PoliticsVijayaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/vizag-ganta-bandaru-499239e7-e9cc-4fa8-8a9c-a3ebf8e7f578-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/vizag-ganta-bandaru-499239e7-e9cc-4fa8-8a9c-a3ebf8e7f578-415x250-IndiaHerald.jpgఅయితే చంద్రబాబ, లోకేష్ మాత్రం గంటా విషయంలో గట్టిగానే ఉన్నారు. ఎలాగంటే గంటాను విజయనగరం జిల్లాలోని చీపురుపల్లి నియోజకవర్గంలో పోటీచేయాలని ఆదేశించారు. వైజాగ్ జిల్లా నుండి విజయనగరం జిల్లాకు మారి చీపురుపల్లిలో పోటీచేసేదిలేదని గంటా చెప్పారు. అయితే పోటీకి అవకాశం లేదన్నట్లుగా చంద్రబాబు చెప్సేశారట. పోటీచేస్తే చీపురుపల్లిలో చేయాలి లేకపోతే లేదన్నట్లుగా చెప్పారట. దాంతో గంటాకు పెద్ద షాకనే చెప్పాలి. vizag ganta bandaru {#}Vijayanagaram;Pendurthi;Vizianagaram;Lokesh;Lokesh Kanagaraj;Vishakapatnam;GANTA SRINIVASA RAO;Janasena;TDP;CBN;MLA;Newsఉత్తరాంధ్ర : ఇద్దరు సీనియర్లకు పెద్ద షాక్ఉత్తరాంధ్ర : ఇద్దరు సీనియర్లకు పెద్ద షాక్vizag ganta bandaru {#}Vijayanagaram;Pendurthi;Vizianagaram;Lokesh;Lokesh Kanagaraj;Vishakapatnam;GANTA SRINIVASA RAO;Janasena;TDP;CBN;MLA;NewsSun, 25 Feb 2024 05:00:00 GMT


తెలుగుదేశంపార్టీ మొదటిజాబితాలో చాలామంది సీనియర్లకు చంద్రబాబునాయుడు పెద్ద షాకే ఇచ్చారు. వీరిలో విశాఖపట్నం జిల్లాలోని బండారు సత్యనారాయణమూర్తి, గంటా శ్రీనివాసరావు కూడా ఉన్నారు. వీరిలో బండారు పెందుర్తిలో పోటీచేయటానికి అన్నీ ఏర్పాట్లు చేసుకున్నారు. అలాగే విశాఖపట్నం ఉత్తరం నియోజకవర్గం ఎంఎల్ఏ గంటా శ్రీనివాసరావు పోటీచేయటానికి అసలు నియోజకవర్గమే లేకుండాపోయింది. రాబోయే ఎన్నికల్లో భీమిలీ, నెల్లిమర్ల, చోడవరం అసెంబ్లీల్లో ఎక్కడో ఒకచోట నుండి పోటీచేయాలని గంటా గట్టిగా ప్రయత్నిస్తున్నారు.





అయితే చంద్రబాబ, లోకేష్ మాత్రం గంటా విషయంలో గట్టిగానే ఉన్నారు. ఎలాగంటే గంటాను విజయనగరం జిల్లాలోని చీపురుపల్లి నియోజకవర్గంలో పోటీచేయాలని ఆదేశించారు. వైజాగ్ జిల్లా నుండి విజయనగరం జిల్లాకు మారి చీపురుపల్లిలో పోటీచేసేదిలేదని గంటా చెప్పారు. అయితే పోటీకి అవకాశం లేదన్నట్లుగా చంద్రబాబు చెప్సేశారట. పోటీచేస్తే చీపురుపల్లిలో చేయాలి లేకపోతే లేదన్నట్లుగా చెప్పారట. దాంతో గంటాకు పెద్ద షాకనే చెప్పాలి.





అలాగే బండారు కూడా పెందుర్తిలో పోటీకి రెడీ అయిపోయారు. దశాబ్దాలుగా పెందుర్తిలోనే బండారు పోటీచేస్తున్నారు. అలాంటి నియోజకవర్గాన్ని చంద్రబాబు పొత్తులో జనసేనకు కేటాయించేశారు. పెందుర్తిలో జనసేన తరపున పంచకర్ల రమేష్ పోటీచేస్తారని కొంతకాలంగా వార్తలు వినబడుతున్నాయి. అయితే అదంతా ఉత్త ప్రచారం మాత్రమే అని పోటీలో తానే ఉంటానంటు బండారు ఎప్పటికప్పుడు చెబుతున్నారు. తీరా మొదటిజాబితాను ప్రకటించినపుడు చూస్తే టీడీపీ పోటీచేయబోయే సీట్లలో పెందుర్తి లేదు.  అంటే ఈ నియోజకవర్గాన్ని చంద్రబాబు జనసేనకు కేటాయించేసినట్లు అర్ధమవుతోంది.





దాదాపు 70 ఏళ్ళకు దగ్గరలో ఉన్న బండారుకు ఇదే చివరి ఎన్నికలను చెప్పాలి. అలాంటిది గెలుపోటములను పక్కనపెట్టేసి అసలు పోటీకి అవకాశమే లేకపోవటంతో ఆయన మండిపోతున్నారు. తనకు చంద్రబాబు తీరని అన్యాయం చేశారని తన మద్దతుదారుల దగ్గర భోరుమంటున్నారు. పెందుర్తి సీటును టీడీపీకే వదిలేయాలని బండారు ఈమధ్యనే పవన్ను కలిసినపుడు రిక్వెస్టు చేసుకున్నారు. మరి పవన్ ఏమి సమాధానం చెప్పారో తెలీదు కాని చివరకు పోటీకి బండారుక అవకాశం లేకుండాపోయింది. మొత్తంమీద 25 మంది సీనియర్ తమ్ముళ్ళకు పోటీకి అవకాశంలేదని తెలుస్తోంది.




మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Vijaya]]>