LifeStylePurushottham Vinayeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/lifestyle/taurus_taurus/health-and-beauty7ecd9ed7-aff9-4a37-a0ce-43d5999e0eb9-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/lifestyle/taurus_taurus/health-and-beauty7ecd9ed7-aff9-4a37-a0ce-43d5999e0eb9-415x250-IndiaHerald.jpgవేసవి కాలంలో విరివిగా దొరికే పుచ్చ కాయ ఆరోగ్యానికి చాలా మంచిది. ఇందులో బి విటమిన్లు, పొటాషియం పుష్కలంగా ఉంటాయి.పుచ్చకాయ తినడం వల్ల ఎలక్ట్రోలైట్లు కూడా సమృద్ధిగా అందుతాయి. ఇందులో ఉండే బి విటమిన్లు శరీరానికి శక్తినందిస్తే. పొటాషియం గుండెకుమేలు చేస్తుంది. వడదెబ్బ బారినపడి శరీరం నిస్తేజం కాకుండా కాపాడుతుంది. సౌందర్య పోషకంగా కూడా పుచ్చకాయ రసం ఉపయోగపడుతుంది. వేసవి కారణంగా కమిలినట్లు తయారయ్యే చర్మానికి చల్లని పుచ్చకాయ గుజ్జు రాస్తే చర్మం నిగారింపును పొందుతుంది. ఒక గ్లాసు పుచ్చకాయ రసంలో స్పూన్ తేనె కలిపHealth and beauty{#}Soundarya;Potassium;Magnesium;Heart;Aqua;Shakti;Rasamఅందాన్ని ఆరోగ్యాన్ని పెంచే సూపర్ ఫ్రూట్ ఇదే?అందాన్ని ఆరోగ్యాన్ని పెంచే సూపర్ ఫ్రూట్ ఇదే?Health and beauty{#}Soundarya;Potassium;Magnesium;Heart;Aqua;Shakti;RasamSun, 25 Feb 2024 19:35:38 GMTవేసవి కాలంలో విరివిగా దొరికే పుచ్చ కాయ ఆరోగ్యానికి చాలా మంచిది. ఇందులో బి విటమిన్లు, పొటాషియం పుష్కలంగా ఉంటాయి.పుచ్చకాయ తినడం వల్ల ఎలక్ట్రోలైట్లు కూడా సమృద్ధిగా అందుతాయి. ఇందులో ఉండే బి విటమిన్లు శరీరానికి శక్తినందిస్తే. పొటాషియం గుండెకుమేలు చేస్తుంది. వడదెబ్బ బారినపడి శరీరం నిస్తేజం కాకుండా కాపాడుతుంది. సౌందర్య పోషకంగా కూడా పుచ్చకాయ రసం ఉపయోగపడుతుంది. వేసవి కారణంగా కమిలినట్లు తయారయ్యే చర్మానికి చల్లని పుచ్చకాయ గుజ్జు రాస్తే చర్మం నిగారింపును పొందుతుంది. ఒక గ్లాసు పుచ్చకాయ రసంలో స్పూన్ తేనె కలిపి ప్రతిరోజు తీసుకుంటే గుండెజబ్బులు, మూత్రపిండాల వ్యాధులు తగ్గుతాయి. పుచ్చపండు గింజల్లో మెగ్నీషియం పుష్కలంగా ఉండటం వల్ల గుండె పనితీరు మెరుగుపడుతుంది. అంతేకాదు, గుండె సంబంధిత వ్యాధులు, హైపర్ టెన్షన్లు తగ్గి, జీవక్రియ సజావుగా జరుగుతుంది.పుచ్చపండు మాత్రమే కాదు దాని గింజలు కూడా చాలా మంచివి.


ఇవి యాంటీ ఆక్సిడెంట్ గుణాలను కలిగి, చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడతాయి. అందుకే ఈ పుచ్చకాయలను తరచూ తీసుకోవడం వల్ల చర్మ క్యాన్సర్, ఇన్ఫెక్షన్ వంటి చర్మ రుగ్మతలు తగ్గుముఖం పడతాయి.పుచ్చ గింజలు ఐరన్, పొటాషియం, విటమిన్లతో నిండి ఉంటాయి. పుచ్చపండుతో పాటు గింజలను తినడం వల్ల అనేక రకాలైన ఆరోగ్య ప్రయోజనాలు పొందవచ్చు. అతిదాహం, చెమట ద్వారా వచ్చే ఖనిజ లవణాల లోపాలను పుచ్చకాయ తగ్గిస్తుంది. జ్వరంతో బాధపడేవారు పుచ్చకాయ రసంలో తేనె కలిపి తీసుకుంటే నీరసం తగ్గి తక్షణ శక్తి పుంజుకుంటారు. మలబద్ధకం ఉన్నవాళ్లు ప్రతిరోజూ తింటే సమస్య తగ్గుతుంది. పెదవుల్లో తేమ తగ్గకుండా కాపాడుతుంది. ఈ పండులో ఉన్న నీటి శాతం వల్ల మూత్రం సరిగ్గా రానివారు, మూత్ర విసర్జనలో మంట ఉన్నవారికి పుచ్చకాయ చక్కని ఔషధంగా పనిచేస్తుంది.పుచ్చకాయలో 90% నీరు ఉంటుంది.దీన్ని తినడం వల్ల చాలా ఆరోగ్యంగా ఇంకా అందంగా కూడా వుంటారు. కాబట్టి ఖచ్చితంగా పుచ్చకాయ తినండి. ఆరోగ్యంగా ఉండండి.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Purushottham Vinay]]>