MoviesSeetha Sailajaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore//images/categories/movies-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore//images/categories/movies-IndiaHerald.jpgఒకప్పుడు దక్షిణాది టాప్ హీరోలు అంతా తమ భారీ సినిమాలకు ఇళయరాజా ఆతరువాత రెహమాన్ సంగీత దర్శకులుగా ఉండాలని పట్టుపడుతూ ఉండేవారు. అయితే ఇప్పుడు దక్షిణాది టాప్ హీరోలు అంతా సంగీత దర్శకుడు అనిరుద్ మ్యూజిక్ కావాలని పట్టుపడుతున్నారు. అతడి మ్యానియా విపరీతంగా పెరిగిపోవడంతో నిర్మాతలు అతడికి 4 కోట్ల వరకు పారితోషికాన్ని ఆఫర్ చేస్తున్నారు అంటే అనిరుధ్ రేంజ్ ఏస్థాయిలో ఉందో అర్థం అవుతుంది. ఆమధ్య విడుదలై రజనీకాంత్ కెరియర్ లో బ్లాక్ బష్టర్ హిట్ గా నిలిచిన ‘జైలర్’ మూవీ ఘనవిజయంలో అనిరుధ్ అందించిన బ్యాక్ గ్రౌండ్ స్junior ntr{#}Ilayaraja;Sangeetha;Jr NTR;koratala siva;Tamil;Cinema;Industry;prasad;Octoberదేవరకు అనిరుధ్ సమస్యలు !దేవరకు అనిరుధ్ సమస్యలు !junior ntr{#}Ilayaraja;Sangeetha;Jr NTR;koratala siva;Tamil;Cinema;Industry;prasad;OctoberMon, 26 Feb 2024 08:00:00 GMTఒకప్పుడు దక్షిణాది టాప్ హీరోలు అంతా తమ భారీ సినిమాలకు ఇళయరాజా ఆతరువాత రెహమాన్ సంగీత దర్శకులుగా ఉండాలని పట్టుపడుతూ ఉండేవారు. అయితే ఇప్పుడు దక్షిణాది టాప్ హీరోలు అంతా సంగీత దర్శకుడు అనిరుద్ మ్యూజిక్ కావాలని పట్టుపడుతున్నారు. అతడి మ్యానియా విపరీతంగా పెరిగిపోవడంతో నిర్మాతలు అతడికి 4 కోట్ల వరకు పారితోషికాన్ని ఆఫర్ చేస్తున్నారు అంటే అనిరుధ్ రేంజ్ ఏస్థాయిలో ఉందో అర్థం అవుతుంది.



ఆమధ్య విడుదలై రజనీకాంత్ కెరియర్ లో బ్లాక్ బష్టర్ హిట్ గా నిలిచిన ‘జైలర్’ మూవీ ఘనవిజయంలో అనిరుధ్ అందించిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఆమూవీ విజయానికి ఎంతో సహకరించింది అన్న విషయం అందరూ అంగీకరించే వాస్తవం. దీనితో కొరటాల శివ దర్శకత్వంలో జూనియర్ నటిస్తున్న ‘దేవర’ మూవీ కోసం జూనియర్ పట్టుపట్టడంతో అనిరుధ్ ను ఈమూవీకి సంగీత దర్శకుడుగా ఎంపిక చేశారు.



వాస్తవానికి కొరటాల ఇప్పటివరకు తీసిన అన్ని సినిమాలకు దేవీశ్రీ ప్రసాద్ మణిశర్మలు సంగీత దర్శకత్వం వహించారు. దీనితో ఒక తమిళ సంగీత దర్శకుడుతో సినిమా చేయించుకున్న అనుభవం కొరటాలకు లేదు. దీనికితోడు అనిరుధ్ తాను సంగీత దర్శకత్వం వహించే సినిమాల పాటలకు ఒకటి రెండు ట్యూన్స్ తప్ప ఎక్కువగా ట్యూన్స్ చేయడు అన్న టాక్. అయితే కొరటాల దర్శకత్వం వహించే సినిమాల పాటల విషయంలో ఎక్కువ ట్యూన్స్ తన సంగీత దర్శకుడుతో చేయించి అందులో తనకు నచ్చిన ట్యూన్స్ ను ఎంచు కుంటాడడు అన్న  ప్రచారం ఉంది.



అదే అలవాటుతో కొరటాల ‘దేవర’ పాటల విషయంలో ఎక్కువ ట్యూన్స్ ఇమ్మని అనిరుధ్ తో చెపుతున్నప్పటికీ ఇతడు ‘దేవర’ పాటల రికార్డింగ్ విషయంలో పూర్తి శ్రద్ధ పట్టకుండా ప్రస్తుతం కొరటాలకు చుక్కలు చూపెడుతున్నాడు అంటు ఇండస్ట్రీ వర్గాలలో గాసిప్పుల హడావిడి జరుగుతుంది. అయితే కొన్ని అనుకోని కారణాలు వల్ల ఈమూవీ విడుదల అక్టోబర్ కు వాయిదా పడటంతో ఈలోపుగా అనిరుధ్ సమస్యలకు ఒక పరిష్కారం ఉంటుంది అని అంటున్నారు..  









మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Seetha Sailaja]]>