MoviesAnilkumareditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/tollywoode3597781-6b1b-486c-a74b-6d09dd587360-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/tollywoode3597781-6b1b-486c-a74b-6d09dd587360-415x250-IndiaHerald.jpgబాలీవుడ్ బ్యూటీ జాన్వి కపూర్ 'దేవర' సినిమాతో టాలీవుడ్ కి హీరోయిన్ గా ఎంట్రీ ఇస్తున్న విషయం తెలిసిందే. డెబ్యూ మూవీనే ఎన్టీఆర్ లాంటి పాన్ ఇండియా హీరో తో నటించే ఛాన్స్ అందుకున్న ఈ బ్యూటీ ఎలాగైనా సౌత్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గా పేరు తెచ్చుకోవాలని ప్రయత్నిస్తోంది. ఇలాంటి తరుణంలోనే దేవర తర్వాత జాన్వి కపూర్ కి సౌత్ లో రెండు భారీ ప్రాజెక్ట్స్ లో నటించే అవకాశం వచ్చినట్లు ఇప్పటికే ఫిలిం సర్కిల్స్ లో న్యూస్ వినిపించింది. అందులో ఒకటి బుచ్చిబాబు - రామ్ చరణ్ ప్రాజెక్ట్ ఒకటైతే, సూర్య సరసన మరో ప్రాజెక్ట్ లో tollywood{#}Boney Kapoor;Dussehra;October;Vijayadashami;BEAUTY;Janhvi Kapoor;NTR;surya sivakumar;Ram Charan Teja;bollywood;India;Father;Tollywood;Heroine;News;Cinemaతండ్రి కామెంట్స్ తో అప్సెట్ అయిన జాన్వీ కపూర్?తండ్రి కామెంట్స్ తో అప్సెట్ అయిన జాన్వీ కపూర్?tollywood{#}Boney Kapoor;Dussehra;October;Vijayadashami;BEAUTY;Janhvi Kapoor;NTR;surya sivakumar;Ram Charan Teja;bollywood;India;Father;Tollywood;Heroine;News;CinemaSat, 24 Feb 2024 16:16:44 GMTబాలీవుడ్ బ్యూటీ జాన్వి కపూర్ 'దేవర' సినిమాతో టాలీవుడ్ కి హీరోయిన్ గా ఎంట్రీ ఇస్తున్న విషయం తెలిసిందే. డెబ్యూ మూవీనే ఎన్టీఆర్ లాంటి పాన్ ఇండియా హీరో తో నటించే ఛాన్స్ అందుకున్న ఈ బ్యూటీ ఎలాగైనా సౌత్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గా పేరు తెచ్చుకోవాలని ప్రయత్నిస్తోంది. ఇలాంటి తరుణంలోనే దేవర తర్వాత జాన్వి కపూర్ కి సౌత్ లో రెండు భారీ ప్రాజెక్ట్స్ లో నటించే అవకాశం వచ్చినట్లు ఇప్పటికే ఫిలిం సర్కిల్స్ లో న్యూస్ వినిపించింది. అందులో ఒకటి బుచ్చిబాబు - రామ్ చరణ్ ప్రాజెక్ట్ ఒకటైతే, సూర్య సరసన మరో ప్రాజెక్ట్ లో అనే వార్తలు తెగ వైరల్ అయ్యాయి. వీటిపై మూవీ టీం నుంచి ఎలాంటి అఫీషియల్ అనౌన్స్మెంట్ రాలేదు.

అయితే ఇటీవల ఓ ఇంటర్వ్యూలో జాన్వి కపూర్ తండ్రి, బాలీవుడ్ నిర్మాత బోనీకపూర్ దేవర’ విడుదల అవ్వకముందే సూర్య, రామ్ చరణ్ లాంటి స్టార్లతో కూడా జాన్వీ నటించనుందని ప్రకటించారు. దీంతో ఫ్యాన్స్ సైతం ఆనంద వ్యక్తం చేశారు. తాజాగా ఈ విషయంపై జాన్వీ కపూర్ స్పందిస్తూ.." మా నాన్న ఎవరినీ సంప్రదించకుండా కొన్ని స్టేట్‌మెంట్లు ఇచ్చారు. ఆయన ఏం చెప్పారో కూడా నాకు సరిగ్గా తెలియదు. దీని గురించి నాన్న నాతో గానీ, నిర్మాతలతో గానీ ఏమీ మాట్లాడలేదు" అని పేర్కొంది. దేవర తర్వాత తాను చేస్తున్న ప్రాజెక్ట్స్ కి సంబంధించి అఫీషియల్ అనౌన్స్మెంట్స్ ఇవ్వకపోవడంతో ఆ ప్రాజెక్ట్స్ గురించి

 తాజా ఇంటర్వ్యూలో మాట్లాడేందుకు జాన్వి కపూర్ నిరాకరించింది. మూవీ టీం నుంచి అనౌన్స్మెంట్ రాకముందే తన తండ్రి ఇలా తాను చేస్తున్న ప్రాజెక్ట్స్ గురించి ఇంటర్వ్యూలో బహిరంగంగా చెప్పడంతో జాన్వీ కపూర్ ఈ విషయంలో తీవ్ర అసంతృప్తిలో ఉన్నట్లు తెలుస్తోంది. అయితే దేవర మూవీ గురించి మాత్రం పలు అప్డేట్స్ ఇచ్చింది జాన్వీ. దేవర షూటింగ్ ఇంకా పెండింగ్‌లో ఉందని, పాటలు చిత్రీకరించాల్సి ఉందని తెలిపింది. ప్రస్తుతం షూటింగ్ చివరి దశలో ఉన్న దేవర మూవీని మొదటగా ఏప్రిల్ 5న విడుదల చేయాలని అనుకున్నారు. కానీ కొన్ని అనివార్య కారణాలవల్ల సినిమా రిలీజ్ పోస్ట్ పోన్ చేశారు. రీసెంట్ గానే కొత్త రిలీజ్ డేట్ ను అనౌన్స్ చేశారు. దసరా కానుకగా అక్టోబర్ 10 న సినిమాని విడుదల చేస్తున్నట్లు అధికారికంగా వెల్లడించారు.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Anilkumar]]>