Sportspraveeneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/sports/libra_libra/ravishshatri7b2d7938-a7fd-4c95-8fd3-b03618345b0e-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/sports/libra_libra/ravishshatri7b2d7938-a7fd-4c95-8fd3-b03618345b0e-415x250-IndiaHerald.jpgసాధారణంగా క్రికెట్ మ్యాచ్లే కాదు అన్ని రకాల క్రీడలకు సంబంధించిన మ్యాచులు జరుగుతున్న సమయంలో ఇక ఆ మ్యాచ్లను ప్రత్యక్షంగా వీక్షించడానికి స్టేడియం లోకి వచ్చిన ప్రేక్షకులు అప్పుడప్పుడు వింతైన ఫ్లకార్డులను ప్రదర్శించడం లాంటివి చేస్తూ ఉంటారు అన్న విషయం తెలిసిందే. ఇక ఇలాంటి ఫ్లకార్డు ఎవరైనా పట్టుకున్నారు అంటే చాలు అది కాస్తా సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోతూ ఉంటుంది. గతంలో ఐపీఎల్ మ్యాచ్లు జరుగుతున్న సమయంలో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు ఐపీఎల్ టైటిల్ గెలుచుకున్నప్పుడే తాను పెళ్లి చేసుకుంటాను అంటూ రాసి Ravishshatri{#}Quotations;ravi shastri;Kurradu;James Cameron;Cricket;marriage;Audience;Englandఅండర్సన్ రిటైర్మెంట్ పై పోస్టర్.. రవి శాస్త్రి షాకింగ్ రిప్లై?అండర్సన్ రిటైర్మెంట్ పై పోస్టర్.. రవి శాస్త్రి షాకింగ్ రిప్లై?Ravishshatri{#}Quotations;ravi shastri;Kurradu;James Cameron;Cricket;marriage;Audience;EnglandTue, 27 Feb 2024 09:00:00 GMTసాధారణంగా క్రికెట్ మ్యాచ్లే కాదు అన్ని రకాల క్రీడలకు సంబంధించిన మ్యాచులు జరుగుతున్న సమయంలో ఇక ఆ మ్యాచ్లను ప్రత్యక్షంగా వీక్షించడానికి స్టేడియం లోకి వచ్చిన ప్రేక్షకులు అప్పుడప్పుడు వింతైన ఫ్లకార్డులను ప్రదర్శించడం లాంటివి చేస్తూ ఉంటారు అన్న విషయం తెలిసిందే. ఇక ఇలాంటి ఫ్లకార్డు  ఎవరైనా పట్టుకున్నారు అంటే చాలు అది కాస్తా సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోతూ ఉంటుంది. గతంలో ఐపీఎల్ మ్యాచ్లు జరుగుతున్న సమయంలో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు ఐపీఎల్ టైటిల్ గెలుచుకున్నప్పుడే తాను పెళ్లి చేసుకుంటాను అంటూ రాసి ఉన్న ఫ్లకార్డులని కొంతమంది అభిమానులు ప్రదర్శించారు.



 ఇలా ఒక్కొక్కరు ఒక్కో విధంగా తమకు నచ్చినట్లుగా ఇక ఫ్లకార్డులఫై ఎన్నో కొటేషన్స్ రాసి వాటిని ప్రదర్శించడం చేస్తూ ఉంటారు. అయితే ఇలాంటివి అటు కెమెరా కంట పడ్డాయి అంటే చాలు క్లిక్ మనిపించి సోషల్ మీడియాలో పెట్టేయడం చేస్తూ ఉంటారు. దీంతో ఇలాంటివి వైరల్ గా మారిపోతూ  ఉంటాయి. అయితే ఇటీవలే ఇండియా, ఇంగ్లాండ్ జట్ల మధ్య ముగిసిన రాంచి లోని నాలుగో టెస్ట్ సమయంలో కూడా ఒక అభిమాని ప్రదర్శించిన ప్లకార్డు వైరల్ గా మారిపోయింది. ఓ కుర్రాడు స్పెషల్ పోస్టర్ను ప్రదర్శించాడు.. ప్రస్తుతం ఇంగ్లాండ్ జట్టులో సీనియర్ బౌలర్గా కొనసాగుతున్న జేమ్స్ అండర్సన్ రిటైర్మెంట్ ప్రకటించినప్పటి నుంచి.. నేను చదవడం ప్రారంభిస్తాను అంటూ రాసి ఉన్న బోర్డుని ప్రదర్శించాడు.



 దీనిని అక్కడి కెమెరాలు ఫోకస్ చేయడంతో వైరల్ గా మారిపోయింది అని చెప్పాలి. అయితే ఇక ఈ విషయంపై టీమిండియా మాజీ ప్లేయర్ రవి శాస్త్రి తనదైన శైలిలో స్పందించాడు. అండర్సన్ ఇప్పట్లో రిటైర్మెంట్ ప్రకటించేలా లేడు. నువ్వు చాలా కాలం వేచి ఉండాలి. నువ్వు ఇప్పట్లో చదువుకునేలా లేవు. లాంగ్ హాలిడే కి వెళ్ళిపో యంగ్ మ్యాన్ అంటూ రవి శాస్త్రి సోషల్ మీడియాలో స్పందించడంతో ఇది కాస్త వైరల్ గా మారిపోయింది. సాధారణంగానే రవి శాస్త్రి ఎప్పుడు సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటాడు. తనదైన పోస్టులతో ఎప్పుడు వైరల్ గా మారిపోతూ ఉంటాడు అన్న విషయం తెలిసిందే. ఇకపోతే రాంచి వేదికగా జరిగిన నాలుగో టెస్టులో విజయం సాధించిన టీమిండియా సిరీస్ ను కైవసం చేసుకుంది.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>