PoliticsDivyaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/ycp-manipost-talk-vijaisai-reddy0854151c-bcae-4098-810e-08301aa654cd-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/ycp-manipost-talk-vijaisai-reddy0854151c-bcae-4098-810e-08301aa654cd-415x250-IndiaHerald.jpgవైసిపి ప్రభుత్వం మరొకసారి అధికారం చేపట్టాలని లక్ష్యంతో ఆవైపుగా అడుగులు వేస్తోంది.. వచ్చే అసెంబ్లీ ఎన్నికలలో మెజారిటీ సీట్లను సైతం గెలుపొందాలని మరొకసారి సీఎం పీఠాన్ని అందుకోవాలని వైయస్ జగన్మోహన్ రెడ్డి గారు భావిస్తున్నారు. ఆమెరకు సిద్ధం సభల పేరిట భారీగానే బహిరంగ సభలను ఏర్పాటు చేస్తున్నారు.. ప్రజా క్షేత్రంలోకీ వెళ్లి మరి ప్రజలతో మమేకమవుతూ ఉన్నారు. ఇదే సమయంలో ఓటర్లను ఆకర్షించే విధంగా తమ మేనిఫెస్టో సిద్ధం చేస్తున్నారు వైసిపి నాయకులు.. ఈ మ్యానిఫెస్టో ఈనెల బాపట్ల జిల్లా మెదరమెట్ల వద్ద నిర్వహించే సిద్ధYCP;MANIPOST;TALK;VIJAISAI REDDY{#}vedhika;Guntur;Scheduled Tribes;Prakasam;Tirupati;Saturday;Bapatla;VijayaSaiReddy;Jagan;YCP;MP;Telangana Chief Minister;Reddy;Government;CM;Assembly;PartyYcp: వైసిపి మేనిఫెస్టోకు ముహూర్తం ఫిక్స్ చేసిన విజయసాయి రెడ్డి..!!Ycp: వైసిపి మేనిఫెస్టోకు ముహూర్తం ఫిక్స్ చేసిన విజయసాయి రెడ్డి..!!YCP;MANIPOST;TALK;VIJAISAI REDDY{#}vedhika;Guntur;Scheduled Tribes;Prakasam;Tirupati;Saturday;Bapatla;VijayaSaiReddy;Jagan;YCP;MP;Telangana Chief Minister;Reddy;Government;CM;Assembly;PartySun, 03 Mar 2024 10:00:00 GMTవైసిపి ప్రభుత్వం మరొకసారి అధికారం చేపట్టాలని లక్ష్యంతో ఆవైపుగా అడుగులు వేస్తోంది.. వచ్చే అసెంబ్లీ ఎన్నికలలో మెజారిటీ సీట్లను సైతం గెలుపొందాలని మరొకసారి సీఎం పీఠాన్ని అందుకోవాలని వైయస్ జగన్మోహన్ రెడ్డి గారు భావిస్తున్నారు. ఆమెరకు సిద్ధం సభల పేరిట భారీగానే బహిరంగ సభలను ఏర్పాటు చేస్తున్నారు.. ప్రజా క్షేత్రంలోకీ వెళ్లి మరి ప్రజలతో మమేకమవుతూ ఉన్నారు. ఇదే సమయంలో ఓటర్లను ఆకర్షించే విధంగా తమ మేనిఫెస్టో సిద్ధం చేస్తున్నారు వైసిపి నాయకులు.. ఈ మ్యానిఫెస్టో ఈనెల బాపట్ల జిల్లా మెదరమెట్ల వద్ద నిర్వహించే సిద్ధం సభలో విడుదల చేయాలని వైసిపి పార్టీ ఖరారు చేసినట్లు తెలుస్తోంది.


ఈ బహిరంగ సభకు పెద్ద ఎత్తున ప్రజలు వచ్చేలా కసరత్తులు చేస్తున్నారు. ఈ సభ ఏర్పాట్లను వైసీపీ ఎంపీ విజయ సాయి రెడ్డి దగ్గరుండి మరి పర్యవేక్షిస్తున్నట్లు తెలుస్తోంది.. ఈ సిద్ధం సభకు సంబంధించి పోస్టర్ను శనివారం ఒంగోలులో రిలీజ్ చేశారు.. అలాగే ఈ సభకు సంబంధించిన ప్రమోషన్ సాంగ్స్ ను కూడా విడుదల చేయడం జరిగింది. ఈ సందర్భంగా ఎంపీ విజయసాయిరెడ్డి మాట్లాడుతూ.. మేదరమెట్ల సిద్ధం సభలో వైసీపీ మేనిఫెస్టో సీఎం గారి చేతులమీదుగా విడుదల చేయబోతున్నామంటూ తెలియజేశారు..


మేదరమెట్ల సభకు తిరుపతి బాపట్ల గుంటూరు నెల్లూరు పలనాడు ప్రకాశం జిల్లాలోని 43 అసెంబ్లీ నియోజకవర్గాల నుంచి దాదాపుగా 15 లక్షల మంది హాజరు కాబోతున్నారంటే వెల్లడించారు.. గత నాలుగేళ్లలో పది నెలల కాలంలో ప్రజలు ముఖ్యంగా ఎస్సీ, ఎస్టీ బీసీ మైనారిటీ వర్గాల కోసం వైఎస్సార్సీపి పార్టీ ఏం చేసిందో ముఖ్యమంత్రి ప్రజలకు ఏం చేశారని అవగాహన కల్పిస్తామంటూ తెలిపారు.. సంక్షేమ పథకాల అభివృద్ధి ఇతరత్రా కార్యక్రమాల ద్వారా వచ్చే ఐదేళ్ల ప్రజలకు ఎలాంటి పాలన అందించడం పైన కూడా హైలెట్ చేస్తామంటూ విజయసాయిరెడ్డి తెలిపారు.. ఈ సభ తర్వాత సీఎం జగన్మోహన్ రెడ్డి నియోజకవర్గాల వారీగా పర్యటిస్తారని తెలిపారు.. దాదాపు ఈ వేదిక 100 ఎకరాలను సిద్ధం చేస్తున్నామని ఒకవేళ సరిపోకపోతే మరో 100 ఎకరాలు వినియోగించుకుంటామంటే తెలిపారు.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Divya]]>