MoviesPurushottham Vinayeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/geethanjali-20f906c95-6dcb-4b4c-ae5d-b0c5a437bae0-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/geethanjali-20f906c95-6dcb-4b4c-ae5d-b0c5a437bae0-415x250-IndiaHerald.jpgఒకప్పుడు పెద్ద పెద్ద ఇండస్ట్రీ హిట్ సినిమాలకు కథ అందించిన కోన వెంకట్ ఇప్పుడు ఫామ్ కోల్పోయారు. మహేష్ బాబు లాంటి పెద్ద స్టార్ హీరోలకు కథలు రాసిన కోన ఇప్పుడు చిన్న సినిమాలకు రచన సహకారం అందించాల్సిన పరిస్థితి వచ్చిందని ఆయన సన్నిహితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అయితే కోన వెంకట్ మళ్లీ తిరిగి పుంజుకోవాలని ఆయన సన్నిహితులు చాలా రోజులుగా కోరుకుంటూ ఉన్నారు. ఆయన కూడా తన కలంకు పదును పెడుతూ మెల్ల మెల్లగా ఇండస్ట్రీలో బిజీ అయ్యేందుకు ప్రయత్నాలు చేస్తున్నాడు కోన వెంకట్. ఇక ఈ మధ్య కాలంలో నిర్మాతగా కోన వెంకట్‌ నGeethanjali 2{#}geetanjali;kona venkat;rachana;venkat;Dookudu;Industry;Writer;News;mahesh babu;March;Cinemaగీతాంజలి 2: కోన వెంకట్ కి బ్రేక్ ఇస్తుందా?గీతాంజలి 2: కోన వెంకట్ కి బ్రేక్ ఇస్తుందా?Geethanjali 2{#}geetanjali;kona venkat;rachana;venkat;Dookudu;Industry;Writer;News;mahesh babu;March;CinemaMon, 26 Feb 2024 12:55:57 GMTఒకప్పుడు పెద్ద పెద్ద ఇండస్ట్రీ హిట్ సినిమాలకు కథ అందించిన కోన వెంకట్ ఇప్పుడు ఫామ్ కోల్పోయారు. మహేష్ బాబు లాంటి పెద్ద స్టార్ హీరోలకు కథలు రాసిన కోన ఇప్పుడు చిన్న సినిమాలకు రచన సహకారం అందించాల్సిన పరిస్థితి వచ్చిందని ఆయన సన్నిహితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అయితే కోన వెంకట్ మళ్లీ తిరిగి పుంజుకోవాలని ఆయన సన్నిహితులు చాలా రోజులుగా కోరుకుంటూ ఉన్నారు. ఆయన కూడా తన కలంకు పదును పెడుతూ మెల్ల మెల్లగా ఇండస్ట్రీలో బిజీ అయ్యేందుకు ప్రయత్నాలు చేస్తున్నాడు కోన వెంకట్. ఇక ఈ మధ్య కాలంలో నిర్మాతగా కోన వెంకట్‌ నుంచి వరుసగా సినిమాలు వస్తున్నాయి. గతంలో కోన వెంకట్ నిర్మించిన గీతాంజలి సినిమా ఎంత పెద్ద సూపర్‌ హిట్ అయ్యింది.ఇప్పుడు ఆ సినిమాకు సీక్వెల్‌ కూడా వచ్చేస్తుంది.గీతాంజలి సినిమాకి సీక్వెల్‌ గా రూపొందుతున్న సినిమాకు 'గీతాంజలి మళ్లీ వచ్చింది' అనే టైటిల్ ను పెట్టడం తో అందరి దృష్టిని ఎంతగానో ఆకర్షించారు.


ఇటీవల ఈ మూవీ టీజర్ విడుదల అయ్యింది. ఆ టీజర్ విడుదల తర్వాత సినిమా పై అంచనాలు మరింతగా పెరిగాయి. మార్చి 22న ఈ సినిమా రిలీజ్ అవ్వబోతుంది. ఈ సినిమాతో కోన వెంకట్‌ ఖచ్చితంగా మరో విజయాన్ని దక్కించుకోవడం ఖాయం అన్నట్లుగా సమాచారం వినిపిస్తోంది. సూపర్ స్టార్ మహేష్ బాబు దూకుడు వంటి పెద్ద ఇండస్ట్రీ హిట్‌ మూవీకి కథ ను అందించాడు రచయిత కోన వెంకట్‌. ఇక ఇప్పుడు అయన మళ్లీ దూకుడు పెంచాలి అంటే గీతాంజలి మళ్లీ వచ్చింది సినిమా ఖచ్చితంగా హిట్ అవ్వాల్సి ఉంది. వరుసగా రెండు మూడు సినిమాలు హిట్ అయితే కచ్చితంగా కోన వెంకట్‌ ని నమ్మి చాలా మంది హీరోలు ఇంకా దర్శకులు ఆయన్ను నమ్మే అవకాశాలు ఉన్నాయని సినీ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఈ సినిమా మార్చ్ 22 వ తేదీన తెలుగుతో పాటు తమిళ్, మలయాళ భాషల్లో కూడా రిలీజ్ కాబోతుంది. మరి చూడాలి ఈ సినిమా కోన వెంకట్ కి బిగ్ బ్రేక్ ఇస్తుందో లేదో..



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Purushottham Vinay]]>