MoviesSeetha Sailajaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore//images/categories/movies-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore//images/categories/movies-IndiaHerald.jpgమళయాళ సూపర్ స్టార్ మమ్ముట్టి నటించిన ‘భ్రమ యుగం’ ఈనెల మళయాళంలో విడుదలై బ్లాక్ బష్టర్ హిట్ సాధించింది. ఈ సినిమాను తెలుగులో డబ్ చేసి ఈవారం విడుదల చేశారు. ఈ మూవీకి రివ్యూలు బాగున్నాయి కానీ కలక్షన్స్ అంతంత మాత్రంగానే ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ సినిమా చూసిన ప్రేక్షకులకు మాత్రం మమ్ముట్టి నట విశ్వరూపం కనిపిస్తోంది. 70 సంవత్సరాలు వయసు దాటిపోయినా ఏమాత్రం తరగని ఉత్సాహంతో అతడు డిఫరెంట్ పాత్రలు చేయడమే కాకుండా ప్రతి పాత్రలోనూ అతడు చూపిస్తున్న వైవిద్యం మన టాప్ హీరోలు చిరంజీవి నాగార్జున బాలకృష్ణ వెంకటTOP HEROES{#}Mammootty;Athadu;Balakrishna;Chiranjeevi;Rajani kanth;Telugu;News;Cinemaటాప్ సీనియర్ హీరోలు మారాలని కోరుకుంటున్న ప్రేక్షకులు !టాప్ సీనియర్ హీరోలు మారాలని కోరుకుంటున్న ప్రేక్షకులు !TOP HEROES{#}Mammootty;Athadu;Balakrishna;Chiranjeevi;Rajani kanth;Telugu;News;CinemaMon, 26 Feb 2024 09:00:00 GMTమళయాళ సూపర్ స్టార్ మమ్ముట్టి నటించిన ‘భ్రమ యుగం’ ఈనెల మళయాళంలో విడుదలై బ్లాక్ బష్టర్ హిట్ సాధించింది. ఈ సినిమాను తెలుగులో డబ్ చేసి ఈవారం విడుదల చేశారు. ఈ మూవీకి రివ్యూలు బాగున్నాయి కానీ కలక్షన్స్ అంతంత మాత్రంగానే ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ సినిమా చూసిన ప్రేక్షకులకు మాత్రం మమ్ముట్టి నట విశ్వరూపం కనిపిస్తోంది.



70 సంవత్సరాలు వయసు దాటిపోయినా ఏమాత్రం తరగని ఉత్సాహంతో అతడు డిఫరెంట్ పాత్రలు చేయడమే కాకుండా ప్రతి పాత్రలోనూ అతడు చూపిస్తున్న వైవిద్యం మన టాప్ హీరోలు చిరంజీవి నాగార్జున బాలకృష్ణ వెంకటేష్ లు ఎందుకు ఆదర్శంగా తీసుకోరు అంటూ సోషల్ మీడియాలో కొందరు ప్రశ్నలు వేస్తున్నారు. లేటెస్ట్ గా విడుదలైన ‘భ్రమ యుగం’ లో ఒక షాకింగ్ క్యారెక్టర్ లో కనిపించి అందరికీ షాక్ ఇచ్చాడు.



క్రూరమైన హావభావాలు ప్రకటిస్తూ శరీరం పై సగం సగం ఆచ్చాదనతో రెండున్నర గంటలు ఒకే క్యాస్టూమ్ తో ఈ సినిమాలో కనిపించడం ఒక్క మమ్ముట్టికే చెల్లింది అంటూ కామెంట్స్ వస్తున్నాయి. ముఖ్యంగా ఈ సినిమా క్లైమాక్స్ లో మమ్ముట్టి నట విశ్వరూపం అందర్నీ ఆకట్టుకునేలా చేసింది అన్న కామెంట్స్ వస్తున్నాయి.



గత ఏడాది ‘కథల్ ది కోర్’ లో స్వలింగ సంపర్కుడిగా నటించి సంచలనం క్రియేట్ చేసిన మమ్ముట్టి మళ్ళీ ఇలాంటి ప్రయోగాత్మక పాత్రలో నటించడమే కాకుండా ఈ సినిమాను కమర్షియల్ గా కూడ సూపర్ హిట్ చేయడంలో మళయాళ ప్రేక్షకుల అభిరుచి మరొకసారి నిరూపించుకున్నారు అన్న కామెంట్స్ వస్తున్నాయి. అయితే ఇలాంటి ప్రయోగాత్మక పాత్రలు మన సీనియర్ హీరోలు ఎందుకు చేయలేకపోతున్నారు అన్నదే ప్రశ్న. అయితే చిరంజీవి బాలకృష్ణలు డిఫరెంట్ గా ఉండే పాత్రలను ఎంచుకుని గతంలో సినిమాలు చేసినప్పటికీ వాటిని తెలుగు ప్రేక్షకులు ఆదరించ లేకపోవడంతో ప్రయోగాత్మక సినిమాలలో మన సీనియర్ హీరోలు నటించలేకపోతున్నారు అన్న కామెంట్స్ కూడ ఉన్నాయి..








మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Seetha Sailaja]]>