Moviesmurali krishnaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/socialstars-lifestyle54cfb8d8-29b3-470f-8fbb-be40a910dfbe-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/socialstars-lifestyle54cfb8d8-29b3-470f-8fbb-be40a910dfbe-415x250-IndiaHerald.jpgఏ దైనా సినిమా విజయవంతం కావాలంటే దర్శక నిర్మాతలతో పాట ఎలా ఉన్నా హీరోదే కీలక పాత్ర అనేది చాలాకాలంగాకొనసాగుతున్న ట్రెండ్‌. ఈ ట్రెండ్‌కు భిన్నంగా లేడీ ఓరియంటెడ్‌ సినిమాలు బ్లాక్‌ బ్లస్టర్‌ హిట్స్‌ అవుతున్న సినిమాలకు కొదవలేదు.2010ల మధ్యకాలంలో తమిళం , తెలుగు చలనచిత్ర పరిశ్రమలలో మహిళా ప్రధాన చిత్రాలు బాగా పెరిగాయని చెప్పొచ్చు. అనుష్క శెట్టి, నయనతార లాంటి హీరోయిన్లు బాక్సాఫీస్ వద్ద భారీ హిట్స్‌ నమోదు చేశారు. వీటిల్లోచాలావరకు హిందీతోపాటు, ఇతర భాషలలో కూడా రీమేక్‌ అయ్యాయి. అదే 2018 తమిళ సూపర్‌ హిట్ మూవీ 'కsocialstars lifestyle{#}anoushka;deepak;lyca productions;nayantara;rajendran;yogi;Telugu;job;Comedian;Drugs;Chitram;Tamil;Lung cancer;Cancer;Punjab;Director;Darsakudu;Cinemaట్రెండ్‌కు భిన్నంగా లేడీ ఓరియంటెడ్‌ సినిమాలు చేస్తున్న స్టార్ హీరోయిన్..!!ట్రెండ్‌కు భిన్నంగా లేడీ ఓరియంటెడ్‌ సినిమాలు చేస్తున్న స్టార్ హీరోయిన్..!!socialstars lifestyle{#}anoushka;deepak;lyca productions;nayantara;rajendran;yogi;Telugu;job;Comedian;Drugs;Chitram;Tamil;Lung cancer;Cancer;Punjab;Director;Darsakudu;CinemaSat, 24 Feb 2024 06:06:45 GMTఏ దైనా సినిమా విజయవంతం కావాలంటే దర్శక నిర్మాతలతో పాట ఎలా ఉన్నా హీరోదే కీలక పాత్ర అనేది చాలాకాలంగాకొనసాగుతున్న ట్రెండ్‌. ఈ ట్రెండ్‌కు భిన్నంగా లేడీ ఓరియంటెడ్‌ సినిమాలు బ్లాక్‌ బ్లస్టర్‌ హిట్స్‌ అవుతున్న సినిమాలకు కొదవలేదు.2010ల మధ్యకాలంలో తమిళం , తెలుగు చలనచిత్ర పరిశ్రమలలో మహిళా ప్రధాన చిత్రాలు బాగా పెరిగాయని చెప్పొచ్చు. అనుష్క శెట్టి, నయనతార లాంటి హీరోయిన్లు బాక్సాఫీస్ వద్ద భారీ హిట్స్‌ నమోదు చేశారు. వీటిల్లోచాలావరకు హిందీతోపాటు, ఇతర భాషలలో కూడా రీమేక్‌ అయ్యాయి. అదే 2018 తమిళ సూపర్‌ హిట్ మూవీ 'కొలమావు కోకిల'. తక్కువ బడ్జెట్‌తో తెరకెక్కి, తొమ్మిది రెట్లకుపైగా లాభాలను సంపాదించింది. నయనతార టైటిల్ రోల్‌లో నటించిన 'కొలమావు కోకిల'. లైకా ప్రొడక్షన్స్ బ్యానర్‌పై, నెల్సన్‌ దిలీప్‌కుమార్‌ దర్శకత్వం వహించగా యోగి బాబు, శరణ్య, శరవణన్, రాజేంద్రన్ ప్రధాన పాత్రల్లో నటించారు. ఇదే తెలుగులో కోకోకోకిల పేరుతో రీమేక్‌ అయింది. కేవలం మౌత్‌ పబ్లిసిటీ ద్వారానే, ఈ చిత్రం విమర్శనాత్మకంగా, వాణిజ్యపరంగా విజయం సాధించింది. రూ. 8 కోట్ల బిడ్జెట్‌తో నిర్మితమై, ప్రపంచవ్యాప్తంగా 73 కోట్ల రూపాయలను వసూలు చేసింది. 800 శాతం లాభపడిన చిత్రంగా రికార్డు దక్కించుకుంది.

2022లో, కొలమావు కోకిల సినిమాను హిందీలో నూతన దర్శకుడు సిద్ధార్థ్ సేన్ రీమేక్‌ చేశారు. పంజాబ్ నేపథ్యంలో తెరకెక్కిన గుడ్‌లక్ జెర్రీ చిత్రంలో జాన్వీ కపూర్ ప్రధాన పాత్రలో దీపక్ డోబ్రియాల్, మితా వశిష్ట్, నీరజ్ సూద్, సౌరభ్ సచ్‌దేవా తదితరులు నటించారు. ఈ చిత్రం థియేటర్స్‌లో కాకుండా ఓటీటీలో రిలీజ్‌ అయింది. విమర్శకుల ప్రశంసలు కూడా దక్కించుకుంది. కోకిల (నయనతార) మధ్యతరగతి కుటుంబానికి చెందిన అమ్మాయి. తన తల్లి (శరణ్య)కు కాన్సర్ రావడంతో ఆపరేషన్ కు 15 లక్షలు కావాలి. మసాజ్ పార్లర్ లో ఉద్యోగం ద్వారా వచ్చే సొమ్ము సరిపోక ఆర్ధిక ఇబ్బందుల్లో ఉన్న కోకిల, డ్రగ్స్ సరఫరా చేసే ఓ గ్యాంగ్ లో ట్రాన్స్ పోర్టర్ గా చేరుతుంది. ఈ క్రమంలో ఆమె అనుకోని కష్టాల్లో పడుతుంది. ఈ కష్టాల్లోంచి ఆమె బయట పడడానికి ఆమె ఎదుర్కొన్న సమస్యలేమిటి ? చివరికి తన తల్లిని కాపాడుకుందా ? లేదా ? అనేదే మిగతా సినిమా కథ. ఎప్పటిలాగానే కోకిల పాత్రలో నయనతార పెర్పార్మెన్స్ అదరిపోతుంది.భారీ ఫైట్స్, హోరెత్తించే బీజీఎంలు, ఎలివేషన్స్‌ ఉండవు కానీ తన అమాయకత్వంతోనే విలన్లకు చెక్‌ చెప్పడం ఆకట్టుకుంటుంది. ఈ చిత్రంలో నయన్‌ను ప్రేమించే వ్యక్తిగా కమెడియన్ యోగిబాబు వినోదం బాగా పండించాడు. వీరిద్దరిపై చిత్రించిన పాట యూట్యూబ్‌లో ట్రైండ్ సెట్ చేసిన సంగతి తెలిసిందే.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - murali krishna]]>