DebateChakravarthi Kalyaneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/debate/138/pawan5daa4356-dc93-4a6d-86a4-33989860530d-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/debate/138/pawan5daa4356-dc93-4a6d-86a4-33989860530d-415x250-IndiaHerald.jpgటీడీపీ, జనసేన ప్రకటించిన తొలి జాబితాలో పవన్ పేరు లేకపోవడం అందర్నీ ఆశ్చర్యానికి గురి చేసింది. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం నుంచి పవన్ కల్యాణ్ పోటీ చేస్తారు అని పెద్ద ఎత్తున ప్రచారం సాగుతోంది. భీమవరం నుంచి 2019లో పోటీ చేసిన పవన్ ఈ సారి కూడా అక్కడే చేసి గెలవాలని ఆ విధంగా వైసీపీకి రిటర్న్ గిఫ్ట్ ఇవ్వాలని భావించారు అని పార్టీ వర్గాలు అంటున్నాయి. అలా జరగాలని కూడా జనసైనికులు కోరుకుంటున్నారు. పవన్ భీమవరం నుంచి పోటీ చేస్తే ఈ సారి లక్షకు తగ్గకుండా మెజార్టీ ఇస్తామని చెబుతున్నారు. పవన్ కూడా ఇటీవల భీమవరంpawan{#}West Godavari;Bhimavaram;Yevaru;Gift;Pawan Kalyan;local language;Janasena;TDP;MLA;Party;Newsభీమవరంపై పవన్ విముఖత? ఓటమి భయమా?భీమవరంపై పవన్ విముఖత? ఓటమి భయమా?pawan{#}West Godavari;Bhimavaram;Yevaru;Gift;Pawan Kalyan;local language;Janasena;TDP;MLA;Party;NewsWed, 28 Feb 2024 23:00:00 GMTటీడీపీ, జనసేన ప్రకటించిన తొలి జాబితాలో పవన్ పేరు లేకపోవడం అందర్నీ ఆశ్చర్యానికి గురి చేసింది.  పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం నుంచి పవన్ కల్యాణ్ పోటీ చేస్తారు అని పెద్ద ఎత్తున ప్రచారం సాగుతోంది. భీమవరం నుంచి 2019లో పోటీ చేసిన పవన్ ఈ సారి కూడా అక్కడే చేసి గెలవాలని ఆ విధంగా వైసీపీకి రిటర్న్ గిఫ్ట్ ఇవ్వాలని భావించారు అని పార్టీ వర్గాలు అంటున్నాయి.


అలా జరగాలని కూడా జనసైనికులు కోరుకుంటున్నారు. పవన్ భీమవరం నుంచి పోటీ చేస్తే ఈ సారి లక్షకు తగ్గకుండా మెజార్టీ ఇస్తామని చెబుతున్నారు. పవన్ కూడా ఇటీవల భీమవరం వెళ్లి అక్కడి స్థానిక నాయకులతో సమావేశం అయ్యారు. అదే విధంగా టీడీపీ నేతల ఇంటికి కూడా వెళ్లారు. తనకు మద్దతు ఇవ్వాలని కోరారు. తీరా చూస్తే ఇప్పుడు పవన్ భీమవరం నుంచి పోటీ చేయడం లేదనే వార్తలు ఇప్పుడు సంచలనంగా మారాయి.


మాజీ ఎమ్మెల్యే రామాంజనేయులుని పిలిచి పోటీ చేయమని పవన్ కోరినట్లు ప్రచారం సాగింది. ఇప్పుడు దానిని కన్ఫర్మ్ చేశారు రామాంజనేయులు. నన్ను పవన్ పిలిచి మాట్లాడారు అని ఆయన చెప్పారు. భీమవరం నుంచి నేను పోటీ చేస్తానో లేదో చెప్పలేను అంటూ పవన్ అన్నారని రామంజనేయులు చెప్పడం విశేషం.  మీరు పోటీ చేస్తారా అని తనను అడిగారు అని కూడా చెప్పారు.


అయితే తాను పోటీ చేయడం కంటే పవన్ చేస్తేనే బాగుంటుంది అని చెప్పాను అని రామాంజనేయులు వెల్లడించారు. ఒకవేళ పవన్ పోటీ చేయకపోయినా ఎవరు పోటీ చేసినా.. తన మద్దతు ఉంటుందని ఆయన వెల్లడించారు. భీమవరంలో కీలక నేతగా ఉన్న ఆయన 2009లో ఎమ్మెల్యేగా గెలిచారు. తాను ఇప్పుడు జనసేనలో చేరతారు అని చెబుతున్నారు. ఇక భీమవరం నుంచి పోటీ విషయమై మరో రెండు రోజుల్లో స్పష్టత రానుంది. ఒకవేళ రామాంజనేయులు పార్టీలో చేరితే జనసేన బలం రెట్టింపవుతుంది అనడంలో సందేహం లేదు. చూద్దాం ఏం జరుగుతుందో.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chakravarthi Kalyan]]>