BusinessChakravarthi Kalyaneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/business/technology_videos/tata3992d067-9a7b-41aa-9e41-1f29cbcf8ea1-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/business/technology_videos/tata3992d067-9a7b-41aa-9e41-1f29cbcf8ea1-415x250-IndiaHerald.jpgపాతికేళ్లప్పుడు రజతోత్సవం.. యాభై ఏళ్లప్పుడు స్వర్ణోత్సవాలు, డెబ్బై అయిదేళ్లప్పుడు అమృతోత్సవాలు నిర్వహిస్తూ ఉంటారు. భారత దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన 75 ఏళ్లకు ఇప్పుడు అమృతోత్సవాలు జరుపుకొంటుంది. ఈ 75 ఏళ్లలో దేశం ఎంతో సాధించింది. కానీ కొన్ని మీడియా సంస్థలు మనలో ఆశలు రేకేత్తించి.. దానిని సాధించకపోవడంతో వెనకపడ్డామనే భావనను మనలో కలిగిస్తున్నాయి. స్వాత్రంత్ర్యానంతరం మన నుంచి విడిపోయిన పాకిస్థాన్ తో మనల్ని పోల్చి చూసినప్పుడు మనం ఎంత సాధించామో అర్థం అవుతుంది. ప్రస్తుతం భారతదేశ జీడీపీ 3.7 ట్రిలియనtata{#}nidhi;Pakistan;Germany;vegetable market;Manadesam;INTERNATIONAL;media;Manam;Indiaవారెవా: పాకిస్తాన్‌ జీడీపీని దాటేసిన టాటా గ్రూప్‌ విలువ?వారెవా: పాకిస్తాన్‌ జీడీపీని దాటేసిన టాటా గ్రూప్‌ విలువ?tata{#}nidhi;Pakistan;Germany;vegetable market;Manadesam;INTERNATIONAL;media;Manam;IndiaSat, 24 Feb 2024 10:29:42 GMTపాతికేళ్లప్పుడు రజతోత్సవం.. యాభై ఏళ్లప్పుడు స్వర్ణోత్సవాలు, డెబ్బై అయిదేళ్లప్పుడు అమృతోత్సవాలు నిర్వహిస్తూ ఉంటారు. భారత దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన 75 ఏళ్లకు ఇప్పుడు అమృతోత్సవాలు జరుపుకొంటుంది.  ఈ 75 ఏళ్లలో దేశం ఎంతో సాధించింది.  కానీ కొన్ని మీడియా సంస్థలు మనలో ఆశలు రేకేత్తించి.. దానిని సాధించకపోవడంతో వెనకపడ్డామనే భావనను మనలో కలిగిస్తున్నాయి.  


స్వాత్రంత్ర్యానంతరం మన నుంచి విడిపోయిన పాకిస్థాన్ తో మనల్ని పోల్చి చూసినప్పుడు మనం ఎంత సాధించామో అర్థం అవుతుంది. ప్రస్తుతం భారతదేశ జీడీపీ 3.7 ట్రిలియన్ డాలర్లు. అంటే రూ.296లక్షల కోట్లు. ఈ మొత్తం పాకిస్థాన్ కంటే దాదాపు 11 రెట్లు ఎక్కువ. మనదేశం ఎఫ్ వై 28 నాటికి జపాన్, జర్మనీ రెండింటినీ అధిగమించి ప్రపంచంలో మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించే అవకాశాలు మెండుగా ఉన్నాయి. ప్రస్తుతం భారత్ ప్రపంచ వ్యాప్తంగా అయిదో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ.


అయితే ఇదే సమయంలో అంతర్జాతీయ ద్రవ్య నిధి అంచనాల ప్రకారం.. పాకిస్థాన్ జీడీపీ 341 బిలియన్ డాలర్లు. అంటే 28.3లక్షల కోట్లు. మన దగ్గర నమ్మకానాకి మారుపేరుగా నిలిచే టాటా గ్రూపు మార్కెట్ విలువ 365 బిలియన్ డాలర్లు. అంటే 30.3లక్షల కోట్లుకు చేరుకుంది. ఇది పాకిస్థాన్ జీడీపీ కంటే ఎక్కువ కావడం విశేషం.


పాకిస్థాన్ జీడీపీ మించి టాటా గ్రూప్ వాల్యూ నమోదైంది. సంస్థ స్థాయిలో వృద్ధి సాధించడానికి కారణం ఐటీ దిగ్గజం టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్) అని చెప్పవచ్చు. ఈ ఒక్క కంపెనీ విలువే 170 బిలియన్ డాలర్లు. అంటే దీని వాల్యూ రూ.15లక్షల కోట్లు. దీని మార్కెట్ విలువ పాకిస్థాన్ ఆర్థిక ఉత్పత్తిలో దాదాపు సగానికి సమానం. దీనిని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు. అభివృద్ధి చెందామో లేదో.. అయితే దీనిని ప్రపంచానికి చెప్పే ముందు మన దేశంలో ఉంటూ  మనల్ని విమర్శించే వారికి చెప్పాలి.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chakravarthi Kalyan]]>