DebateChakravarthi Kalyaneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/debate/138/chandrababuccccf2d9-9812-4047-8044-17131ed82c8b-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/debate/138/chandrababuccccf2d9-9812-4047-8044-17131ed82c8b-415x250-IndiaHerald.jpgఏపీలో పొత్తుల కథ కీలక మలుపు తిరిగింది. టీడీపీ జనసేన పొత్తుల విషయంలో చాలా దూరం వెళ్లిపోయాయి. తమతో పాటు కలిసి రావాలని ఆ పార్టీ లు బీజేపీని కోరుతున్నాయి. కానీ బీజేపీ మదిలో ఏముందో తెలియదు. దీంతో టీడీపీ, జనసేనలు అభ్యర్థలు ప్రకటన వరకు వచ్చేశాయి. ఇప్పుడు ఏపీలో ఒత్తిడి రాజకీయం నడుస్తుందా అనే చర్చ మొదలైంది. కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉంది కాబట్టి పొత్తు పెట్టుకుంటే ఎన్నికల వేళ తమకు ఉపయోగం అని అని టీడీపీ భావించింది. దీనికి అనుగుణంగా ఈ నెల మొదటి వారంలో చంద్రబాబు దిల్లీ వెళ్లి అమిత్ షా, జేపీ నడ్డాతో సమాchandrababu{#}Amit Shah;Bharatiya Janata Party;Pawan Kalyan;CBN;Janasena;TDP;Partyబాబు ఒత్తిడికి మోదీ, అమిత్‌షా తలొగ్గుతారా?బాబు ఒత్తిడికి మోదీ, అమిత్‌షా తలొగ్గుతారా?chandrababu{#}Amit Shah;Bharatiya Janata Party;Pawan Kalyan;CBN;Janasena;TDP;PartyMon, 26 Feb 2024 10:12:00 GMTఏపీలో పొత్తుల కథ కీలక మలుపు తిరిగింది. టీడీపీ జనసేన పొత్తుల విషయంలో చాలా దూరం వెళ్లిపోయాయి. తమతో పాటు కలిసి రావాలని ఆ పార్టీ లు బీజేపీని కోరుతున్నాయి. కానీ బీజేపీ మదిలో ఏముందో తెలియదు. దీంతో టీడీపీ, జనసేనలు అభ్యర్థలు ప్రకటన వరకు వచ్చేశాయి. ఇప్పుడు ఏపీలో ఒత్తిడి రాజకీయం నడుస్తుందా అనే చర్చ మొదలైంది.



కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉంది కాబట్టి పొత్తు పెట్టుకుంటే ఎన్నికల వేళ తమకు ఉపయోగం అని అని టీడీపీ భావించింది. దీనికి అనుగుణంగా ఈ నెల మొదటి వారంలో చంద్రబాబు దిల్లీ వెళ్లి అమిత్ షా, జేపీ నడ్డాతో సమావేశం అయి తిరిగి వచ్చారు. కానీ ఏమైందో ఇప్పటి వరకు మళ్లీ సమావేశాలు నిర్వహించలేదు. పవన్ కల్యాణ్ కూడా రేపో, మాపో దిల్లీ వెళ్తారు. కాషాయ అగ్ర నేతలను కలుస్తారు అనే ప్రచారం చేస్తున్నారు కానీ ఇప్పటి వరకు అదీ జరగలేదు. దీంతో ఈ పొత్తుల వ్యవహారం ఏమైందో ఎవరికి తెలియడం లేదు.


ఇంతలో ఉన్నట్టుండి టీడీపీ, జనసేన తమ అభ్యర్థులను ప్రకటించేశాయి. మూడు వంతులు ప్రకటించి ఒక వంతుని అలా ఉంచాయి. ఒక విధంగా చెప్పాలంటే చంద్రబాబు బీజేపీకి అల్టిమేటం విధించారని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఎలా అంటే బీజేపీ నేతలు తమ మిత్రపక్షం జనసేనతో కలిపి 50 సీట్ల వరకు డిమాండ్ చేస్తోంది అనే ప్రచారం సాగుతోంది.


ఈ తరుణంలో చంద్రబాబు పవన్ కల్యాణ్ తో కలిసి  సీట్లు ప్రకటించడం వెనుక జనసేనాని నాతోనే ఉన్నారు అనే సంకేతాలు అయితే పంపగలిగారు. ఒక వంతు సీట్లు ఉంచడం ద్వారా వస్తే అందులో కొన్ని మీకు కేటాయిస్తాం లేకపోతే మేం ఇద్దరం కలిసి అయినా ఎన్నికలకు వెళ్తాం అనే అని సూత్రాప్రాయంగా చెప్పారు. మరి సీట్ల విషయంలో చంద్రబాబు ఒత్తిళ్లకు బీజేపీ తలొగ్గుతుందా.. లేక సింగిల్ గా పోటీ చేస్తుందా అనేది వేచి చూడాలి.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chakravarthi Kalyan]]>