PoliticsVijayaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/bjp-amitshah-naidu-tdp-38347dec-ecb2-4888-b9d0-1a95e3c34faa-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/bjp-amitshah-naidu-tdp-38347dec-ecb2-4888-b9d0-1a95e3c34faa-415x250-IndiaHerald.jpgఇపుడు చంద్రబాబు, పవన్ ప్రకటించబోయే సీట్లతో బీజేపీకి ఇబ్బంది ఉండదని ఎల్లోమీడియా ఎలా చెప్పగలుగుతుంది ? చంద్రబాబు ప్రకటించబోయే సీట్లనే బీజేపీ కావాలని పట్టుబడితే అప్పుడు చంద్రబాబు పరిస్ధితి ఏమిటి ? ఇపుడు ప్రకటించబోయే సీట్లను బీజేపీ కావాలని పట్టుబడితే అప్పుడు చంద్రబాబు ఏమిచేస్తారు ? ప్రకటించిన సీట్లను రద్దుచేసుకుని వాటిని బీజేపీకి ఇచ్చేస్తారా ? అలాచేస్తే టికెట్లు వచ్చాయని ప్రచారం మొదలుపెట్టుకున్న తమ్ముళ్ళు ఊరుకుంటారా ? అన్నది మౌళికమైన ప్రశ్న. bjp amitshah naidu tdp {#}Amith Shah;TDP;CBN;Janasena;Pawan Kalyan;Saturday;Bharatiya Janata Party;Newsఅమరావతి : అభ్యర్ధుల జాబితాపై బీజేపీ ఎలా రియాక్టవుతుందో ?అమరావతి : అభ్యర్ధుల జాబితాపై బీజేపీ ఎలా రియాక్టవుతుందో ?bjp amitshah naidu tdp {#}Amith Shah;TDP;CBN;Janasena;Pawan Kalyan;Saturday;Bharatiya Janata Party;NewsSun, 25 Feb 2024 09:00:00 GMT


తెలుగుదేశంపార్టీ-జనసేన అభ్యర్ధుల మొదటి జాబితా శనివారం మధ్యాహ్నం రిలీజ్ కాబోతోందనే ప్రచారం జరుగుతోంది. దీనికి ముహూర్తం కూడా ఫిక్సయ్యిందని రెండుపార్టీల నేతల నుండి సమాచారం లీకయ్యింది. మొదటిజాబితాలో  సుమారు 70 మంది అభ్యర్ధుల పేర్లుంటాయని ప్రచారం జరుగుతోంది. ఇందులో టీడీపీ తరపున 60 మంది, జనసేన నుండి 10 మంది అభ్యర్ధుల పేర్లుంటాయట. 100 నియోజకవర్గాలకు పైగా కసరత్తు చేసినా ఇప్పటికి 70 మందితోనే మొదటిజాబితా విడుదల చేయవచ్చనేది సమాచారం.





ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే చంద్రబాబునాయుడు, పవన్ కల్యాణ్ చేయబోయే మొదటిజాబితా ప్రకటనకు బీజేపీ గ్రీన్ సిగ్నల్ ఉందా ? అన్నది. ఎందుకంటే బీజేపీతో పొత్తుచర్చలు ఏమైందో తెలీదు. కమలనాదులు ఎన్ని సీట్లడిగారు, చంద్రబాబు ఎన్ని ఇద్దామని అనుకున్నారనే విషయం తెలీదు. బీజేపీతో పొత్తు, సీట్ల సర్దుబాటు అంశాన్ని ఫైనల్ చేసుకోకుండానే చంద్రబాబు, పవన్ మొదటిజాబితాను ప్రకటించటంలో అర్ధంలేదు. బీజేపీకి ఇబ్బందుల్లేని సీట్లనే చంద్రబాబు, పవన్ ప్రకటించబోతున్నారని ఎల్లోమీడియా ప్రచారంచేస్తోంది.





ఇపుడు చంద్రబాబు, పవన్ ప్రకటించబోయే సీట్లతో బీజేపీకి ఇబ్బంది ఉండదని ఎల్లోమీడియా ఎలా చెప్పగలుగుతుంది ? చంద్రబాబు ప్రకటించబోయే సీట్లనే బీజేపీ కావాలని పట్టుబడితే అప్పుడు చంద్రబాబు పరిస్ధితి ఏమిటి ? ఇపుడు ప్రకటించబోయే సీట్లను బీజేపీ కావాలని పట్టుబడితే అప్పుడు చంద్రబాబు ఏమిచేస్తారు ? ప్రకటించిన సీట్లను రద్దుచేసుకుని వాటిని బీజేపీకి ఇచ్చేస్తారా ? అలాచేస్తే టికెట్లు వచ్చాయని ప్రచారం మొదలుపెట్టుకున్న తమ్ముళ్ళు ఊరుకుంటారా ? అన్నది మౌళికమైన ప్రశ్న.





పోని బీజేపీతో పొత్తులను ఫైనల్ చేసి వెంటనే సీట్ల సర్దుబాట్లను ప్రకటించేట్లుగా చేయగలరా ? అంటే అది చంద్రబాబు, పవన్ చేతిలో లేదు. మరీ విషయాలను అధినేతలిద్దరు ఆలోచించకుండానే ఉంటారా ? ఆలోచించినా వీళ్ళు చేయగలిగేది ఏమీలేదు. బీజేపీపై ఒత్తిడి పెంచేందుకే చంద్రబాబు, పవన్ ఈ పద్దతిలో వెళుతున్నారా అనే అనుమానాలు కూడా పెరిగిపోతున్నాయి. అదే నిజమైతే నరేంద్రమోడీ, అమిత్ షా పైన ఒత్తిడి పెంచేంత సీన్ చంద్రబాబు, పవన్ కుందా ? అన్నదే అసలైన పాయింట్. ఏదేమైనా అభ్యర్ధుల మొదటిజాబితా ప్రకటన తర్వాత జరగబోయే పరిణామాలు ఆసక్తిగా మారబోతోంది.




మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Vijaya]]>