MoviesPurushottham Vinayeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/malayalambd1fce77-8e61-4204-9f10-7580c6b3fc84-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/malayalambd1fce77-8e61-4204-9f10-7580c6b3fc84-415x250-IndiaHerald.jpgప్రస్తుతం మలయాళం ఇండస్ట్రీ మాత్రం వరుస విజయాలతో కళకళలాడుతుంది. మొన్న భ్రమయుగం, నిన్న ప్రేమలు ఇంకా నేడు మంజుమెల్ బాయ్స్. వరుస హిట్లతో మలయాళం ఇండస్ట్రీ పాన్ ఇండియా బాక్స్ ఆఫీస్ ని షేక్ చేస్తుంది.ఇక వందల కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన మన సినిమాలు కనీస స్పందన తెచ్చుకోవడం లేదు. కానీ మలయాళం లో మాత్రం చాలా తక్కువ బడ్జెట్ తో తెరకెక్కిన సినిమాలు భారీ వసూళ్లు సాధిస్తూ బ్లాక్ బస్టర్ హిట్లతో దూసుకుపోతున్నాయి.ఇక తాజాగా మలయాళంలో రీసెంట్ గా హిట్ అయిన సినిమాలకి కనీసం 20 కోట్ల బడ్జెట్ కూడా పెట్టలేదు. రీసెంట్ గా రిలMalayalam{#}Chidambaram;Blockbuster hit;Tamilnadu;Kerala;Jr NTR;Box office;Industry;February;Cinema;India;Heroబాక్స్ ఆఫీస్ పై మలయాళ సినిమాల దండయాత్ర?బాక్స్ ఆఫీస్ పై మలయాళ సినిమాల దండయాత్ర?Malayalam{#}Chidambaram;Blockbuster hit;Tamilnadu;Kerala;Jr NTR;Box office;Industry;February;Cinema;India;HeroSat, 02 Mar 2024 18:15:50 GMTప్రస్తుతం మలయాళం ఇండస్ట్రీ మాత్రం వరుస విజయాలతో కళకళలాడుతుంది. మొన్న భ్రమయుగం, నిన్న ప్రేమలు ఇంకా నేడు మంజుమెల్ బాయ్స్. వరుస హిట్లతో మలయాళం ఇండస్ట్రీ పాన్ ఇండియా బాక్స్ ఆఫీస్ ని షేక్ చేస్తుంది.ఇక వందల కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన మన సినిమాలు కనీస స్పందన తెచ్చుకోవడం లేదు. కానీ మలయాళం లో మాత్రం చాలా తక్కువ బడ్జెట్ తో తెరకెక్కిన సినిమాలు భారీ వసూళ్లు సాధిస్తూ బ్లాక్ బస్టర్ హిట్లతో దూసుకుపోతున్నాయి.ఇక తాజాగా మలయాళంలో రీసెంట్ గా హిట్ అయిన సినిమాలకి కనీసం 20 కోట్ల బడ్జెట్ కూడా పెట్టలేదు. రీసెంట్ గా రిలీజ్ అయిన లెజెండరి హీరో మమ్మూట్టి భ్రమ యుగం 50 కోట్ల మార్క్ ని దాటేసి వంద కోట్ల దిశగా పరుగులు పెడుతుంది. అలాగే ప్రేమలు అనే చిన్న సినిమా కూడా 70 కోట్లపైగా వసూళ్లు రాబట్టి 100 కోట్లకి ఇంచు దూరంలో ఉంది.తాజాగా మరో సినిమా కూడా వంద కోట్ల వైపుగా అడుగులు వేస్తూ ఇప్పుడు వార్తల్లో నిలుస్తుంది. చిదంబరం ఎస్ దర్శకత్వంలో రూపొందిన “మంజుమెల్ బాయ్స్” అనే చిన్న సినిమా పోయిన వారం రిలీజ్ అయ్యి మౌత్ టాక్ తో దుమ్ములేపింది.


ఈ సినిమాలో అంతా చిన్న నటీనటులే నటించినప్పటికీ, పెద్దగా అంచనాల్లేకుండా థియేటర్లలో రిలీజ్ అయి మౌత్ టాక్ తో బాక్స్ ఆఫీస్ పై విజయభేరి మోగించింది ఈ సినిమా.మంజుమెల్ బాయ్స్ చిదంబరం దర్శకత్వం లో తెరకెక్కగా, శోభున్ షాహిర్ హీరోగా నటించి నిర్మించడం జరిగింది. ఇక ఫిబ్రవరి 22న థియేటర్లలో రిలీజ్ అయిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద భారీ వసూళ్లు రాబడుతూ స్పీడ్ గా దూసుకుపోతుంది. ఫస్ట్ వీక్ కేవలం ఇండియా లోనే కేరళ తో పాటు, తమిళనాడు ఇంకా కర్ణాటక ఏరియాల కలెక్షన్స్ తో కలిపి 55 కోట్ల గ్రాస్ వసూలు చేయగా, వరల్డ్ వైడ్ గా 65 కోట్ల వసూళ్లని ఈ సినిమా దాటింది. ఇక రెండో వారం ఖచ్చితంగా 100 కోట్ల క్లబ్ లో చేరడం ఖాయమని ట్రేడ్ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.మంజుమెల్ బాయ్స్ లో శోభున్ షాహిర్ తో పాటు, శ్రీనాథ్ బాసి, బాలు వర్గేస్, గణపతి ఎస్, జూనియర్ లాల్, దీపక్, అరుణ్ ఇంకా అభిరాం ప్రధాన పాత్రల్లో నటించారు. ఫ్రెండ్షిప్ బ్యాక్ డ్రాప్ లో వచ్చిన ఈ మూవీ ప్రేక్షకుల నుండి విశేష స్పందన తెచ్చుకుంది. ఇలా వరుసగా మూడు బ్లాక్ బస్టర్లు కొట్టి కళకళలాడిపోతుంది మలయాళం ఇండస్ట్రీ.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Purushottham Vinay]]>