HealthPurushottham Vinayeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/health/movies_news/health-tips0f0919d0-48aa-4092-aa14-05feedf72bfc-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/health/movies_news/health-tips0f0919d0-48aa-4092-aa14-05feedf72bfc-415x250-IndiaHerald.jpgఈ రోజుల్లో హైబీపీ సమస్యతో ఇబ్బందిపడుతోన్న వారి సంఖ్య బాగా పెరిగిపోతోంది. మారుతోన్న జీవన విధానం, తీసుకుంటున్న ఆహారంలో మార్పుల వల్ల తక్కువ వయసులో చాలా మంది బీపీ బారిన పడుతున్నారు.కొన్ని సందర్భాల్లో అయితే హైబీపీ వల్ల స్ట్రోక్‌, గుండెపోటుకు కూడా కారణమవుతుందని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.అయితే ఇదిలా ఉంటే శరీరంలో బీపీ పెరగడం వల్ల ఎన్నో రకాల దుష్ప్రభావాలు కనిపిస్తాయి. కొన్ని రకాల లక్షణాల వల్ల బీపీని ముందుగానే గుర్తుంచవచ్చని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. రాత్రిపూట ఎక్కువగా గురక పెట్టేవారికి అధిక HEALTH TIPS{#}Ee Rojullo;BPఈ లక్షణాలుంటే హైబీపి ఖాయం?ఈ లక్షణాలుంటే హైబీపి ఖాయం?HEALTH TIPS{#}Ee Rojullo;BPWed, 28 Feb 2024 20:41:18 GMTఈ రోజుల్లో హైబీపీ సమస్యతో ఇబ్బందిపడుతోన్న వారి సంఖ్య బాగా పెరిగిపోతోంది. మారుతోన్న జీవన విధానం, తీసుకుంటున్న ఆహారంలో మార్పుల వల్ల తక్కువ వయసులో చాలా మంది బీపీ బారిన పడుతున్నారు.కొన్ని సందర్భాల్లో అయితే హైబీపీ వల్ల స్ట్రోక్‌, గుండెపోటుకు కూడా కారణమవుతుందని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.అయితే ఇదిలా ఉంటే శరీరంలో బీపీ పెరగడం వల్ల ఎన్నో రకాల దుష్ప్రభావాలు కనిపిస్తాయి. కొన్ని రకాల లక్షణాల వల్ల బీపీని ముందుగానే గుర్తుంచవచ్చని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.  రాత్రిపూట ఎక్కువగా గురక పెట్టేవారికి అధిక bp వచ్చే అవకాశం చాలా ఎక్కువ ఉందని తేలింది. పైగా దీంతోపాటు నిద్రపోతున్నప్పుడు కనిపించే ఈ లక్షణాలు కూడా హై బిపికి సంకేతం కావచ్చని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఇప్పుడు ఆ లక్షణాలు గురించి తెలుసుకుందాం.రాత్రి పడుకునే సమయంలో తలనొప్పి కూడా అధిక రక్తపోటుకు సంకేంతంగా చెబుతున్నారు.


అధిక బీపీ వల్ల వచ్చే తలనొప్పి ఉదయం పూట కంటే చాలా తీవ్రంగా ఉంటుంది.రాత్రిపూట పడుకున్న సమయంలో అధిక మూత్ర విసర్జన కూడా బీపీ లక్షణంగా చెబుతున్నారు. సాధారణంగా అధిక మూత్ర విసర్జన షుగర్‌ లక్షణంగా భావిస్తాం కానీ అధిక రక్తపోటు మూత్రపిండాలపై ఒత్తిడిని కలిగిస్తుంది దీని వల్ల మూత్రం ఉత్పత్తి పెరుగుతుందని, మూత్రవిసర్జన చేయడానికి రాత్రిపూట చాలా సార్లు లేవవలసి ఉంటుందని చెబుతున్నారు.రాత్రుళ్లు నిద్రపోయే సమయంలో ఎక్కువగా గురక వస్తున్నా బీపీకి లక్షణంగా భావించాలని చెబుతున్నారు. సాధారణంగా రాత్రిపూట గురక స్లీప్ అప్నియాగా చెబుతుంటారు. అయితే ఇది బీపీకి కూడా లక్షణంగా చెబుతున్నారు.మారుతున్న జీవనశైలి కారణంగా ఈ రోజుల్లో నిద్ర సంబంధిత సమస్యలు సర్వసాధారణంగా మారాయి. ఈ సమస్యలలో నిద్రలేమి ఒకటి, ఇది అనేక కారణాల వల్ల సంభవించవచ్చు. ఒత్తిడి, ఆందోళనతో పాటు హైబీపీ కారణంగా కూడా నిద్రలేమి సమస్య వెంటాడుతుందని నిపుణులు చెబుతున్నారు.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Purushottham Vinay]]>