Moviespraveeneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/tollywoodc7db72c2-c0d1-41ba-91ff-644ff8d9a851-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/tollywoodc7db72c2-c0d1-41ba-91ff-644ff8d9a851-415x250-IndiaHerald.jpgసినిమా అనే రంగుల ప్రపంచంలో ఎలాంటి సినీ బ్యాగ్రౌండ్ లేకుండా చిత్ర పరిశ్రమ లోకి అడుగుపెట్టి ఇక ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకోవడం అంటే అంత సులభమైన విషయమేమీ కాదు. ఇక ఎన్నో కష్టనష్టాలను ఎదుర్కొని కెరియర్ను నిలబెట్టుకోవాల్సి ఉంటుంది అన్న విషయం తెలిసిందే. అయితే ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో ఇలా బ్యాగ్రౌండ్ లేకుండా వచ్చి ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్న హీరోలు చాలామంది ఉన్నారు. అలాంటి వారిలో విశ్వక్ సేన్ కూడా ఒకరు అన్న విషయం తెలిసిందే. సాధారణంగా అయితే ఇక బ్యాగ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీకి ఎTollywood{#}producer;Film Industry;Producer;Viswak sen;Mass;Tollywood;Yevaru;Cinemaఇకపై సినిమాల్లో.. అలాంటి సాహసాలు చేయను : విశ్వక్ఇకపై సినిమాల్లో.. అలాంటి సాహసాలు చేయను : విశ్వక్Tollywood{#}producer;Film Industry;Producer;Viswak sen;Mass;Tollywood;Yevaru;CinemaSun, 03 Mar 2024 12:15:00 GMTసినిమా అనే రంగుల ప్రపంచంలో ఎలాంటి సినీ బ్యాగ్రౌండ్ లేకుండా చిత్ర పరిశ్రమ లోకి అడుగుపెట్టి ఇక ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకోవడం అంటే అంత సులభమైన విషయమేమీ కాదు. ఇక ఎన్నో కష్టనష్టాలను ఎదుర్కొని కెరియర్ను నిలబెట్టుకోవాల్సి ఉంటుంది అన్న విషయం తెలిసిందే. అయితే ప్రస్తుతం  టాలీవుడ్ ఇండస్ట్రీలో ఇలా బ్యాగ్రౌండ్ లేకుండా వచ్చి ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్న హీరోలు చాలామంది ఉన్నారు. అలాంటి వారిలో విశ్వక్ సేన్ కూడా ఒకరు అన్న విషయం తెలిసిందే.


 సాధారణంగా అయితే ఇక బ్యాగ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన హీరోలు తమకు ఎవరైనా దర్శక నిర్మాతలు  అవకాశాలు ఇవ్వకపోతారా అని ఎంతో ఆశగా ఎదురు చూస్తూ ఉంటారు. కానీ విశ్వక్సేన్ మాత్రం అందరిలా చేయలేదు. ఎవరో వచ్చి అవకాశాలు ఇస్తారు అని వేచి చూడకుండా.  ఏకంగా అతనే ప్రొడ్యూసర్ గా.. అతనే డైరెక్టర్గా మారి అతనే హీరోగా కూడా చేసి  తన కెరియర్ను తానే నిలబెట్టుకున్నాడు అని చెప్పాలి. ఇక ఎన్ని విమర్శలు వచ్చిన పట్టించుకోకుండా వరుసగా సినిమాలు చేస్తూ దూసుకుపోతూ ఉన్నాడు. ఇకపోతే ప్రస్తుతం కాస్త డిఫరెంట్ కథలను ప్రయత్నిస్తూ ప్రేక్షకులను సర్ప్రైజ్ చేసేందుకు సిద్ధమవుతున్నాడు మాస్ కా దాస్ విశ్వక్సేన్. ఈ క్రమంలోనే ప్రస్తుతం గామి సినిమాలో నటించాడు అన్న విషయం తెలిసిందే.


 ఈ సినిమా మరికొన్ని రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. అయితే ఇక ఈ సినిమాలో ఎవరు ఊహించని విధంగా ఏకంగా అఘోరా పాత్రలో కనిపించాడు విశ్వక్ సేన్. అయితే గామి చిత్రీకరణ సమయంలో కొన్ని ప్రమాదకరమైన సన్నివేశాలు చిత్రీకరణలో భయపడిపోయినట్లు చెప్పుకొచ్చాడు. హిమాలయాల్లోని ఒక గడ్డ కట్టిన నది పై సన్నివేశం చిత్రీకరించాల్సి ఉంది. ఇక ఆ సన్నివేశం ఎంతో సవాలుగా అనిపించింది. పైకి నది మొత్తం గడ్డకట్టినట్టు ఉన్న లోపల మాత్రం ఎంతో వేగంగా నది పరుగులు పెడుతుంది. అయితే చాందిని షూట్ సమయంలో మంచు పగిలిపోతున్న శబ్దం రావడంతో ఆమె వెంటనే బయటకి పరుగులు పెట్టుకుంటూ వచ్చింది. ఈ ఘటన తర్వాత నుంచి షూటింగ్లో ఇలాంటి సాహసాలు చేయకూడదు అని నిర్ణయించుకున్న అంటూ విశ్వక్సేన్ చెప్పుకొచ్చాడు.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>