Crimepraveeneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/crime/135/suicide-30943182-b6d6-42d7-954e-2a86a10ebbf7-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/crime/135/suicide-30943182-b6d6-42d7-954e-2a86a10ebbf7-415x250-IndiaHerald.jpgప్రభుత్వ ఉద్యోగం అంటే ప్రతి ఒక్కరికి ఇష్టమే. ఎందుకంటే అందరిలా టైం టు టైం డ్యూటీ చేయాల్సిన అవసరం లేదు. పొద్దున్నే వెళ్లాల్సిన డ్యూటీకి మధ్యాహ్నం వెళ్ళినా సరిపోతుంది. పట్టించుకునే నాధుడే ఎవరు ఉండరు. ఇక ప్రజలైన ప్రశ్నిస్తారా అంటే.. అమ్మో ఆ సార్ ని ఎందుకులేటు వచ్చారు అని అడిగితే.. మా పనిచేయకుండా ఇబ్బంది పెడతారేమో అని భయపడుతూ సైలెంట్ గానే ఉండిపోతారు. అందుకే గవర్మెంట్ ఉద్యోగం అంటే చాలు ఇక అందరికీ నచ్చుతుంది. అందుకే ఫీజీలు చదివిన వారి దగ్గర నుంచి పదవ తరగతి పాస్ అయిన వారి వరకు అందరూ కూడా ప్రభుత్వ ఉద్యోSuicide {#}police;job;Sucide;Adilabad;Siva Kumar;Yevaru;Governmentవిద్యార్థి ప్రాణం తీసిన.. నిమిషం నిబంధన.. అసలేం జరిగిందంటే?విద్యార్థి ప్రాణం తీసిన.. నిమిషం నిబంధన.. అసలేం జరిగిందంటే?Suicide {#}police;job;Sucide;Adilabad;Siva Kumar;Yevaru;GovernmentThu, 29 Feb 2024 21:00:00 GMTప్రభుత్వ ఉద్యోగం అంటే ప్రతి ఒక్కరికి ఇష్టమే. ఎందుకంటే  అందరిలా టైం టు టైం డ్యూటీ చేయాల్సిన అవసరం లేదు. పొద్దున్నే వెళ్లాల్సిన డ్యూటీకి మధ్యాహ్నం వెళ్ళినా సరిపోతుంది. పట్టించుకునే నాధుడే ఎవరు ఉండరు. ఇక ప్రజలైన ప్రశ్నిస్తారా అంటే.. అమ్మో ఆ సార్ ని ఎందుకులేటు వచ్చారు అని అడిగితే.. మా పనిచేయకుండా ఇబ్బంది పెడతారేమో అని భయపడుతూ సైలెంట్ గానే ఉండిపోతారు. అందుకే గవర్మెంట్ ఉద్యోగం అంటే చాలు ఇక అందరికీ నచ్చుతుంది. అందుకే ఫీజీలు చదివిన వారి దగ్గర నుంచి పదవ తరగతి పాస్ అయిన వారి వరకు అందరూ కూడా ప్రభుత్వ ఉద్యోగం సాధించాలని తెగ ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. అయితే ప్రభుత్వ ఉద్యోగులు టైం కి రాకపోయిన పట్టించుకోని ప్రభుత్వం.. ఎందుకో మిగతా వారి విషయంలో మాత్రం కక్షగట్టినట్లుగానే వ్యవహరిస్తూ ఉంటుంది.

 మరిముఖ్యంగా విద్యార్థుల విషయంలో అటు అధికారులు వ్యవహరించే తీరు అయితే ఎన్నోసార్లు అందరికీ కోపం తెప్పిస్తూ ఉంటుంది. ఇక ఇప్పుడు ఇంటర్ పరీక్షలు రాస్తున్న విద్యార్థుల విషయంలో కూడా ప్రభుత్వం పెట్టిన ఒక రూల్ శాపంగా మారిపోతుంది. ఏకంగా తొమ్మిది గంటలకు ఇంటర్ ఎగ్జామ్ ప్రారంభమవుతుంది అన్న విషయం తెలిసిందే. ఒక్క నిమిషం ఆలస్యమైనా ఇక అటు పరీక్షకు అనుమతించడం లేదు అధికారులు  కాళ్లు పట్టుకొని బ్రతిమిలాడిన కూడా కనికరించడం లేదు. దీంతో పరీక్ష మిస్ అయ్యామే అనే బాధతోనే వెను తిరుగుతున్నారు విద్యార్థులు. అయితే ఇక్కడ ఒక్క నిమిషం నిబంధన చివరికి ఒక విద్యార్థి ప్రాణం పోవడానికి కారణమైంది.


 ఇంటర్మీడియట్ పరీక్షల్లో ఒక్క నిమిషం నిబంధన కారణంగా ఎగ్జామ్ రాయలేకపోయిన విద్యార్థి చివరికి బలవన్మరణానికి పాల్పడి నిండు నూరేళ్ల జీవితాన్ని అర్ధాంతరంగానే ముగించాడు. ఆదిలాబాద్ జిల్లా జైనథ్ మండలంలోని మాంగోర్ల గ్రామానికి చెందిన టేకం శివకుమార్ అనే యువకుడు ఇటీవల సాత్నాల ప్రాజెక్టు డ్యామ్ లో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. పరీక్ష రాయలేకపోయాను అనే మనోవేదనతోనే ఆత్మహత్యకు ముందు తండ్రికి సూసైడ్ లెటర్ రాశాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అయితే ఇది ముమ్మాటికి ప్రభుత్వ హత్యే.. ఒక్క నిమిషం నిబంధన పెట్టకపోయి ఉంటే ఆ విద్యార్థి బతికేవాడు. ఆ తల్లిదండ్రులకు కడుపుకోత మిగిలేది కాదు అంటూ ఎంతోమంది ఈ ఘటనపై స్పందిస్తూ విమర్శలు చేస్తున్నారు.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>