LifeStylePurushottham Vinayeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/lifestyle/taurus_taurus/health282ebf5f-0cd6-4d52-ad2e-d35e5e06eacc-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/lifestyle/taurus_taurus/health282ebf5f-0cd6-4d52-ad2e-d35e5e06eacc-415x250-IndiaHerald.jpgషుగర్ తో బాధ పడేవారికి ఉసిరికాయ ఎంతో సహాయపడుతుంది. దీనిలో విటమిన్ సి తో పాటు యాంటీ ఆక్సిడెంట్లు కూడా ఎక్కువగాఉంటాయి. దీనిని తీసుకోవడం వల్ల ఇన్సులిన్ సెన్సెటివిటీ మెరుగుపడుతుంది.షుగర్ సమస్యతో బాధ పడేవారు ఉసిరికాయ రసం లేదా పొడిగా తీసుకోవడం వల్ల చాలా మంచి ఫలితం ఉంటుంది. ఇన్సులిన్ సెన్సెటివిటీని మెరుగుపరచడంలో పసుపు కూడా మనకు చాలా బాగా సహాయపడుతుంది. వంటలతో పాటు పాలల్లో పసుపు కలిపి తీసుకోవడం వల్ల షుగర్ వ్యాధి అదుపులో ఉంటుంది. షుగర్ వ్యాధిని అదుపులో ఉంచడంలో మెంతులు కూడా మనకు బాగా సహాయపడతాయి. వీటిని నీటHEALTH{#}Beans;Turmeric;Insulin;Vitamin C;Rasam;Sugar;Vitaminవీటిని తింటే షుగర్ పరార్?వీటిని తింటే షుగర్ పరార్?HEALTH{#}Beans;Turmeric;Insulin;Vitamin C;Rasam;Sugar;VitaminSun, 25 Feb 2024 19:11:50 GMTషుగర్ తో బాధ పడేవారికి ఉసిరికాయ ఎంతో సహాయపడుతుంది. దీనిలో విటమిన్ సి తో పాటు యాంటీ ఆక్సిడెంట్లు కూడా ఎక్కువగాఉంటాయి. దీనిని తీసుకోవడం వల్ల ఇన్సులిన్ సెన్సెటివిటీ మెరుగుపడుతుంది.షుగర్ సమస్యతో బాధ పడేవారు ఉసిరికాయ రసం లేదా పొడిగా తీసుకోవడం వల్ల చాలా మంచి ఫలితం ఉంటుంది. ఇన్సులిన్ సెన్సెటివిటీని మెరుగుపరచడంలో పసుపు కూడా మనకు చాలా బాగా సహాయపడుతుంది. వంటలతో పాటు పాలల్లో పసుపు కలిపి తీసుకోవడం వల్ల షుగర్ వ్యాధి అదుపులో ఉంటుంది. షుగర్ వ్యాధిని అదుపులో ఉంచడంలో మెంతులు కూడా మనకు బాగా సహాయపడతాయి. వీటిని నీటిలో నానబెట్టి లేదా వంటల్లో వాడడం వల్ల ఎన్నో రకాల ప్రయోజనాలను పొందవచ్చు.చిక్కుళ్లు, కాయధాన్యాలు, బీన్స్ వంటి వాటిని తీసుకోవడం వల్ల కూడా మంచి ఫలితం ఉంటుంది. వీటిలో ఫైబర్, ప్రోటీన్ లు ఎక్కువగా ఉంటాయి. వీటిని తీసుకోవడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు నెమ్మదిగా పెరుగుతాయి. అలగే శరీరానికి బలం కూడా కలుగుతుంది. వీటితో పాటు షుగర్ వ్యాధి గ్రస్తులు కాకరకాయను కూడా ఆహారంలో భాగంగా తీసుకోవాలి. దీనిలో విటమిన్ ఎ, సిలతో పాటు యాంటీ ఆక్సిడెంట్లు కూడా ఎక్కువగా ఉంటాయి.


కాకరకాయ రసం లేదా కాకరకాయలను కూరగా చేసి తీసుకోవడం వల్ల షుగర్ అదుపులో ఉంటుంది. ఇన్సులిన్ సెన్సెటివిటీ పెరుగుతుంది.ఆపిల్, బెర్రీస్, సిట్రస్ ఫ్రూట్స్ వంటి వాటిని తీసుకోవాలి. ఇవి తక్కువ గ్లెసెమిక్ ఇండెక్స్ ను కలిగి ఉంటాయి. వీటిని తీసుకోవడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు వెంటనే పెరగకుండా నెమ్మదిగా పెరుగుతాయి. అలాగే షుగర్ వ్యాధితో బాధపడే వారు ఆకుకూరలను ఎక్కువగా తీసుకోవాలి. ఇవి తక్కువ క్యాలరీలతో పాటు ఎక్కువ పోషకాలను కలిగి ఉంటాయి. వీటిలో ఉండే ఫైబర్ చక్కెర స్థాయిలను పెంచకుండా నిరోధించడంలో సహాయపడతాయి.ఇంకా అలాగే మునగాకును తీసుకోవడం వల్ల కూడా షుగర్ వ్యాధి అదుపులో ఉంటుంది. అలాగే దీనిలో మినరల్స్, విటమిన్స్, యాంటీ ఆక్సిడెంట్లు కూడా పుష్కలంగా ఉంటాయి. మునగాకును తీసుకోవడం వల్ల షుగర్ వ్యాధి అదుపులో ఉండడంతో పాటు ఆరోగ్యానికి కూడా మేలు కలుగుతుంది. బ్రౌన్ రైస్, ఓట్స్, బార్లీ వంటి ఆహారాలను తీసుకోవాలి. ఇవి తక్కువ గ్లెసెమిక్ ఇండెక్స్ ను కలిగి ఉంటాయి. ఈ ధాన్యాన్ని తీసుకోవడం వల్ల షుగర్ వ్యాధి అదుపులో ఉంటుంది.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Purushottham Vinay]]>