EditorialChakravarthi Kalyaneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/editorial/77/chandrababu89476e65-9ca5-4658-ac8d-230ffbf9b612-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/editorial/77/chandrababu89476e65-9ca5-4658-ac8d-230ffbf9b612-415x250-IndiaHerald.jpgఏపీలోఇప్పుడు అన్నీ పార్టీలు అభ్యర్థుల ఎంపికపై దృష్టి సారించాయి. కాకపోతే ఈ విషయంలో వైసీపీ దూకుడు మీద ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున అభ్యర్థులను మార్చుతూ జాబితాలు విడుదల చేస్తూ సంచలన నిర్ణయాలు తీసుకుంటున్నారు. మరోవైపు టీడీపీ, జనసేన పొత్తులో భాగంగా 99మంది అభ్యర్థులను ప్రకటించేశారు. ఇందులో టీడీపీ 94 చోట్ల, జనసేన 5 స్థానాల్లో పోటీ చేయనుంది. ఇదిలా ఉండగా చంద్రబాబు విడుదల చేసిన జాబితాలో ఆశ్చర్యపడే నిర్ణయాలు ఏమీ లేవు. సీఎం జగన్ ఏమో సోషల్ ఇంజినీరింగ్ పేరుతో జనరల్ స్థానాల్లో ఓసీ అభ్యర్థులను మారchandrababu{#}Vijayawada;devineni avinash;BOTCHA SATYANARAYANA;Jaleel Khan;Mylavaram;Penamaluru;Narasaraopeta;srinivas;CBN;Party;Janasena;TDP;YCP;CM;Telugu;Marchమార్పులతో హడలెత్తిస్తున్న చంద్రబాబు?మార్పులతో హడలెత్తిస్తున్న చంద్రబాబు?chandrababu{#}Vijayawada;devineni avinash;BOTCHA SATYANARAYANA;Jaleel Khan;Mylavaram;Penamaluru;Narasaraopeta;srinivas;CBN;Party;Janasena;TDP;YCP;CM;Telugu;MarchSat, 02 Mar 2024 13:00:00 GMTఏపీలోఇప్పుడు అన్నీ పార్టీలు అభ్యర్థుల  ఎంపికపై దృష్టి సారించాయి. కాకపోతే ఈ విషయంలో వైసీపీ దూకుడు మీద ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున అభ్యర్థులను మార్చుతూ జాబితాలు విడుదల చేస్తూ సంచలన నిర్ణయాలు తీసుకుంటున్నారు. మరోవైపు టీడీపీ, జనసేన పొత్తులో భాగంగా 99మంది అభ్యర్థులను ప్రకటించేశారు. ఇందులో టీడీపీ 94 చోట్ల, జనసేన 5 స్థానాల్లో పోటీ చేయనుంది.


ఇదిలా ఉండగా చంద్రబాబు విడుదల చేసిన జాబితాలో ఆశ్చర్యపడే నిర్ణయాలు ఏమీ లేవు.  సీఎం జగన్ ఏమో సోషల్ ఇంజినీరింగ్ పేరుతో జనరల్ స్థానాల్లో ఓసీ అభ్యర్థులను మార్చి వాటిని బీసీలకు కేటాయిస్తున్నారు.  మరికొంత మందిని వేరే నియోజకవర్గాలకు మార్చుతూ నిర్ణయాలు తీసుకుంటున్నారు. చంద్రబాబు విడుదల చేసిన జాబితాలో చాలామంది సీనియర్ తెలుగు తమ్ముళ్లకు ఆయన షాక్ ఇచ్చారు. పార్టీ ఆవిర్భావం నుంచి పనిచేస్తున్న కొంతమంది పేర్లు తొలి జాబితాలో లేకపోవడం వారిని సైతం ఆశ్చర్యానికి గురి చేసింది.


ఇదిలా ఉండగా సీఎం జగన్ అభ్యర్థులను నియోజకవర్గాలు మార్చితే .. రాజకీయాల్లో ట్రాన్స్ ఫర్లను ఇప్పుడే చూస్తున్నానని చంద్రబాబు ఎద్దేవా చేశారు. ఇప్పుడేమో ఆయన దేవినేని ఉమను మైలవరం నుంచి కాకుండా పెనమలూరు నుంచి, గంటా శ్రీనివాస్ ప్రస్తుతం ప్రాతినిథ్యం వహిస్తున్న చోటు నుంచి కాకుండా బొత్స సత్యనారాయణపై పోటీ  చేయాలని కోరతున్నారు.


ఇప్పుడు విడుదల చేసే జాబితాలో పలు మార్పులకు చంద్రబాబు శ్రీకారం చుడుతున్నారు. అభ్యర్థులను బదిలీ చేయడం, లేక కొత్తముఖాలకు చోటు ఇచ్చేలా ఆయన కసరత్తులు చేస్తున్నారు. విజయవాడ వెస్ట్ సీటును జనసేన తమకే కావాలని పట్టుబడుతోంది. మరోవైపు జలీల్ ఖాన్ నేనే పోటీ చేసి తీరుతానని తేల్చి చెబుతున్నారు. కానీ టీడీపీ వివేక్ కుమారుడి పేరుతో సర్వేలు చేపిస్తోంది. యరపతినేని శ్రీనివాసరావుని ఆయన సొంత నియోజకవర్గం కాకుండా నర్సరావుపేట లో పోటీ చేయించేలా ప్రణాళికలు రచిస్తున్నారు. అదే సందర్భంలో యరపతినేని నియోజకవర్గంలో వైసీపీ ఎమ్మెల్సీ జంగా కృష్ణామూర్తి పేరుతో టీడీపీ సర్వేలు చేయిస్తోంది. మొత్తంగా అయితే రెండో జాబితాలో కొన్ని ఆశ్చర్యపడే నిర్ణయాలు ఉంటాయని తెలుస్తోంది.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chakravarthi Kalyan]]>