
- ఇటీవల ఇండియాలో కుషాక్ ఎక్స్‌ప్లోరర్‌ను వెల్లడించిన స్కోడా
- వచ్చే ఏడాది ప్రారంభంలో సబ్-4- మీటర్ ఎస్‌యువిని లాంచ్ చేయనున్న స్కోడా
మంగళవారం నాడు, స్కోడా ఆటో ఇండియా కుషాక్ ఎక్స్‌ప్లోరర్ అని పిలువబడే కుషాక్ ఆధారంగా ఒక ప్రత్యేక కాన్సెప్ట్‌ను ప్రదర్శించింది. ఈ వెర్షన్ ఉత్పత్తిలో రావడానికి చాలాకాలం నుండి వేచి ఉన్నందున, దీని కార్‌మేకర్ స్టాండర్డ్ కుషాక్‌లో ఫీచర్ లిస్ట్ ను అప్‌డేట్ చేసే అవకాశం ఉంది.
టాప్-స్పెక్ స్టైల్ వేరియంట్ ఆధారంగా వచ్చిన ఈ స్కోడా కుషాక్ ఎక్స్‌ప్లోరర్, హెడ్స్-అప్ డిస్‌ప్లే, రెండవ వరుస విండోలకు సన్ బ్లైండ్స్ మరియు 360-డిగ్రీ కెమెరా సెటప్ వంటి అదనపు ఫీచర్లను పొందింది. ఈ ఫీచర్లు రాబోయే నెలల్లో రెగ్యులర్ కుషాక్ లో అప్పుడున్న పరిస్థితిని బట్టి అందించబడతాయని మేము ఆశిస్తున్నాము.
వేరొక చోట, స్కోడా కుషాక్ యొక్క కలర్ ఆప్షన్స్ మరియు వేరియంట్ లైనప్ లో ఎటువంటి మార్పులు లేవు. అలాగే , ప్రస్తుతం ఈ మోడల్ 1.0-లీటర్, మూడు-సిలిండర్ టిఎస్ఐ పెట్రోల్ ఇంజిన్ మరియు 1.5-లీటర్, నాలుగు-సిలిండర్ టిఎస్ఐ పెట్రోల్ ఇంజిన్ 6-స్పీడ్ మాన్యువల్, 6-స్పీడ్ టార్క్ కన్వర్టర్ ఆటోమేటిక్, మరియు 7-స్పీడ్ డిఎస్‍జి ఆటోమేటిక్ యూనిట్లతో జత చేయబడి అందుబాటులో ఉంది.
అనువాదించిన వారు: రాజపుష్ప