EditorialChakravarthi Kalyaneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/editorial/77/india0a7fc647-0c58-4e31-acb0-870827a59a9e-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/editorial/77/india0a7fc647-0c58-4e31-acb0-870827a59a9e-415x250-IndiaHerald.jpgప్రపంచంలో ప్రస్తుతం రెండు ప్రచ్ఛన్నయుద్ధ దేశాలు ఉన్నాయి. అవి అమెరికా, రష్యా. మిగతా దేశాలు అటు రష్యాకి గానీ.. లేదా అమెరికా కు కానీ మద్దతు ఇవ్వాలి. కానీ భారత్ మాత్రం ఈ రెండు దేశాలకు సమ దూరం పాటిస్తూ విశ్మ మిత్ర దేశంగా కీర్తించబడుతోంది. ఇప్పుడు ఈ రెండు దేశాలు మన వైపు చూస్తున్నాయి. గతంలో లాగా ఇండియాను తక్కువ చేసి చూసే పరిస్థితులు ప్రస్తుతం లేవు. ప్రపంచంలో ఏ దేశం కూడా భారత్ కు చెప్పకుండా.. సమాచారం ఇవ్వకుండా ఏ అంశంలో ముందుకు పోయే పరిస్థితి లేదు. అదే సందర్భంలో ఇండియాకు అపారమైన గౌరవాన్ని అన్ని దేశాindia{#}mithra;India;Russia;Narendra Modi;American Samoa;Prime Minister;Minister;central government;Coronavirus;Santosham;Newsభారత్.. విశ్వమిత్ర స్థాయికి ఎదుగుతోందా?భారత్.. విశ్వమిత్ర స్థాయికి ఎదుగుతోందా?india{#}mithra;India;Russia;Narendra Modi;American Samoa;Prime Minister;Minister;central government;Coronavirus;Santosham;NewsSun, 25 Feb 2024 09:00:00 GMTప్రపంచంలో ప్రస్తుతం రెండు ప్రచ్ఛన్నయుద్ధ దేశాలు ఉన్నాయి. అవి అమెరికా, రష్యా. మిగతా దేశాలు అటు రష్యాకి గానీ.. లేదా అమెరికా కు కానీ మద్దతు ఇవ్వాలి. కానీ భారత్ మాత్రం ఈ రెండు దేశాలకు సమ దూరం పాటిస్తూ విశ్మ మిత్ర దేశంగా కీర్తించబడుతోంది. ఇప్పుడు ఈ రెండు దేశాలు మన వైపు చూస్తున్నాయి. గతంలో లాగా ఇండియాను తక్కువ చేసి  చూసే పరిస్థితులు ప్రస్తుతం లేవు.


ప్రపంచంలో ఏ దేశం కూడా భారత్ కు చెప్పకుండా.. సమాచారం ఇవ్వకుండా  ఏ అంశంలో ముందుకు పోయే పరిస్థితి లేదు. అదే సందర్భంలో ఇండియాకు అపారమైన గౌరవాన్ని అన్ని దేశాలు ఇస్తున్నాయి. మరోవైపు ప్రపంచ వ్యాప్తంగా చేస్తున్న సర్వేల్లో నరేంద్ర మోదీ తన హవాను కొనసాగిస్తున్నారు. తాజాగా కేంద్ర విదేశాంగ మంత్రి జైశంకర్ ఓ సమావేశంలో పాల్గొన్నారు.


ఈ సందర్భంగా అమెరికా అనుకూల దేశాలు, రష్యా అనుకూల దేశాల్లో దేనికి మన మద్దతు అని అడిగిన ప్రశ్నకు ఆయన బదులిస్తూ మనది విశ్వమిత్ర దేశంగా అభివర్ణించారు. భారత్ ప్రతి దేశంతో సత్సంబంధాలు కోరుకుంటోందని.. ప్రపంచానికి మంచి జరగడానికి అన్ని దేశాలకు మన విలువైన సూచనలిస్తాం. అదే సమయంలో స్వీకరిస్తాం. అంతే కానీ ఎవరి పక్షానో ఉండాల్సిన అవసరం లేదన్నారు. ప్రస్తుతం భారత్ విశ్వమిత్ర పాత్ర పోషిస్తోందని వివరించారు.


గతంలో కూడా నరేంద్ర మోదీ మన దేశాన్ని విశ్వమిత్రగా పొగిడారు.  విశ్వంలో భారతదేశం గొప్ప జ్ఞాన భాండారంగా అవతరించిందని.. ప్రధాని మోదీ అన్నారు. కరోనా నేపథ్యంలో భారత్ మన మిత్ర దేశమని యావత్ ప్రపంచం కొనియాడిందని గుర్తు చేశారు. దేశీయ సంస్థల ఉత్పత్తి చేసిన వ్యాక్సిన్ అందించి కొవిడ్ మహమ్మారిని తరిమికొట్టేందుకు అండగా నిలబడిన విధానంతో భారత్  విశ్వమిత్రగా మారిపోయిందని మోదీ అన్నారు.  ఈ సందర్భంగా ఆయన సంతోషం వ్యక్తం చేశారు. భారత్ ఈ స్థాయికి ఎదగడం మనకి గర్వకారణం అని తెలిపారు.





మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chakravarthi Kalyan]]>