Sportspraveeneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/sports/libra_libra/rohithb753aa19-5328-49cf-80d6-99ccdb867fa5-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/sports/libra_libra/rohithb753aa19-5328-49cf-80d6-99ccdb867fa5-415x250-IndiaHerald.jpgఇండియన్ ప్రీమియర్ లీగ్ హిస్టరీలో ఛాంపియన్ టీం ఏది అంటే ముంబై ఇండియన్స్ పేరును చెప్పేస్తూ ఉంటారు అందరూ. అయితే ఇప్పటివరకు ఐదు టైటిల్స్ గెలిచింది ఈ జట్టు. ఈ 5 టైటిల్స్ ని కూడా అందించింది కేవలం కెప్టెన్ రోహిత్ శర్మ మాత్రమే. అంతకుముందు ఎంతో మంది దిగ్గజాలు సారాధ్య బాధ్యతలు చేపట్టిన జట్టుకు టైటిల్ అందించలేకపోయారు. కానీ రోహిత్ ఎప్పుడైతే కెప్టెన్ గా మారాడో.. అప్పటినుంచి అతి తక్కువ సమయంలోనే ఐదు సార్లు జట్టును ఐపీఎల్ టైటిల్ విజేతగా నిలిపాడు. తన కెప్టెన్సీ తో ప్రేక్షకులు అందరిని కూడా మెస్మరైజ్ చేశాడు అనRohith{#}SUNIL GAVASKAR;Champion;Rohit Sharma;Hardik Pandya;Cricket;Mumbai;Audienceరోహిత్ ను కెప్టెన్ గా తప్పించడం మంచి నిర్ణయం.. గవాస్కర్ ఇలా అన్నాడేంటి?రోహిత్ ను కెప్టెన్ గా తప్పించడం మంచి నిర్ణయం.. గవాస్కర్ ఇలా అన్నాడేంటి?Rohith{#}SUNIL GAVASKAR;Champion;Rohit Sharma;Hardik Pandya;Cricket;Mumbai;AudienceThu, 29 Feb 2024 07:40:00 GMTఇండియన్ ప్రీమియర్ లీగ్ హిస్టరీలో ఛాంపియన్ టీం ఏది అంటే ముంబై ఇండియన్స్ పేరును చెప్పేస్తూ ఉంటారు అందరూ. అయితే ఇప్పటివరకు ఐదు టైటిల్స్ గెలిచింది ఈ జట్టు. ఈ 5 టైటిల్స్ ని కూడా అందించింది కేవలం కెప్టెన్ రోహిత్ శర్మ మాత్రమే. అంతకుముందు ఎంతో మంది దిగ్గజాలు  సారాధ్య బాధ్యతలు చేపట్టిన జట్టుకు టైటిల్ అందించలేకపోయారు. కానీ రోహిత్ ఎప్పుడైతే కెప్టెన్ గా మారాడో.. అప్పటినుంచి అతి తక్కువ సమయంలోనే ఐదు సార్లు జట్టును ఐపీఎల్ టైటిల్ విజేతగా నిలిపాడు.


 తన కెప్టెన్సీ తో ప్రేక్షకులు అందరిని కూడా మెస్మరైజ్ చేశాడు అని చెప్పాలి. అంతేకాదు అతను ఒక ఛాంపియన్ కెప్టెన్ అన్న విధంగా ప్రస్తానాన్ని కొనసాగిస్తూ ఉన్నాడు. ఇక అలాంటి రోహిత్ శర్మను ఏకంగా సారధ్య బాధ్యతల నుంచి తప్పిస్తూ ముంబై ఇండియన్స్ యాజమాన్యం నిర్ణయం తీసుకుంది. కొత్త కెప్టెన్ గా హార్దిక్ పాండ్యాను నియమించింది. ఇక అతని సారథ్యంలోనే  2024 ఐపీఎల్ సీజన్లో ముంబై ఇండియన్స్ బరిలోకి దిగబోతుంది. ఈ క్రమంలోనె రోహిత్ లాంటి ఆటగాడిని కెప్టెన్గా తొలగించడం పై తీవ్రస్థాయిలో విమర్శలు ఎదుర్కొంది జట్టు యాజమాన్యం.


 అయితే ఇలా ఇప్పటికీ కూడా రోహిత్ ను కెప్టెన్ గా తప్పించడం పై విమర్శలు వస్తున్న వేళ సునీల్ గవాస్కర్ ఈ విషయంపై స్పందించాడు. ఏకంగా ఐపీఎల్ లో ముంబై ఇండియన్స్ కెప్టెన్ గా రోహిత్ శర్మను తప్పించడం ఆ జట్టుకు మంచిదే అంటూ అభిప్రాయపడ్డాడు గవాస్కర్. దీనివలన రోహిత్ ఆటగాడిగా రాణించగలుగుతాడు అంటూ అంచనా వేశాడు. వరల్డ్ కప్, ఐదు మ్యాచ్ల టెస్ట్ సిరీస్ ఇలా తీరిక లేకుండా క్రికెట్ ఆడుతున్న రోహిత్ శర్మకు కెప్టెన్సీ భారం తగ్గించడం మంచిదే. దీని వల్ల అతనిపై ఒత్తిడి భారం కూడా తగ్గుతుంది అంటూ గావాస్కర్ చెప్పుకొచ్చాడు. ఎలాగో హార్థిక్ కి రోహిత్ శర్మ నుంచి మద్దతు ఉంటుంది అంటూ అభిప్రాయపడ్డాడు.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>