MoviesAnilkumareditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/tollywood1134f9bd-c895-414c-8633-df6674257752-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/tollywood1134f9bd-c895-414c-8633-df6674257752-415x250-IndiaHerald.jpgచైతూ కెరియర్ లోనే బిగ్గెస్ట్ ప్రాజెక్ట్ గా 'తండెల్' రూపొందుతోంది. శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటున్న ఈ సినిమాని దసరా టైంలోనే రిలీజ్ చేయాలని మేకర్స్ నిర్ణయించినట్లు ఫిలిం సర్కిల్స్ లో టాక్ వినిపిస్తోంది. ఎన్టీఆర్ 'దేవర' మూవీ అక్టోబర్ 10న రిలీజ్ కాబోతోంది. నాగచైతన్య 'తండెల్' కూడా సరిగ్గా అదే సమయంలో అంటే ఎన్టీఆర్ 'దేవర'కి పోటీగా థియేటర్స్ లో సందడి చేయనున్నట్లు వార్తలు కనిపిస్తున్నాయి. దీంతో ఈ దసరాకి బాక్స్ ఆఫీస్ దగ్గర 'దేవర', 'తండేల్' సినిమాల మధ్య గట్టి పోటీ ఉండే అవకాశం ఉంది. tollywood{#}chandu;jeevitha rajaseskhar;Pakistan;Surat;Sai Pallavi;Love Story;Hyderabad;Dussehra;Vijayadashami;producer;Producer;Naga Chaitanya;NTR;Box office;BEAUTY;News;Audience;Cinemaహైదరాబాద్ కి షిఫ్ట్ అయిన 'తండేల్'హైదరాబాద్ కి షిఫ్ట్ అయిన 'తండేల్'tollywood{#}chandu;jeevitha rajaseskhar;Pakistan;Surat;Sai Pallavi;Love Story;Hyderabad;Dussehra;Vijayadashami;producer;Producer;Naga Chaitanya;NTR;Box office;BEAUTY;News;Audience;CinemaSun, 25 Feb 2024 17:00:00 GMTచైతూ కెరియర్ లోనే బిగ్గెస్ట్ ప్రాజెక్ట్ గా 'తండెల్' రూపొందుతోంది. శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటున్న ఈ సినిమాని దసరా టైంలోనే రిలీజ్ చేయాలని మేకర్స్ నిర్ణయించినట్లు ఫిలిం సర్కిల్స్ లో టాక్ వినిపిస్తోంది. ఎన్టీఆర్ 'దేవర' మూవీ అక్టోబర్ 10న రిలీజ్ కాబోతోంది. నాగచైతన్య 'తండెల్' కూడా సరిగ్గా అదే సమయంలో అంటే ఎన్టీఆర్ 'దేవర'కి పోటీగా థియేటర్స్ లో సందడి చేయనున్నట్లు వార్తలు కనిపిస్తున్నాయి. దీంతో ఈ దసరాకి బాక్స్ ఆఫీస్ దగ్గర 'దేవర', 'తండేల్' సినిమాల మధ్య గట్టి పోటీ ఉండే అవకాశం ఉంది.

'తండేల్' సినిమా నిజ జీవిత సంఘటనల ఆధారంగా తెరకెక్కుతోంది. గుజరాత్‌ రాష్ట్రం సూరత్ లోని ఒక మత్స్యకారుడి నిజ జీవితంలో జరిగిన ఘటనల ఆధారంగా ఈ సినిమాని రూపొందిస్తున్నారు చందు మొండేటి. ఇందుకోసం చాలానే రీసెర్చ్ చేశారు. ఈ కథంతా సముద్ర తీర ప్రాంతం చుట్టూనే తిరుగుతుంది. శ్రీకాకుళంలో మొదలై పాకిస్థాన్ వరకూ చేరుకుంటుందట. చైతు ఇందులో మత్స్యకారుడి పాత్రలో కనిపించనున్నాడు. సినిమాలో ఎమోషనల్ లవ్ స్టోరీ తో పాటు దేశభక్తి కోణాన్ని కూడా చూపించబోతున్నారు. ఇక తాజాగా 'తండెల్' లేటెస్ట్ షెడ్యూల్ ని హైదరాబాద్ లో ప్లాన్ చేశారు. దీనికోసం కోసం హైదరాబాదులో పాకిస్తాన్ జైల్ సెట్ వేసినట్లు తెలిసింది. రియాలిటీకి దగ్గరగా ఉండేలా సెట్ వర్క్ ఉండనున్నట్లు సమాచారం. అందుకోసం నిర్మాత బన్నివాసు గట్టిగానే ఖర్చు చేస్తున్నారట. ఈ వారం నుంచి ఆ సెట్ లో నాగచైతన్య పై కొన్ని కీలక సన్నివేశాలను తీయనున్నారుట.

'తండేల్' సినిమాలో నాగచైతన్య సరసన నాచురల్ బ్యూటీ సాయి పల్లవి కథానాయికగా నటిస్తోంది. ఇప్పటికే వీరిద్దరి కాంబినేషన్లో 'లవ్ స్టోరీ' అనే సినిమా వచ్చింది. ఈ సినిమాలో చైతు, సాయి పల్లవి పెయిర్ ప్రేక్షకుల్ని విపరీతంగా ఆకట్టుకుంది. సినిమాలో ఇద్దరూ తమ న్యాచురల్ పర్ఫామెన్స్ తో ఆడియన్స్ ని కట్టిపడేసారు. ఇప్పుడు మరోసారి 'తండెల్' తో అదే మ్యాజిక్ రిపీట్ కాబోతోంది. ఇందులో సాయి పల్లవి గ్రామీణ యువతిగా కనిపించనుంది.





మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Anilkumar]]>