DebateChakravarthi Kalyaneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/debate/138/nara-lokesh62d0e83a-0916-424b-80e4-142adcb7c66f-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/debate/138/nara-lokesh62d0e83a-0916-424b-80e4-142adcb7c66f-415x250-IndiaHerald.jpgచంద్రబాబు పక్కా వ్యూహంతో ఈసారి ఎన్నికలకు సన్నద్ధం అవుతున్నారు. ఓ వైపు పొత్తుల రాజకీయం చేస్తూనే మరోవైపు పార్టీని చక్కబెట్టేస్తున్నారు. దీనికోసం వైసీపీ నుంచి చేరికలను ప్రోత్సహిస్తున్నారు. ఇంకో వైపు సీట్లు రాని నేతలను సముదాయిస్తున్నారు. ఇప్పుడు ఓడిపోతే పార్టీ మనుగడ కష్టమే అనే భావనతో ఎన్నికలకు తన సర్వ శక్తులూ ధారపోస్తున్నారు. ఇదిలా ఉండగా చంద్రబాబు తన విజన్ గురించి ఎక్కువగా ప్రస్తావిస్తూ ఉంటారు. తాను ఏం చేసినా భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని చేస్తూ ఉంటానని సెలవిస్తూ ఉంటారు. ఇప్పుడు అదే నిజం ఏమో అnara lokesh{#}rachana;Smart phone;Nara Lokesh;Nijam;Deputy Chief Minister;YCP;Jagan;CBN;Partyరోజురోజుకూ నారా లోకేశ్‌.. హిట్టా.. ఫ్లాపా?రోజురోజుకూ నారా లోకేశ్‌.. హిట్టా.. ఫ్లాపా?nara lokesh{#}rachana;Smart phone;Nara Lokesh;Nijam;Deputy Chief Minister;YCP;Jagan;CBN;PartyWed, 28 Feb 2024 10:00:00 GMTచంద్రబాబు పక్కా వ్యూహంతో ఈసారి ఎన్నికలకు సన్నద్ధం అవుతున్నారు. ఓ వైపు పొత్తుల రాజకీయం చేస్తూనే మరోవైపు పార్టీని చక్కబెట్టేస్తున్నారు. దీనికోసం వైసీపీ నుంచి చేరికలను ప్రోత్సహిస్తున్నారు. ఇంకో వైపు సీట్లు రాని నేతలను సముదాయిస్తున్నారు. ఇప్పుడు ఓడిపోతే పార్టీ మనుగడ కష్టమే అనే భావనతో ఎన్నికలకు తన సర్వ శక్తులూ ధారపోస్తున్నారు.


ఇదిలా ఉండగా చంద్రబాబు తన విజన్ గురించి ఎక్కువగా ప్రస్తావిస్తూ ఉంటారు. తాను ఏం చేసినా భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని చేస్తూ ఉంటానని సెలవిస్తూ ఉంటారు. ఇప్పుడు అదే నిజం ఏమో అనిపిస్తోంది. ఈసారి ఎన్నికల్లో ఓడిపోయినా పార్టీకి మరో 25 ఏళ్లు ఢోకా లేకుండా చేయాలని తగిన వ్యూహాలు పనుతున్నారు. పార్టీకి నాయకత్వ సమస్య తలెత్తకుండా తన నైపుణ్యాన్ని రంగరించి కుమ్మరిస్తున్నారు. బీజేపీతో పొత్తు పెట్టుకున్న పవన్ ను ఆ పార్టీ నుంచి వేరు చేసి తన వైపు తిప్పుకొని విజయవంతం అయ్యారు.


తద్వారా ఏపీలో తమకు ప్రత్యామ్నాయం లేకుండా చేసుకున్నారు. 2014, 19లో ఆ పరిస్థితులు ఎదురైనా వాటిని తట్టుకొని నిలబడగలిగారు. కానీ ప్రస్తుతం చంద్రబాబు క్లిష్ట పరిస్థితులు ఎదుర్కొంటున్నారు. ఈ సమయంలో ఏపీలో ప్రతిపక్షంగా ఎదుగుతున్న జనసేనను తన పక్కన తెచ్చి పెట్టుకున్నారు. దీంతో ప్రత్యామ్నాయ రాజకీయం లేకుండా చేశారు. అయితే జగన్ లేకుంటే చంద్రబాబు, లోకేశ్ అనే భావనను ప్రజల్లోకి తీసుకెళ్తున్నారు.


లోకేశ్ ను పార్టీ కార్యకర్తలంతా తమ నాయకుడిలా భావించేలా వ్యూహ రచన మొదలు పెట్టారు. ఇటీవల ప్రకటించిన అభ్యర్థుల జాబితాలో లోకేశే వారికి ఫోన్ చేసి చెప్పినట్లు తెలుస్తోంది. టికెట్ రాని నేతలకు కూడా ఫోన్ చేసి లోకేశ్ సముదాయించారు. మొత్తంగా అభ్యర్థుల ఎంపికలో మార్పులు, చేర్పులు సీఎంగా చంద్రబాబే ఉంటారు.. డిప్యూటీ సీఎం చంద్రబాబు చేతుల్లో ఉంటుందని వంటి అంశాలను నారా లోకేశే ప్రకటిస్తూ తనను భవిష్యత్తు నాయకుడిగా పరిచయం చేసుకుంటున్నారు.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chakravarthi Kalyan]]>