EditorialChakravarthi Kalyaneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/editorial/77/jagan486759cf-8562-4a04-851d-858cff8f9504-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/editorial/77/jagan486759cf-8562-4a04-851d-858cff8f9504-415x250-IndiaHerald.jpgతాము అధికారంలోకి వస్తే పలువురి అధికారుల సంగతి చూస్తామని.. నారా లోకేశ్ రెడ్ డెయిరీ లో పేర్లు రాసుకొని మరీ హెచ్చరిస్తున్నారు. తాజాగా తెలుగుదేశం, జనసేన అధికారంలోకి వస్తే ముందుగా టార్గెట్ అయ్యే అధికారి ప్రముఖంగా ఐపీఎస్ అధికారి రఘురామిరెడ్డి పేరు వినిపిస్తోంది. కాకపోతే ఓ చిన్న లాజిక్ ను మార్చిపోతున్నారు. జగన్ ను అరెస్ట్ చేసి జైలులో పెట్టిందెవరు జేడీ లక్ష్మీ నారాయణ. కానీ సీఎం అయిన తర్వాత జగన్ ఆయనపై వ్యక్తిగతంగా కక్ష పెంచుకొని ఇబ్బంది పెట్టలేదు. తనను లక్ష్యంగా చేసుకొని.. ఇబ్బంది పెట్టిన కాంగ్రెస్ అధిషjagan{#}Jagan;Nara Lokesh;Lakshmi Devi;Arrest;Congress;Janasena;CM;Government;TDP;mediaసూపర్‌ విజిలెన్స్‌.. జగన్‌ అంత సాహసం చేస్తారా?సూపర్‌ విజిలెన్స్‌.. జగన్‌ అంత సాహసం చేస్తారా?jagan{#}Jagan;Nara Lokesh;Lakshmi Devi;Arrest;Congress;Janasena;CM;Government;TDP;mediaMon, 04 Mar 2024 11:00:00 GMTతాము అధికారంలోకి వస్తే పలువురి అధికారుల సంగతి చూస్తామని.. నారా లోకేశ్ రెడ్ డెయిరీ లో పేర్లు రాసుకొని మరీ హెచ్చరిస్తున్నారు. తాజాగా తెలుగుదేశం, జనసేన అధికారంలోకి వస్తే  ముందుగా టార్గెట్ అయ్యే అధికారి ప్రముఖంగా ఐపీఎస్ అధికారి రఘురామిరెడ్డి పేరు వినిపిస్తోంది. కాకపోతే ఓ చిన్న లాజిక్ ను మార్చిపోతున్నారు. జగన్ ను అరెస్ట్ చేసి జైలులో పెట్టిందెవరు జేడీ లక్ష్మీ నారాయణ. కానీ సీఎం అయిన తర్వాత జగన్ ఆయనపై వ్యక్తిగతంగా కక్ష పెంచుకొని ఇబ్బంది పెట్టలేదు. తనను లక్ష్యంగా చేసుకొని.. ఇబ్బంది పెట్టిన కాంగ్రెస్ అధిష్ఠానానికి ఎదురు తిరిగి ఆ పార్టీకి ఏపీలో నామరూపాలు లేకుండా చేశారు. కానీ టీడీపీ నేతలు వారి అనుకూల మీడియా అధికారులను లక్ష్యంగా చేసుకుంటున్నారు.


రాష్ట్రంలోని అన్ని కీలక, ఇంజినీరింగ్ విభాగాల్లో విజిలెన్స్ వింగ్ ఉంటుంది. తమ శాఖలో జరిగిన లోటు పాటుపై ఒ కన్నేసి ఉంచుతుంది. ఇక.. రాష్ట్ర స్థాయిలో విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్ మెంట్ విభాగం ఉంటుంది. మీడియాలో వచ్చే వార్తలు, తమకు అందే ఫిర్యాదులతో పాటు సుమోటోగా కూడా స్పందించి ఆయా అంశాలపై విచారణ జరపవచ్చు. ప్రభుత్వానికి నష్టం కలిగించే చర్యలను గుర్తించి బాధ్యులపై చర్యలకు సిఫార్సు చేయవచ్చు. దీనిపై అంతిమ నిర్ణయం ప్రభుత్వానిదే.  ప్రస్తుతం ఈ విభాగానికి అధిపతిగా కొల్లి రఘురామిరెడ్డి ఉన్నారు.


ఆయన గత నెలలో ప్రభుత్వానికి ఒక అసాధారణ  ప్రతిపాదన పంపించారు. పది పేజీల లేఖలోని అంశాలను క్లుప్తంగా చెప్పాలంటే. . రాష్ట్రంలోని అన్ని కీలక శాఖలకు సంబంధించిన అధికారాలనునాకే అప్పగించండి..నేను సూపర్ పవర్ గా మారి.. అన్ని రకాల అక్రమాలను అరికట్టి ప్రభుత్వ ఆదాయానికి గండి పడకుండా అడ్డుకుంటాను అని తెలిపారు. దీని వెనుక ఉద్దేశం విపక్షాలను లక్ష్యంగా చేసుకొని దాడులు చేయడమే అని ఎల్లో మీడియా రాసుకొచ్చింది. ఒకవేళ ప్రభుత్వం కనుక దీనికి అనుమతి ఇస్తే విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్ మెంట్ ఒక అసాధారణ శక్తిగా మారుతుంది.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chakravarthi Kalyan]]>