MoviesPulgam Srinivaseditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/atlie10ab5ea-fa29-44c7-b5b7-8ea39da747e2-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/atlie10ab5ea-fa29-44c7-b5b7-8ea39da747e2-415x250-IndiaHerald.jpgతమిళ సినీ పరిశ్రమలో టాప్ దర్శకులలో ఒకరిగా కెరియర్ ను కొనసాగిస్తున్న వారిలో అట్లీ ఒకరు. ఈయన రాజా రాణి అనే మూవీ తో దర్శకుడుగా తన కెరియర్ ను మొదలు పెట్టి మొదటి మూవీ తోనే సూపర్ సక్సెస్ ను అందుకొని మంచి దర్శకుడిగా గుర్తింపును సంపాదించుకున్నాడు. ఆ తర్వాత ఈయన వరుసగా కోలీవుడ్ స్టార్ హీరోలలో ఒకరు అయినటువంటి విజయ్ హీరోగా తేరి , మర్సెల్ , బిగిల్ అనే మూడు సినిమాలను తెరకెక్కించి ఆ మూడింటితో కూడా అదిరిపోయే రేంజ్ విజయాలను అందుకొని తమిళ సినీ పరిశ్రమలో టాప్ డైరెక్టర్ ల లిస్ట్ లో చేరిపోయాడు. ఇకపోతే కొంత కాలం క్రAtli{#}raja;Bigil;Joseph Vijay;Darsakudu;Director;atlee kumar;nayana harshita;tara;Jawaan;bollywood;Interview;India;Box office;Kollywood;Tamil;Cinema;Successమంచి కథ దొరికితే మళ్ళీ ఆ స్టార్ తో సినిమా చేస్తా... అట్లీ..!మంచి కథ దొరికితే మళ్ళీ ఆ స్టార్ తో సినిమా చేస్తా... అట్లీ..!Atli{#}raja;Bigil;Joseph Vijay;Darsakudu;Director;atlee kumar;nayana harshita;tara;Jawaan;bollywood;Interview;India;Box office;Kollywood;Tamil;Cinema;SuccessMon, 26 Feb 2024 12:29:00 GMTతమిళ సినీ పరిశ్రమలో టాప్ దర్శకులలో ఒకరిగా కెరియర్ ను కొనసాగిస్తున్న వారిలో అట్లీ ఒకరు. ఈయన రాజా రాణి అనే మూవీ తో దర్శకుడుగా తన కెరియర్ ను మొదలు పెట్టి మొదటి మూవీ తోనే సూపర్ సక్సెస్ ను అందుకొని మంచి దర్శకుడిగా గుర్తింపును సంపాదించుకున్నాడు. ఆ తర్వాత ఈయన వరుసగా కోలీవుడ్ స్టార్ హీరోలలో ఒకరు అయినటువంటి విజయ్ హీరోగా తేరి , మర్సెల్ , బిగిల్ అనే మూడు సినిమాలను తెరకెక్కించి ఆ మూడింటితో కూడా అదిరిపోయే రేంజ్ విజయాలను అందుకొని తమిళ సినీ పరిశ్రమలో టాప్ డైరెక్టర్ ల లిస్ట్ లో చేరిపోయాడు.

ఇకపోతే కొంత కాలం క్రితం ఈయన బాలీవుడ్ స్టార్ హీరోలలో ఒకరు అయినటువంటి అట్లీ హీరో గా లేడీ సూపర్ స్టార్ నయన తార హీరోయిన్ గా జవాన్ అనే మూవీ ని రూపొందించాడు. ఈ మూవీ భారీ అంచనాల నడుమ ప్రపంచ వ్యాప్తంగా విడుదల అయ్యి 1000 కోట్లకు పైగా కలెక్షన్ లను కొల్ల గొట్టి భారీ విజయాన్ని బాక్స్ ఆఫీస్ దగ్గర సొంతం చేసుకుంది. ఈ మూవీ తో అట్లీ క్రేజ్ ఇండియా వ్యాప్తంగా పెరిగి పోయింది. ఇకపోతే తాజాగా ఈ దర్శకుడు ఓ ఇంటర్వ్యూ లో పాల్గొన్నాడు.

ఆ ఇంటర్వ్యూ లో భాగంగా షారుక్ తో మరో మూవీ గురించి అట్లీ మాట్లాడుతూ ... నా జీవితంలో చూసిన గొప్ప వ్యక్తుల్లో షారుక్ ఖాన్ ఒకరు. జవాన్ సినిమా షూటింగ్ సమయంలో ఆయన నుండి ఎన్నో విషయాలను నేర్చుకున్నాను. ఎప్పుడు ఉత్సాహంగా ఉండడం షారుక్ ఖాన్ గారి ప్రత్యేకత. మళ్లీ ఆయనతో కలిసి వర్క్ చేయాలని ఉంది. జవాన్ మూవీ కంటే మంచి కథ దొరికినప్పుడు ఆయనతో కలిసి కచ్చితంగా మరో సినిమా చేస్తాను అని తాజా ఇంటర్వ్యూ లో ఈ దర్శకుడు చెప్పుకొచ్చాడు.


మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pulgam Srinivas]]>