Moviespraveeneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/prabhas92c5e145-c600-4192-8157-94cc847be890-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/prabhas92c5e145-c600-4192-8157-94cc847be890-415x250-IndiaHerald.jpgసాధారణంగా సినిమాలలో హీరోలు అందరూ కూడా ఎన్నో యాక్షన్స్ సన్నివేశాలలో నటిస్తూ ఉంటారు అన్న విషయం తెలిసిందే. ఇక ఇలాంటి యాక్షన్ సీక్వెన్స్ లను చూసి వావ్ మా హీరో గొప్పోడు. అతన్ని మంచినోడు ఇంకొకరు లేరు అని అభిమానులు అందరూ అనుకుంటూ ఉంటారు. కానీ ఇలా తెరమీద కనిపించేది హీరోలు అయినా యాక్షన్ సీక్వెన్స్ లో రిస్కులు చేసేది మాత్రం హీరోల డూపులు అన్న విషయం తెలిసిందే. ప్రమాదకరమైన విన్యాసాలు చేస్తూ ఎంతో మంది స్టార్ హీరోలకు డూప్ హీరోలు పనిచేస్తూ ఉంటారు. అచ్చం ఇలాగే అటు పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ కి కూడా ఒక డూప్ ఉన్నPrabhas{#}kiran;Bahubali;Hero;Prabhas;Indiaవామ్మో.. ప్రభాస్ డూప్ కి ఒక్కో సినిమాకి అంత పారితోషకం ఇస్తారా?వామ్మో.. ప్రభాస్ డూప్ కి ఒక్కో సినిమాకి అంత పారితోషకం ఇస్తారా?Prabhas{#}kiran;Bahubali;Hero;Prabhas;IndiaSat, 24 Feb 2024 09:40:00 GMTసాధారణంగా సినిమాలలో హీరోలు అందరూ కూడా ఎన్నో యాక్షన్స్ సన్నివేశాలలో నటిస్తూ ఉంటారు అన్న విషయం తెలిసిందే. ఇక ఇలాంటి యాక్షన్ సీక్వెన్స్ లను చూసి వావ్ మా హీరో గొప్పోడు.  అతన్ని మంచినోడు ఇంకొకరు లేరు అని అభిమానులు అందరూ అనుకుంటూ ఉంటారు. కానీ ఇలా తెరమీద కనిపించేది హీరోలు అయినా యాక్షన్ సీక్వెన్స్ లో రిస్కులు చేసేది మాత్రం హీరోల డూపులు అన్న విషయం తెలిసిందే. ప్రమాదకరమైన విన్యాసాలు చేస్తూ ఎంతో మంది స్టార్ హీరోలకు డూప్ హీరోలు పనిచేస్తూ ఉంటారు. అచ్చం ఇలాగే అటు పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ కి కూడా ఒక డూప్ ఉన్నాడు. చూడ్డానికి అచ్చం ప్రభాస్ లాగే కనిపిస్తూ ఉంటాడు ఆయన.


 ఇద్దరు ఒకచోట నిలబడి ఫోటో దిగారు అంటే సొంత అన్నదమ్ములేమో అని అనిపిస్తూ ఉంటుంది చూసే ప్రేక్షకులకి. ఇక ఇప్పటివరకు ప్రభాస్ చేసిన ఎన్నో సినిమాలకు ఆయన డూప్ గా వర్క్ చేశారు. అంతెందుకు ఇక బాహుబలి సినిమాలో సైతం ప్రభాస్ డూప్ గా ఎన్నో యాక్షన్ సీక్వెన్స్ లో నటించారు ఆయన. ఇలా ప్రభాస్ కు డూప్ గా చేసే వ్యక్తి పేరు ఏంటో కాదు కిరణ్ రాజ్. ఈ విషయం కొంతమంది ప్రేక్షకులకు తెలిసే ఉంటుంది. అయితే మొదట్లో జనాలకు అతను అంతగా పరిచయం లేదు  కానీ బాహుబలి సమయంలో ఇక ప్రభాస్ కి డూప్ గా చేసింది కిరణ్ రాజ్ అని తెలియడంతో అతనికి కూడా మంచి గుర్తింపు వచ్చింది.


 అయితే సాధారణంగా ఇలా హీరోల డూప్స్ కి నిర్మాతలు పారితోషకం ఇవ్వడం లాంటివి చేస్తూ ఉంటారు అన్న విషయం తెలిసిందే. కానీ ప్రభాస్ మాత్రం తన వద్ద పని చేసే ప్రతి ఒక్కరికి సొంతంగా జీతాలు ఇస్తూ ఉంటారట. ఈ క్రమంలోనే ఇక తనకు డూప్ గా పనిచేసిన కిరణ్ రాజ్ కి ఒక్కో సినిమాకి 30 లక్షల వరకు చెల్లిస్తాడు అని టాక్ ఉంది. ఈ వార్త కాస్త ఫిలిం వర్గాల్లో వైరల్ గా మారిపోయింది అని చెప్పాలి. సాధారణంగా అయితే హీరోల డూపులకి ఇంత పెద్ద మొత్తంలో చెల్లించరు. ఏకంగా 30 లక్షలు అంటే ఒక చిన్న హీరో పారితోషకం అని చెప్పాలి. కానీ ప్రభాస్ మాత్రం తనకు సినిమాలలో డూప్ గా చేస్తున్న కిరణ్ రాజ్ కి ఇంత పెద్ద మొత్తంలో చెల్లిస్తూ ఉండడంతో ప్రభాస్ పై ప్రశంసలు కురుస్తున్నాయి.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>