Moviesmurali krishnaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/socialstars-lifestylec864e9d0-1e65-4e07-b0b9-a70036b98932-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/socialstars-lifestylec864e9d0-1e65-4e07-b0b9-a70036b98932-415x250-IndiaHerald.jpgదాదాపు ఏడేళ్లు తెలుగు ప్రేక్షకులకు టీవీలకు అతుక్కునేలా చేసిన సీరియల్ కార్తీక దీపం. ఆడవాళ్లే కాదు.. మగవాళ్లు కూడా ఈ సీరియల్‏కు అభిమానులయ్యారు.ఈ సీరియల్ కంటే.. అందులోని పాత్రలకే జనాలు ఎక్కువగా కనెక్ట్ అయ్యారు. డాక్టర్ బాబు, వంటలక్క, మోనితా.. ఈ మూడు పాత్రలు సీరియల్ కు ప్రధానం కాగా.. అడియన్స్ హృదయాలకు ఎక్కువగా దగ్గరైన పాత్రలు డాక్టర్ బాబు, వంటలక్క. కొన్నేళ్లపాటు బుల్లితెరపై చక్రం తిప్పిన ఈ సీరియల్ ఇప్పుడు మళ్లీ రాబోతుంది. ఇటీవలే 'కార్తీక దీపం ఇది నవవసంతం' అంటూ సీక్వెల్ ప్రోమో వదిలారు మేకర్స్. ఈ సూపరsocialstars lifestyle{#}deepa;Doctor;Chakram;Premi Viswanath;Yevaru;Wife;Father;Teluguబుల్లితెర పై మళ్లీ అలరించబోతున్న వంటలక్క, డాక్టర్ బాబు..!!బుల్లితెర పై మళ్లీ అలరించబోతున్న వంటలక్క, డాక్టర్ బాబు..!!socialstars lifestyle{#}deepa;Doctor;Chakram;Premi Viswanath;Yevaru;Wife;Father;TeluguMon, 26 Feb 2024 11:15:00 GMTదాదాపు ఏడేళ్లు తెలుగు ప్రేక్షకులకు టీవీలకు అతుక్కునేలా చేసిన సీరియల్ కార్తీక దీపం. ఆడవాళ్లే కాదు.. మగవాళ్లు కూడా ఈ సీరియల్‏కు అభిమానులయ్యారు.ఈ సీరియల్ కంటే.. అందులోని పాత్రలకే జనాలు ఎక్కువగా కనెక్ట్ అయ్యారు. డాక్టర్ బాబు, వంటలక్క, మోనితా.. ఈ మూడు పాత్రలు సీరియల్ కు ప్రధానం కాగా.. అడియన్స్ హృదయాలకు ఎక్కువగా దగ్గరైన పాత్రలు డాక్టర్ బాబు, వంటలక్క. కొన్నేళ్లపాటు బుల్లితెరపై చక్రం తిప్పిన ఈ సీరియల్ ఇప్పుడు మళ్లీ రాబోతుంది. ఇటీవలే 'కార్తీక దీపం ఇది నవవసంతం' అంటూ సీక్వెల్ ప్రోమో వదిలారు మేకర్స్. ఈ సూపర్ హిట్ ధారవాహికకు కొనసాగింపుగా వస్తుందని అధికారికంగా చెప్పేశారు. కానీ ఇందులో మునుపటి పాత్రలు ఉంటాయా ? అనే సందేహాలను కలిగించారు. కొద్ది రోజుల క్రితం రివీల్ చేసిన ప్రోమోలో శౌర్య పాత్ర తన అమ్మనాన్న కథను చెబుతున్నట్లు తెలిపారు. దీంతో ఈసారి వంటలక్క, డాక్టర్ బాబు మళ్లీ కనిపిస్తారా ? అంటూ అనుమానాలు వ్యక్తం చేశారు అడియన్స్. తాజాగా ప్రేక్షకుల సందేహాలకు ఫుల్ క్లారిటీ ఇచ్చారు.

ఆదివారం కార్తీక దీపం 2 నుంచి మరో కొత్త ప్రోమోను రిలీజ్ చేశారు. అందులో డాక్టర్ బాబుగా నిరుపమ్ పరిటాల.. వంటలక్కగా ప్రేమీ విశ్వనాద్ కనిపించారు. కానీ ఇక్కడే అసలు ట్విస్ట్ ఉంది. గత సీరియల్లో డాక్టర్ బాబు, వంటలక్క భార్య భర్తలు.. కానీ తాజాగా విడుదలైన ప్రోమోలో మాత్రం నిరుపమ్ వద్ద వంటమనిషిలా పనిచేస్తుంది దీప. తండ్రి కోసం ఎదురుచూస్తున్న కూతురిగా.. తల్లి పై అంతులేని ప్రేమను చూపిస్తూ.. తల్లిలోనూ తండ్రిని చూసుకుంటూ కనిపిస్తుంది శౌర్య. అయితే ఇప్పుడు విడుదలైన ప్రోమో చూస్తుంటే కార్తీక దీపం ఫస్ట్ పార్టుకు ఇప్పుడొచ్చే సకెండ్ పార్ట్ అసలు కనెక్షన్ లేకుండా.. ఈసారి నేపథ్యం కొత్తగా ఉండనుందని అర్థమవుతుంది. అయితే దీప భర్త ఎవరు ?.. నిరుపమ్ ఇంట్లో వంటమనిషిలా ఎందుకు ఉంది ? అనే కొత్త సందేహాలు మాత్రం ప్రేక్షకులకు రావడం ఖాయం. ఈసారి కార్తీక దీపం నవ వసంతంతో జనాలకు ఎలాంటి ఎంటర్టైన్మెంట్ అందిస్తారో చూడాలి.ఇక తాజాగా విడుదలైన ప్రోమోలో మోనితా, సౌందర్య, హిమ పాత్రల గురించి ఎలాంటి హింట్ ఇవ్వలేదు. కేవలం వంటలక్క, డాక్టర్ బాబు, శౌర్య పాత్రలను మాత్రమే రివీల్ చేశారు. దీంతో ఇందులో మోనితా మళ్లీ కనిపిస్తుందా ? లేదా?.. అనేది చూడాలి. కొత్త వెలుగులతో.. తెలుగు లోగిళ్లు మరువని కథ.. కార్తీక దీపం 2 త్వరలోనే రాబోతుంది.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - murali krishna]]>