Moviesmurali krishnaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/socialstars-lifestylec15c976d-cd50-4823-9e04-4af0c9cc484b-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/socialstars-lifestylec15c976d-cd50-4823-9e04-4af0c9cc484b-415x250-IndiaHerald.jpgచిత్ర పరిశ్రమకు చెందిన ఎంతోమంది నటీనటులు ప్రేమించి పెళ్లి చేసుకుంటున్న విషయం తెలిసిందే. వెండితెర, బుల్లితెరకు చెందిన ఎంతోమంది మంది నటీనటులు తమ సహనటులను ప్రేమించి పెళ్లి చేసుకుంటున్నారు.కొంతమంది మాత్రం పెద్దలు కుదర్చిన పెళ్లిళ్లు చేసుకుంటున్నారు. అయితే పెళ్లి చేసుకున్న కొద్ది కాలం తర్వాత వివిధ కారణాలతో విడాకులు తీసుకుంటున్న జంటలు కూడా ఉన్నారు. ఆర్థిక విషయాలు, కెరీర్ పరమైన విభేదాల కారణంగా వైవాహిక బంధానికి గుడ్ బై చెప్పుకుంటున్నారు. ఎంతో అన్యోన్యంగా ఉండే జంట హఠాత్తుగా విడిపోవడంతో ఫ్యాన్స్ షాక్ తింటsocialstars lifestyle{#}Chandramukhi;Kollywood;Rajani kanth;Kannada;BEAUTY;nayantara;prema;marriage;Husband;Director;Heroine;Love;Juneనెట్టింటా వైరల్ అవుతున్న నయనతార ఇన్‌స్ట్రాగ్రామ్ పోస్ట్..!!నెట్టింటా వైరల్ అవుతున్న నయనతార ఇన్‌స్ట్రాగ్రామ్ పోస్ట్..!!socialstars lifestyle{#}Chandramukhi;Kollywood;Rajani kanth;Kannada;BEAUTY;nayantara;prema;marriage;Husband;Director;Heroine;Love;JuneSat, 02 Mar 2024 21:58:29 GMTచిత్ర పరిశ్రమకు చెందిన ఎంతోమంది నటీనటులు ప్రేమించి పెళ్లి చేసుకుంటున్న విషయం తెలిసిందే. వెండితెర, బుల్లితెరకు చెందిన ఎంతోమంది మంది నటీనటులు తమ సహనటులను ప్రేమించి పెళ్లి చేసుకుంటున్నారు.కొంతమంది మాత్రం పెద్దలు కుదర్చిన పెళ్లిళ్లు చేసుకుంటున్నారు. అయితే పెళ్లి చేసుకున్న కొద్ది కాలం తర్వాత వివిధ కారణాలతో విడాకులు తీసుకుంటున్న జంటలు కూడా ఉన్నారు. ఆర్థిక విషయాలు, కెరీర్ పరమైన విభేదాల కారణంగా వైవాహిక బంధానికి గుడ్ బై చెప్పుకుంటున్నారు. ఎంతో అన్యోన్యంగా ఉండే జంట హఠాత్తుగా విడిపోవడంతో ఫ్యాన్స్ షాక్ తింటున్నారు.స్టార్ హీరోయిన్ నయనతార గురించి ప్రత్యేక పరిచయం అక్కరలేదు. చంద్రముఖి చిత్రంతో రజినీకాంత్ సరసన నటించి తెలుగు, తమిళ, కన్నడ ఇండస్ట్రీలో ఒకేసాని వరుస ఛాన్సులు దక్కించుకుంది. గత కొంత కాలంగా డైరెక్టర్ విగ్నేష్ శివన్ తో చట్టాపట్టాలేసుకొని తిరిగిన ఈ బ్యూటీ ఆ మధ్యపెళ్లి చేసుకున్నారు. అంతే కాదు సరోగసి పద్దతిలో కవల పిల్లను కూడా కన్నారు. కోలీవుడ్ లో క్యూట్ కపుల్ అంటే ఇలా ఉండాలని అనుకునేలా ఫోటోలు, వీడియోలు షేర్ చేసేవారు. ఇటీవల నయనతార ఇన్‌స్టాలోకి అడుగుపెట్టింది. తన భర్త, పిల్లలకు సంబందించిన ఫోటోలు షేర్ చేయడంతో లక్షల మంది లైక్ లు, కామెంట్స్ పెట్టి వారి అభిమానాన్ని చాటుకుంటున్నారు. ప్రస్తుతం ఆమెకు ఇన్ స్ట్రాలో 78 లక్షల మంది ఫాలోవర్స్ ఉన్నారు. తాజాగా నయనతార తన భ్త విగ్నేష్ శివన్ ని ఇన్ స్టాలో అన్ ఫాలో చేయడంతో ఫ్యాన్స్ షాక్ తిన్నారు. అసలు ఈ క్యూట్ కపుల్ మధ్య ఏం జరుగుతందన్న విషయంపై చర్చలు మొదలయ్యాయి.

నయనతార సోషల్ మాధ్యమంలో పెట్టిన పోస్ట్ ఇప్పుడు తెగ వైరల్ అవుతుంది. ఏదైనా పొరపాటున ఇలా చేశారా? లేక సాంకేతిక లోపం వల్ల విగ్నేష్ శివన్ పేరు కనిపించలేదా? రక రకాలుగా నెటిజన్లు అభిప్రాయ పడుతున్నారు. గతంలో పలు ప్రేమ వ్యవహారాలు నడిపించిన నయనతార.. విగ్నేష్ శివన్ తో చాలా కాలం పాటు సహజీవనం చేసిన తర్వాత ఇరు కుటుంబ పెద్దల అంగీకారంతో 2022, జూన్ మాసంలో వివాహబంధంలోకి అడుగు పెట్టింది. తాజాగా నయన్ పెట్టిన పోస్ట్ 'ఆమె కన్నీళ్లతో కూడా ఇది నాకు లభిస్తుందని ఎప్పటికీ చెబుతుంది' అనే అర్ధం వచ్చేలా ఓ ఇంగ్లీష్ కొటేషన్ పెట్టింది. అంతేకాదు భర్త విగ్నేష్ ని ఇన్‌స్ట్రాగ్రామ్ లో అన్ ఫాలో చేసింది. గతంలో సెలబ్రెటీలు విడిపోయే ముందు ఇలాంటి సంకేతాలు పంపిస్తుంటారని ఇండస్ట్రీలో టాక్. అయితే నయన్ అన్ ఫాలో చేసినా.. విగ్నేష్ మాత్రం ఫాలో అవుతున్నాడు. నయన్ చేసిన పోస్ట్ పై మీ అభిప్రాయాలు కామెంట్స్ రూపంలో తెలియజేయండి.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - murali krishna]]>