HealthPurushottham Vinayeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/health/movies_news/mango-flowerfb4aa87f-772d-475a-ac2f-3d46ae9aea62-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/health/movies_news/mango-flowerfb4aa87f-772d-475a-ac2f-3d46ae9aea62-415x250-IndiaHerald.jpgవేసవి కాలం వచ్చేసింది. మామిడి పండ్లని తెచ్చిపెట్టింది. పండ్లలో రారాజైన మామిడి పండు ఇష్టపడని వారంటూ ఎవరూ ఉండరు.. అయితే, మామిడి పండ్లను తింటే గడ్డలు వస్తాయని, వేడి చేస్తాయని చాలామంది భయపడతారు.కానీ మామిడి పండ్లు చేసే మేలు అంతా ఇంత కాదు. కేవలం మామిడి పండ్లు మాత్రమే కాదు. మామిడి పువ్వు కూడా చాలా మేలు చేస్తుంది.వేసవి కాలంలో చాలా మంది కూడా వేడి వల్ల ముక్కుదిబ్బడ సమస్యతో బాధపడుతుంటారు. వేడి వల్ల ఈ సమస్య వస్తే, మామిడి పువ్వు వాసన ఈ సమస్యను తగ్గించగలదు.మామిడి పువ్వు మధుమేహాన్ని నియంత్రించడంలో సహాయపడే అనేకMango Flower{#}Rasam;Cholesterolమామిడి పువ్వు ఆరోగ్యానికి ఎంత మంచిదో తెలుసా?మామిడి పువ్వు ఆరోగ్యానికి ఎంత మంచిదో తెలుసా?Mango Flower{#}Rasam;CholesterolSun, 03 Mar 2024 18:32:30 GMTవేసవి కాలం వచ్చేసింది. మామిడి పండ్లని తెచ్చిపెట్టింది. పండ్లలో రారాజైన మామిడి పండు ఇష్టపడని వారంటూ ఎవరూ ఉండరు.. అయితే, మామిడి పండ్లను తింటే గడ్డలు వస్తాయని, వేడి చేస్తాయని చాలామంది భయపడతారు.కానీ మామిడి పండ్లు చేసే మేలు అంతా ఇంత కాదు. కేవలం మామిడి పండ్లు మాత్రమే కాదు. మామిడి పువ్వు కూడా చాలా మేలు చేస్తుంది.వేసవి కాలంలో చాలా మంది కూడా వేడి వల్ల ముక్కుదిబ్బడ సమస్యతో బాధపడుతుంటారు. వేడి వల్ల ఈ సమస్య వస్తే, మామిడి పువ్వు వాసన ఈ సమస్యను తగ్గించగలదు.మామిడి పువ్వు మధుమేహాన్ని నియంత్రించడంలో సహాయపడే అనేక లక్షణాలను కలిగి ఉంది. మీరు మామిడి పువ్వుల పొడిని తయారు చేసి, ప్రతిరోజూ ఉదయం ఒక చెంచా నీటిలో త్రాగవచ్చు. లేదా మామిడి పువ్వు రసం తీసి ఉదయాన్నే సేవించాలి. ఇది మధుమేహాన్ని అదుపులో ఉంచుతుంది.ఈ రోజుల్లో ఎసిడిటీ సమస్య సర్వసాధారణం అయిపోయింది. ఈ సమస్యను దూరం చేయడంలో మామిడి పువ్వు రసం చాలా ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది. ఇది జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది.


గ్యాస్, మలబద్ధకం వంటి సమస్యల నుంచి ఉపశమనం కలిగిస్తుంది.ఈమధ్య కాలంలో తప్పుడు ఆహారం కొలెస్ట్రాల్ సమస్యకు దారి తీస్తోంది. కొలెస్ట్రాల్‌కు అతి పెద్ద కారణం ఫాస్ట్ ఫుడ్, క్రమరహిత జీవనశైలి. దీని వల్ల చాలా మందికి బరువు పెరిగే సమస్య ఉంటుంది. బరువు తగ్గాలంటే మామిడి పువ్వు రసం తాగండి. దీని రసాన్ని క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల కొవ్వు తగ్గుతుంది. కొలెస్ట్రాల్ కూడా అదుపులోకి వస్తుంది.వేసవిలో చాలా మందికి కూడా కడుపునొప్పి అనేది సాధారణ సమస్యగా మారిపోయింది. విరేచనాలు, అసిడిటీ, డీహైడ్రేషన్, అనేక ఇతర జీర్ణ సమస్యలు వస్తాయి. అటువంటి పరిస్థితుల్లో మామిడి పువ్వును తినడం చాలా ఉపయోగకరంగా ఉంటుంది. జీర్ణవ్యవస్థను మెరుగుపరచడానికి మామిడి పువ్వులను తినండి. దీని కోసం మామిడి పువ్వులను రాత్రంతా నీటిలో నానబెట్టండి. తర్వాత దీన్ని వడగట్టి ఉదయాన్నే తాగాలి. మామిడి పువ్వులు ప్రకృతిలో చల్లదనాన్ని కలిగి ఉంటాయి. కడుపులో వేడిని శాంతపరుస్తాయి.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Purushottham Vinay]]>