PoliticsPurushottham Vinayeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/janasena-tdp-have-differencies-in-tickets-issuesd74a3c00-26fe-42d5-bdba-df311ac70553-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/janasena-tdp-have-differencies-in-tickets-issuesd74a3c00-26fe-42d5-bdba-df311ac70553-415x250-IndiaHerald.jpgటీడీపీలో చంద్రబాబు నాయుడు తాజాగా ప్రకటించిన అభ్యర్థుల జాబితాలో టికెట్లను ఆశించి.. భంగపడిన వారంతా కూడా ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. తమకు టికెట్లు వస్తాయనుకుంటే రాకుండా పోవటమే ఏమిటన్న ఆవేశంతో చంద్రబాబు పైనా ఇంకా అలాగే జనసేన అధినేత పవన్ కల్యాణ్ పైన ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్న వైనం బాగా ఎక్కువ అవుతోంది.టికెట్లు ఆశించి భంగపడిన వారు నిరసనలు ఇంకా ఆందోళనలు చేపడుతున్నారు.మరికొంతమంది అధినేత మీద ఒత్తిడి తెచ్చేలా ప్రయత్నాలు చేస్తున్నారు. ఇదిలా ఉంటే.. జనసేనలో కూడా ఇబ్బందికర పరిస్థితి నెలకొంది. మొదటి విడTDP - Janasena{#}Petrol;రాజీనామా;kakinada;Telugu Desam Party;Janasena;TDP;MLA;police;Party;Pawan Kalyan;shankar;News;CBNటీడీపీ-జనసేన: తీవ్రంగా ఉన్న టికెట్ల గోల?టీడీపీ-జనసేన: తీవ్రంగా ఉన్న టికెట్ల గోల?TDP - Janasena{#}Petrol;రాజీనామా;kakinada;Telugu Desam Party;Janasena;TDP;MLA;police;Party;Pawan Kalyan;shankar;News;CBNMon, 26 Feb 2024 18:23:46 GMTటీడీపీలో చంద్రబాబు నాయుడు తాజాగా ప్రకటించిన అభ్యర్థుల జాబితాలో టికెట్లను ఆశించి.. భంగపడిన వారంతా కూడా ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. తమకు టికెట్లు వస్తాయనుకుంటే రాకుండా పోవటమే ఏమిటన్న ఆవేశంతో చంద్రబాబు పైనా ఇంకా అలాగే జనసేన అధినేత పవన్ కల్యాణ్ పైన ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్న వైనం బాగా ఎక్కువ అవుతోంది.టికెట్లు ఆశించి భంగపడిన వారు నిరసనలు ఇంకా ఆందోళనలు చేపడుతున్నారు.మరికొంతమంది అధినేత మీద ఒత్తిడి తెచ్చేలా ప్రయత్నాలు చేస్తున్నారు. ఇదిలా ఉంటే.. జనసేనలో కూడా ఇబ్బందికర పరిస్థితి నెలకొంది. మొదటి విడతలో కేటాయించిన టికెట్లు చాలా తక్కువగా ఉండటాన్ని జనసైనికులు జీర్ణించుకోలేకపోతున్నారు.అందువల్ల ఈ పొత్తు లెక్కేమో కానీ ఉభయ పార్టీ అధినేతలు మాత్రం ఇబ్బందికర పరిస్థితిని ఎదుర్కొంటున్నారు.ప్రస్తుతం ఈ టికెట్ల పంచాయితీ పీక్సుకు చేరింది. కొంతమంది టీడీపీ నేతలు.. కార్యకర్తలు పార్టీకి ఏకంగా గుడ్ బై చెబుతున్నారు.


కాకినాడ రూరల్ టీడీపీ నేతలు.. కార్యకర్తలు అయితే భగ్గుమంటున్నారు. టికెట్ ను జనసేన పార్టీకి ఎలా కేటాయిస్తారని మండిపడుతున్నారు. మాజీ ఎమ్మెల్యే పిల్లి అనంతలక్ష్మి ఇంటిని అయితే టీడీపీ కార్యకర్తలు ముట్టడించారు. పార్టీకి వెంటనే రాజీనామా చేయాలని వారు డిమాండ్ చేశారు. జనసేన పార్టీకి టికెట్ ఇవ్వటాన్ని వారు జీర్ణించుకోలేకపోతున్నారు.పార్టీకి తమ నిరసనను తెలియజేసేందుకు వీలుగా మూకుమ్మడి రాజీనామాలకు పాల్పడాలని డిసైడ్ అవుతున్నట్లుగా సమాచారం తెలుస్తోంది. ఇదిలా ఉంటే తెలుగుదేశం పార్టీ కార్యకర్త ఒకరు (లోవరాజు) ఒంటి మీద పెట్రోల్ పోసుకొని ఆత్మహత్యాయత్నం చేయటం జరిగింది. ఆ వెంటనే పోలీసులు అతడ్ని కాపాడారు. ఇదిలా ఉంటే ఉండవల్లిలోని చంద్రబాబు నాయుడు నివాసం వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఆ టికెట్లు ఆశించి భంగపడిన నేతలు ధర్నాకు దిగారు. ఇక తంబళ్లపల్లి టికెట్ ను శంకర్ యాదవ్ ఆశించనగా.. అందుకు భిన్నంగా జయచంద్రారెడ్డికి కేటాయించటాన్ని పూర్తిగా వ్యతిరేకిస్తున్నారు. ఈ రీతిలో వెల్లువెత్తుతున్న నిరసనలు టీడీపీ.. జనసేన పార్టీలో హాట్ టాపిక్ గా మారాయి.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Purushottham Vinay]]>