ఏమిజరుగుతుందో చూడాలి.





మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Vijaya]]>