Sportspraveeneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/sports/libra_libra/iplb7cba206-3e40-4ce9-a9f9-1d3146cc34b1-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/sports/libra_libra/iplb7cba206-3e40-4ce9-a9f9-1d3146cc34b1-415x250-IndiaHerald.jpgఈ మధ్యకాలంలో సినిమాల్లో బాగా పాపులర్ అయిన పంచ్ డైలాగులను ప్రతి ఒక్కరు కూడా తెగ వాడేస్తున్నారు అన్న విషయం తెలిసిందే. గతంలో అల్లు అర్జున్ హీరోగా నటించిన పుష్ప సినిమాలోని తగ్గేదేలే డైలాగ్ ఎంతలా వాడుకలోకి వచ్చిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ప్రతి ఒక్కరి లైఫ్ లో ఈ డైలాగ్ ఒక భాగంగా మారిపోయింది. మరీ ముఖ్యంగా క్రికెట్లో అయితే స్టార్ ప్లేయర్లు అందరూ కూడా శ్రీవల్లి పాటపై డాన్స్ స్టెప్పులు చేయడం.. ఇక మరికొంతమందిరు తగ్గేదేలే అంటూ డైలాగులు చెప్పడం ఎన్నో రోజులపాటు హాట్ టాపిక్ గా మారింది. అయితే ఇక ఇప్Ipl{#}Champion;Chennai;Allu Arjun;trivikram srinivas;Guntur;mahesh babu;Fidaa;Teluguకుర్చీ మడతపెట్టి డైలాగుని.. వాడేసుకున్న చెన్నై సూపర్ కింగ్స్?కుర్చీ మడతపెట్టి డైలాగుని.. వాడేసుకున్న చెన్నై సూపర్ కింగ్స్?Ipl{#}Champion;Chennai;Allu Arjun;trivikram srinivas;Guntur;mahesh babu;Fidaa;TeluguSat, 24 Feb 2024 13:30:00 GMTఈ మధ్యకాలంలో సినిమాల్లో బాగా పాపులర్ అయిన పంచ్ డైలాగులను ప్రతి ఒక్కరు కూడా తెగ వాడేస్తున్నారు అన్న విషయం తెలిసిందే. గతంలో అల్లు అర్జున్ హీరోగా నటించిన పుష్ప సినిమాలోని తగ్గేదేలే డైలాగ్ ఎంతలా వాడుకలోకి వచ్చిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ప్రతి ఒక్కరి లైఫ్ లో ఈ డైలాగ్ ఒక భాగంగా మారిపోయింది. మరీ ముఖ్యంగా క్రికెట్లో అయితే స్టార్ ప్లేయర్లు అందరూ కూడా శ్రీవల్లి పాటపై డాన్స్ స్టెప్పులు చేయడం.. ఇక మరికొంతమందిరు తగ్గేదేలే అంటూ డైలాగులు చెప్పడం ఎన్నో రోజులపాటు హాట్ టాపిక్ గా మారింది.


 అయితే ఇక ఇప్పుడు ఇలా బాగా పాపులర్ అయిన డైలాగ్ ఏది అంటే కుర్చీ మడతపెట్టి అనే డైలాగ్. మహేష్ బాబు హీరోగా త్రివిక్రమ్ దర్శకత్వంలో వచ్చిన గుంటూరు కారం సినిమాలో కుర్చీ మడత పెట్టి అనే సాంగ్ ఎంత పాపులర్ అయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అంతకు ముందు నుంచి కుర్చీ మడతపెట్టి అనే డైలాగ్ బాగా వాడుకలోకి వచ్చింది. ఇక మహేష్ బాబు సినిమా తర్వాత స్టార్స్ సైతం ఇక ఈ డైలాగును వాడటం మొదలుపెట్టారు అని చెప్పాలి. ఇక ప్రతి ఒక్కరు కూడా ఈ డైలాగ్ వాడుతూ ఏదో ఒక పోస్ట్ పెట్టడం చూస్తూ ఉన్నాం. అయితే ఐపీఎల్లో ఛాంపియన్ టీమ్ అయిన చెన్నై సూపర్ కింగ్స్ సైతం ఈ తెలుగు డైలాగ్ ని వాడేసింది.


 ఇటీవలే ఇక మహేష్ బాబు డైలాగ్ వాడుతూ చెన్నై సూపర్ కింగ్స్ జట్టు యాజమాన్యం సోషల్ మీడియాలో పెట్టిన ఒక పోస్ట్ కాస్త ప్రస్తుతం తెగ వైరల్ గా మారిపోయింది అని చెప్పాలి. అందరూ వాడేస్తున్నారు తామేం తక్కువ కాదు అన్నట్లుగా ఇదే డైలాగును తమదైన రీతిలో ఉపయోగించింది చెన్నై సూపర్ కింగ్స్. ఐపీఎల్ 2024 తొలి షెడ్యూల్లో తెలుగు రాష్ట్రాలలో రెండు మ్యాచ్లు ఆడబోతుంది చెన్నై జట్టు. ఈ క్రమంలోనే ఈ విషయాన్ని సోషల్ మీడియాలో షేర్ చేస్తూ.. ఆ కుర్చీని మడతపెట్టి.. కొట్టండి సిటీ అంటూ ఇక ఒక డైలాగ్ ని పోస్ట్ చేసింది   ఇక ఇది చూసి తెలుగు ఫ్యాన్స్ అందరు కూడా ఫిదా అయిపోతున్నారు అని చెప్పాలి.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>