PoliticsPurushottham Vinayeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/cm-jagan-shocking-comments-on-chandra-babu381d077f-da8a-4f38-956c-9925ce490d92-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/cm-jagan-shocking-comments-on-chandra-babu381d077f-da8a-4f38-956c-9925ce490d92-415x250-IndiaHerald.jpgఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఉమ్మడి చిత్తూరు జిల్లాలో పర్యటించారు. కుప్పం నియోజకవర్గంలోని శాంతిపురం మఠం వద్ద సిద్ధం చేసిన బహిరంగ సభలో ప్రసంగించారు.ఈ నియోజకవర్గానికి నీరు అందించే కార్యక్రమాన్ని పండుగ వాతావరణంలో జరుపుకోవడం చాలా ఆనందంగా ఉందన్నారు. 2022 సెప్టెంబర్ 23న జరిగిన బహిరంగ సభలో ఇచ్చిన మాట నెలుబెట్టుకొని నేడు కుప్పంకు నీరు అందించామన్నారు. కుప్పంలో నీరు నిలుపుదల చేసేందుకు మరో రెండు రిజర్వాయిర్లు కూడా నిర్మిస్తామని హామీ ఇచ్చారు. గుడిపల్లి మండలం యామగానిపల్లి, శాంతిపురం మండలం మాధనపలి వద్ద మరJagan Mohan Reddy{#}kuppam;Bank;mandalam;Chittoor;Jagan;CBN;krishna;college;september;YCP;festival;CMబాబు గడ్డపై బాబుపైనే విమర్శలు చేసిన జగన్?బాబు గడ్డపై బాబుపైనే విమర్శలు చేసిన జగన్?Jagan Mohan Reddy{#}kuppam;Bank;mandalam;Chittoor;Jagan;CBN;krishna;college;september;YCP;festival;CMMon, 26 Feb 2024 17:55:35 GMTఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఉమ్మడి చిత్తూరు జిల్లాలో పర్యటించారు. కుప్పం నియోజకవర్గంలోని శాంతిపురం మఠం వద్ద సిద్ధం చేసిన బహిరంగ సభలో ప్రసంగించారు.ఈ నియోజకవర్గానికి నీరు అందించే కార్యక్రమాన్ని పండుగ వాతావరణంలో జరుపుకోవడం చాలా ఆనందంగా ఉందన్నారు. 2022 సెప్టెంబర్ 23న జరిగిన బహిరంగ సభలో ఇచ్చిన మాట నెలుబెట్టుకొని నేడు కుప్పంకు నీరు అందించామన్నారు. కుప్పంలో నీరు నిలుపుదల చేసేందుకు మరో రెండు రిజర్వాయిర్లు కూడా నిర్మిస్తామని హామీ ఇచ్చారు. గుడిపల్లి మండలం యామగానిపల్లి, శాంతిపురం మండలం మాధనపలి వద్ద మరో రిజర్వాయర్ చేపడుతున్నట్లు జగన్ తెలిపారు. మొత్తం 530 కోట్లతో రిజర్వాయిర్లు నిర్మిస్తున్నట్లు చెప్పారు. కుప్పంకు చంద్రబాబు నాయుడు ప్రయోజనం ఏమి లేదంటూ.. బ్రాంచ్ కెనాల్ పనులు కూడా చంద్రబాబు పూర్తి చేయలేదని జగన్ వివరించారు. ప్రజా ధనాన్ని ఎలా దోచుకోవాలి, ఎలా ముడుపులు తీసుకోవాలనే విషయాల మీద మాత్రమే చంద్రబాబు నాయుడు రీసెర్చ్ చేశారన్నారు. చంద్రబాబుకు కావాల్సిన వాళ్లకు మాత్రమే కాంట్రాక్ట్‎లు ఇచ్చి డబ్బులు దోచుకున్నారని జగన్ ఆరోపించారు.కుప్పం నియోజకవర్గం ప్రజల దాహార్తిని కూడా చంద్రబాబు నాయుడు తీర్చలేదని జగన్ ఎద్దేవా చేశారు.


చంద్రబాబు నాయుడు వల్ల కుప్పం ప్రజలకు మేలు జరిగిందా అని ప్రశ్నించారు. అదే క్రమంలో వైసీపీ ప్రభుత్వం వల్ల కుప్పం ప్రజలకు మేలు జరిగిందా అని కూడా అడిగారు. కుప్పంకు కృష్ణ జలాలను తీసుకొచ్చింది మీ జగన్ అని ఆయన పేర్కొన్నారు. ఇక చిత్తూరు జిల్లాకు మెడికల్ కాలేజీ రాకుండా చేసింది చంద్రబాబు అంటూ విమర్శించారు. కుప్పంను మునిసిపాలిటీ చేసింది మీ జగన్ అని తన పాలన గురించి సీఎం వివరించారు. కుప్పం నియజకవర్గంలో 87,941 కుటుంబాలు ఉంటే వైసీపీ ప్రభుత్వంలో మొత్తం 82,039 కుటుంబాలకు సంక్షేమ పథకాలు అందాయన్నారు. కేవలం మహిళలకే 1400 కోట్లు అందించాం అని జగన్ తెలిపారు. చంద్రబాబు నాయుడు హయాంలో కనీసం ఒక రూపాయి అయినా మీ బ్యాంక్ అకౌంట్‎లోకి వచ్చిందా? అని ప్రశ్నించారు. ఏ రాష్ట్రంలో కూడా 3 వేలు పెన్షన్ ఇవ్వడం లేదు.. కానీ కేవలం ఈ నియోజకవర్గంలోనే 43 వేల మందికి పెన్షన్ అందిస్తున్నామని అన్నారు. వైసీపీ హయాంలో సుమారు 15 వేల ఇళ్ల పట్టాలను ఇచ్చాం.. అలాగే ఈ నెలలో మరో 15 వేల ఇళ్ల పట్టాలు ఇవ్వబోతున్నామన్నారు.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Purushottham Vinay]]>