PoliticsPurushottham Vinayeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/chandra-babu-nayudu6f213c1b-546f-4eef-b41d-2b5af9d88c6e-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/chandra-babu-nayudu6f213c1b-546f-4eef-b41d-2b5af9d88c6e-415x250-IndiaHerald.jpgఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గరపడుతోంది.దీంతో అధికార పార్టీ అయిన వైసీపీ 175 అసెంబ్లీ స్థానాలకు దాదాపు అన్ని స్థానాలకు ఇప్పటికే అభ్యర్థులను కూడా ప్రకటించింది.ఈ క్రమంలో తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ కూటమి కూడా మరో ముందడుగు వేసింది. ఆంధ్రప్రదేశ్ లో టీడీపీ, జనసేన కూటమి పోటీ చేయబోయే స్థానాలు, అభ్యర్థుల మొదటి జాబితా రిలీజ్ చేసింది. మొదటి జాబితాలో మొత్తం 118 సీట్లను ప్రకటించారు తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు, జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్. టీడీపీ నుంచి మొత్తం 94 మంది అభ్యర్థులు,Chandra Babu Nayudu{#}Chittoor;118;Nijam;Nara Bhuvaneshwari;kuppam;Cheque;Parliment;Telugu Desam Party;Yevaru;YCP;Janasena;TDP;CBN;Telangana Chief Minister;Assembly;Party;Andhra Pradeshకుప్పం పోటీపై క్లారిటీ ఇచ్చిన బాబు?కుప్పం పోటీపై క్లారిటీ ఇచ్చిన బాబు?Chandra Babu Nayudu{#}Chittoor;118;Nijam;Nara Bhuvaneshwari;kuppam;Cheque;Parliment;Telugu Desam Party;Yevaru;YCP;Janasena;TDP;CBN;Telangana Chief Minister;Assembly;Party;Andhra PradeshSat, 24 Feb 2024 13:49:55 GMTఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గరపడుతోంది.దీంతో అధికార పార్టీ అయిన వైసీపీ 175 అసెంబ్లీ స్థానాలకు దాదాపు అన్ని స్థానాలకు ఇప్పటికే అభ్యర్థులను కూడా ప్రకటించింది.ఈ క్రమంలో తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ కూటమి కూడా మరో ముందడుగు వేసింది. ఆంధ్రప్రదేశ్ లో టీడీపీ, జనసేన కూటమి పోటీ చేయబోయే స్థానాలు, అభ్యర్థుల మొదటి జాబితా రిలీజ్ చేసింది. మొదటి జాబితాలో మొత్తం 118 సీట్లను ప్రకటించారు తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు, జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్. టీడీపీ నుంచి మొత్తం 94 మంది అభ్యర్థులు, జనసేన 24 స్థానాల్లో పోటీ చేయబోతున్నట్టు వారు ప్రకటించారు. మూడు పార్లమెంట్ స్థానాల్లో కూడా జనసేన పోటీ చేయబోతోంది. ఈ క్రమంలో.. 5 అసెంబ్లీ స్థానాల్లో మాత్రమే జనసేన పార్టీ అభ్యర్థులను ప్రకటించింది. అయితే, కుప్పంలో నారా భువనేశ్వరినా.. లేక చంద్రబాబు నాయుడా.. పోటీ చేసేది ఎవరు అనే ఉత్కంఠకు తెరపడింది. కుప్పం నుంచి తానే పోటీ చేయనున్నట్లు తెలుగుదేశం దేశం పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్వయంగా ప్రకటించుకున్నారు.


ఈ ప్రకటనతో కుప్పం బరిలో ఉండేదెవరో.. తేలిపోయింది. దీనంతటికి ప్రధాన కారణం.. ఈమధ్య టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు భార్య నారా భువనేశ్వరి ఆసక్తికర వ్యాఖ్యలు చేయడం.. ఈసారి ఎన్నికల్లో చంద్రబాబు నాయుడుకు బదులు తాను కుప్పం నుంచి పోటీ చేయబోతున్నట్లు ప్రకటించారు. నిజం గెలవాలి యాత్రలో భాగంగా చిత్తూరు జిల్లాలోని కుప్పం నియోజకవర్గంలోని పర్యటించిన భువనేశ్వరి.. తనకు మనసులో ఒక కోరిక కలిగిందని.. 35 సంవత్సరాలుగా ఎమ్మెల్యేగా ఉన్న చంద్రబాబుకి ఈసారి కుప్పంలో విశ్రాంతి ఇచ్చి తాను పోటీ చేయాలని అనుకుంటున్నట్లు ఆమె ప్రకటించారు.ఈ ప్రకటన వల్ల కుప్పం నుంచి ఎవరు పోటీ చేస్తారన్న విషయం హాట్ టాపిక్ గా మారింది.


నారా భువనేశ్వరి కుప్పంలో పోటీచేస్తే.. చంద్రబాబు నాయుడు ఎక్కడి నుంచి పోటీ చేస్తారు..? ఏ నియోజవర్గం అయితే బాగుంటుంది.. అనే ఊహగానాలు కూడా మొదలయ్యాయి.. ఈ క్రమంలోనే వాటన్నింటికి చెక్ పెడుతూ.. చంద్రబాబు నాయుడు తానే పోటీచేస్తున్నట్లు చెప్పడంతో.. కుప్పం అభ్యర్థి ఎవరనే దానిపై క్లారిటీ వచ్చింది.అయితే, మూడున్నర దశాబ్దాల నుంచి కుప్పం నియోజవర్గం చంద్రబాబు నాయుడు అడ్డాగా ఉంది.. ఇక చంద్రబాబు నాయుడు కుప్పం నుంచి వరుసగా ఏడు సార్లు గెలుపొందారు. 1989 నుంచి ఆయన కుప్పం నుంచి పోటీ చేస్తూ.. టీడీపీ జెండాని ఎగురవేస్తున్నారు.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Purushottham Vinay]]>