MoviesPurushottham Vinayeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/pawan-kalyan11728aaa-6895-4503-bbfa-da2538df77e5-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/pawan-kalyan11728aaa-6895-4503-bbfa-da2538df77e5-415x250-IndiaHerald.jpgటాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఇప్పుడు చేస్తున్న సినిమాలను త్వరగా పూర్తి చేసే పనిలో ఉన్నాడు.. అందులో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది ‘OG ‘ ఒకటి.. రన్ రాజా రన్, సాహో సినిమాలకు దర్శకత్వం వహించిన సుజిత్ ఈ మూవీని తెరకెక్కిస్తున్నారు.సుజిత్ ఈ సినిమాని చాలా స్టైలిష్ గా తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే.. ఈ మూవీకి ఒరిజినల్ గ్యాంగస్టర్ టైటిల్ ను ఫిక్స్ చేశారు.. ఈ టైటిల్ ఇప్పటికే ఫ్యాన్స్ లోకి బాగా వెళ్ళిపోయింది. ఆర్ఆర్ఆర్ సినిమా నిర్మాత డీవీవీ దానయ్య ఈ సినిమాకు నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఈ మూవీ కోసం పవన్Pawan Kalyan{#}Shaan;Saaho;raja;thaman s;september;sujeeth;Arjun;Elections;Abhimanyu Mithun;RRR Movie;kalyan;Andhra Pradesh;ajay;India;producer;Producer;Pawan Kalyan;News;CinemaOG: ఎన్నికల తరువాత ఇక దుమ్ముదులుపుడే?OG: ఎన్నికల తరువాత ఇక దుమ్ముదులుపుడే?Pawan Kalyan{#}Shaan;Saaho;raja;thaman s;september;sujeeth;Arjun;Elections;Abhimanyu Mithun;RRR Movie;kalyan;Andhra Pradesh;ajay;India;producer;Producer;Pawan Kalyan;News;CinemaSun, 25 Feb 2024 17:04:02 GMTటాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఇప్పుడు చేస్తున్న సినిమాలను త్వరగా పూర్తి చేసే పనిలో ఉన్నాడు.. అందులో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది ‘OG ‘ ఒకటి.. రన్ రాజా రన్, సాహో సినిమాలకు దర్శకత్వం వహించిన సుజిత్ ఈ మూవీని తెరకెక్కిస్తున్నారు.సుజిత్ ఈ సినిమాని చాలా స్టైలిష్ గా తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే.. ఈ మూవీకి ఒరిజినల్ గ్యాంగస్టర్ టైటిల్ ను ఫిక్స్ చేశారు.. ఈ టైటిల్ ఇప్పటికే ఫ్యాన్స్ లోకి బాగా వెళ్ళిపోయింది. ఆర్ఆర్ఆర్ సినిమా నిర్మాత డీవీవీ దానయ్య ఈ సినిమాకు నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఈ మూవీ కోసం పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.. అయితే ఈ సినిమా విడుదల వాయిదా పడుతుందనే వార్తలు వినిపిస్తున్నాయి..గతంలో వచ్చిన అప్డేట్స్ అన్ని కూడా పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ను ఆకట్టుకున్నాయి.. అయితే ఈ సినిమా నుంచి కేవలం పోస్టర్,గ్లింప్స్ విడుదలయ్యాయి. వాటికి చాలా మంచి స్పందన వచ్చింది. డివివి ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై డివివి దానయ్య ఈ మూవీని నిర్మిస్తున్నారు.


ఇమ్రాన్ హష్మీ, అర్జున్ దాస్, శ్రియా రెడ్డి, ప్రకాష్ రాజ్, షాన్ కక్కర్, హరీష్ ఉత్తమన్, అభిమన్యు సింగ్, అజయ్ ఘోష్ ఈ మూవీలో కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఎస్ఎస్ తమన్ స్వరాలు సమకూరుస్తున్నాడు. ఇక ఇదిలా ఉండగా సినిమా షూటింగ్ ఇంకా పూర్తి కాలేదని తెలిసిందే.. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికలు రాబోతున్నాయి.. దాంతో ఎన్నికల దాకా ఓజీ షూటింగ్లో పాల్గొనలేనని పవన్ కళ్యాణ్ చెప్పినట్లు సమాచారం తెలుస్తుంది. ఎన్నికలు ముగిసిన తర్వాత పవన్ కళ్యాణ్సినిమా షూటింగ్ లో పాల్గొంటారని తెలుస్తుంది.ఇక అప్పటి నుంచి షూటింగ్ చేసి సినిమాని పూర్తి చేసి సెప్టెంబర్ 27వ తేదీన ఈ సినిమాని రిలీజ్ చేసేందుకు మేకర్స్ రెడీ అవుతున్నారు. ఈ సినిమాపై కేవలం అభిమానులే కాదు పవన్ కూడా ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. ఈ సినిమా పాన్ ఇండియా లెవెల్ లో రిలీజ్ కానుంది. మరి చూడాలి ఈ సినిమా ఎలాంటి హిట్ ని నమోదు చేస్తుందో..



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Purushottham Vinay]]>