MoviesPulgam Srinivaseditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/sohelef0c666c-747d-4d22-82a8-628c34ecec85-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/sohelef0c666c-747d-4d22-82a8-628c34ecec85-415x250-IndiaHerald.jpgతెలుగులో అత్యంత ప్రజాధరణ పొందిన రియాలిటీ షో లలో ఒకటి అయినటువంటి బిగ్ బాస్ ద్వారా మంచి గుర్తింపును సంపాదించుకున్న నటులలో సోహెల్ ఒకరు. ఈయనకి బిగ్ బాస్ లోకి ఎంట్రీ ఇవ్వకముందు పెద్దగా గుర్తింపు లేదు. కానీ ఎప్పుడైతే బిగ్ బాస్ షో లోకి ఎంట్రీ ఇచ్చాడో అప్పటి నుండి ఈయనకు మంచి గుర్తింపు లభించింది. ఇకపోతే బిగ్ బాస్ షో నుండి బయటకు వచ్చాక ఈయన పలు సినిమాలలో హీరో గా నటించాడు. అందులో భాగంగా కొంత కాలం క్రితమే ఈయన మిస్టర్ ప్రెగ్నెంట్ అనే సినిమాలో హీరో గా నటించాడు. వైవిధ్యమైన కథాంశంతో రూపొందిన ఈ సినిమా పర్వాలేదు అSohel{#}indraja;srinivas;Reality Show;Balaraju;Mister;Bigboss;Evening;February;Heroine;Posters;Box office;cinema theater;Hero;Cinemaఅఫిషియల్ : ఆ తేదీ నుండి "ఓటిటి" లో "బూట్ కట్ బాలరాజు"..!అఫిషియల్ : ఆ తేదీ నుండి "ఓటిటి" లో "బూట్ కట్ బాలరాజు"..!Sohel{#}indraja;srinivas;Reality Show;Balaraju;Mister;Bigboss;Evening;February;Heroine;Posters;Box office;cinema theater;Hero;CinemaSat, 24 Feb 2024 12:42:42 GMTతెలుగులో అత్యంత ప్రజాధరణ పొందిన రియాలిటీ షో లలో ఒకటి అయినటువంటి బిగ్ బాస్ ద్వారా మంచి గుర్తింపును సంపాదించుకున్న నటులలో సోహెల్ ఒకరు. ఈయనకి బిగ్ బాస్ లోకి ఎంట్రీ ఇవ్వకముందు పెద్దగా గుర్తింపు లేదు. కానీ ఎప్పుడైతే బిగ్ బాస్ షో లోకి ఎంట్రీ ఇచ్చాడో అప్పటి నుండి ఈయనకు మంచి గుర్తింపు లభించింది. ఇకపోతే బిగ్ బాస్ షో నుండి బయటకు వచ్చాక ఈయన పలు సినిమాలలో హీరో గా నటించాడు. అందులో భాగంగా కొంత కాలం క్రితమే ఈయన మిస్టర్ ప్రెగ్నెంట్ అనే సినిమాలో హీరో గా నటించాడు. 

వైవిధ్యమైన కథాంశంతో రూపొందిన ఈ సినిమా పర్వాలేదు అనే స్థాయి అంచనాల నడుమ ధియేటర్ లలో విడుదల అయ్యి ప్రేక్షకులను మాత్రం పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. ఇకపోతే తాజాగా ఈ నటుడు బూట్ కట్ బాలరాజు అనే సినిమాలో హీరో గా నటించాడు. మేఘలేఖ ఈ సినిమాలో హీరోయిన్ గా నటించగా ... సునీల్‌ , ఇంద్రజ , అవినాష్‌ ఈ మూవీ లో  కీలక పాత్రల్లో నటించారు. శ్రీనివాస్ కోనేటి ఈ సినిమాకు దర్శకత్వం వహించాడు. ఇకపోతే ఈ సినిమా ఈ సంవత్సరం ఫిబ్రవరి 2 వ తేదీన థియేటర్ లలో విడుదల అయింది. పెద్దగా అంచనాలు లేకుండా థియేటర్ లలో విడుదల అయిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ప్రేక్షకులను ఏ మాత్రం ఆకట్టుకోలేకపోయింది. దానితో ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర సోహెల్ కు అపజయాన్ని మిగిల్చింది.

ఇలా బాక్స్ ఆఫీస్ దగ్గర ప్రేక్షకులను అలరించలేకపోయిన ఈ సినిమా మరికొన్ని రోజుల్లో "ఓ టి టి" లోకి ఎంట్రీ ఇవ్వబోతుంది. అందుకు సంబంధించిన అధికారిక ప్రకటన కూడా తాజాగా వెలువడింది. ఈ మూవీ యొక్క డిజిటల్ హక్కులను ఆహా సంస్థ దక్కించుకుంది. అందులో భాగంగా ఈ సినిమాకి సంబంధించిన ప్రీమియర్స్ ను ఫిబ్రవరి 26 వ తేదీన సాయంత్రం 6 గంటల నుండి ప్రదర్శించనున్నట్లు ఆహా సంస్థ వారు తాజాగా అధికారికంగా ప్రకటిస్తూ ఓ పోస్టర్ ను కూడా విడుదల చేశారు. ప్రస్తుతం ఆ పోస్టర్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.


మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pulgam Srinivas]]>