Sportspraveeneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/sports/libra_libra/ipl1b551e75-6dcb-44e3-841f-087c5d0c5b67-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/sports/libra_libra/ipl1b551e75-6dcb-44e3-841f-087c5d0c5b67-415x250-IndiaHerald.jpgబిసిసిఐ ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహించే ఇండియన్ ప్రీమియర్ లీగ్ టోర్నీలో సన్రైజర్స్ హైదరాబాద్ జట్టు ఒక్కసారి ఛాంపియన్గా నిలిచింది అన్న విషయం తెలిసిందే. అప్పుడెప్పుడో డేవిడ్ వార్నర్ కెప్టెన్సీలో ఐపీఎల్ టైటిల్ గెలుచుకుంది. కానీ అప్పటినుంచి సన్రైజర్స్ జట్టుకి ఎక్కడ కలిసి రావడం లేదు. ఇక ప్రతిసారి కూడా టైటిల్ ఫేవరెట్ గా బరిలోకి దిగుతూ తీవ్రంగా నిరాశ పరుస్తూ వస్తుంది అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే జట్టు యాజమాన్యం ప్రతి సీజన్లో కూడా ఇక టీంలోని ఆటగాళ్ల విషయంలో ఎన్నో మార్పులు చేస్తుంది. ఇక ప్రతిసారి Ipl{#}South Africa;Athadu;Hyderabad;Indianఈసారి కప్పు గెలుస్తుందనుకుంటే.. సన్రైజర్స్ కు ఇంత పెద్ద షాక్ తగిలిందేంటి?ఈసారి కప్పు గెలుస్తుందనుకుంటే.. సన్రైజర్స్ కు ఇంత పెద్ద షాక్ తగిలిందేంటి?Ipl{#}South Africa;Athadu;Hyderabad;IndianMon, 04 Mar 2024 08:24:03 GMTబిసిసిఐ ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహించే ఇండియన్ ప్రీమియర్ లీగ్ టోర్నీలో సన్రైజర్స్ హైదరాబాద్ జట్టు ఒక్కసారి ఛాంపియన్గా నిలిచింది అన్న విషయం తెలిసిందే. అప్పుడెప్పుడో డేవిడ్ వార్నర్ కెప్టెన్సీలో ఐపీఎల్ టైటిల్ గెలుచుకుంది. కానీ అప్పటినుంచి సన్రైజర్స్ జట్టుకి ఎక్కడ కలిసి రావడం లేదు. ఇక ప్రతిసారి కూడా టైటిల్ ఫేవరెట్ గా బరిలోకి దిగుతూ తీవ్రంగా నిరాశ పరుస్తూ వస్తుంది అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే  జట్టు యాజమాన్యం ప్రతి సీజన్లో కూడా ఇక టీంలోని ఆటగాళ్ల విషయంలో ఎన్నో మార్పులు చేస్తుంది. ఇక ప్రతిసారి కూడా కొత్త కెప్టెన్లతోనే బరులోకి దిగుతుంది. అయినప్పటికీ సన్రైజర్స్ కు అదృష్టం మాత్రం అస్సలు కలిసి రావట్లేదు.


 అయితే గత రెండు సీజన్ల పాటు సౌత్ ఆఫ్రికా కెప్టెన్ మార్కరమ్ చేతిలో సారధ్య బాధ్యతలు పెట్టి ఐపీఎల్లో బరిలోకి దిగింది సన్రైజర్స్. కానీ ఇక ఈ ఏడాది మాత్రం మరో కొత్త కెప్టెన్ తో ఐపీఎల్ ప్రస్తానాన్ని మొదలు పెట్టబోతుంది. 20.5 కోట్లు పెట్టి కొనుగోలు చేసిన ప్యాట్ కమిన్స్ కి కెప్టెన్సీ అప్పగించబోతుంది అన్న విషయంపై ఇప్పటికీ ఒక క్లారిటీ వచ్చేసింది అన్న విషయం తెలిసిందే. గత ఏడాది డిసెంబర్లో జరిగిన వేలంలో కొత్త ఆటగాళ్లను జట్టులోకి తీసుకోవడంతో ప్రస్తుతం సన్రైజర్స్ పటిష్టంగానే కనిపిస్తుంది. ఈ క్రమంలోనే ఈసారి ఐపీఎల్లో గట్టి పోటీ ఇవ్వడం ఖాయమని అందరూ అనుకుంటున్నారు. ఇలాంటి సమయంలో అటు సన్రైజర్స్ హైదరాబాద్ జట్టుకి ఊహించని ఎదురు దెబ్బలు తగ్గుతున్నాయి.



 ఐపీఎల్ 2024 ప్రారంభానికి ముందు సన్రైజర్స్ హైదరాబాద్ జట్టుకు  భారీ షాక్ తగిలే అవకాశం ఉంది అన్నది తెలుస్తుంది. ఆ జట్టు బౌలింగ్ కోచ్ టీం ఈ సీజన్ కి దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నాడట. ఇక వ్యక్తిగత కారణాలతోనే అతను విరామం తీసుకోవాలని అనుకుంటున్నట్లు తెలుస్తోంది. అయితే అన్ని సజావుగా సాగితే వచ్చే యేడాది అతడు మళ్లీ సన్రైజర్స్ హైదరాబాద్ జట్టుతో జాయిన్ అవుతాడని సమాచారం. అయితే గత కొంతకాలం నుంచి సన్రైజర్స్ బౌలింగ్ విభాగం బాగా రాణించడంలో కీలక పాత్ర వహిస్తున్నాడు డెయిల్ స్టేయిన్. ఇక అలాంటి వ్యక్తి ఇక ఇప్పుడు జట్టుకు దూరం అవడంతో జట్టు వ్యూహాలు మొత్తం తారుమారు అయ్యే అవకాశం ఉంది అని చెప్పాలి.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>