MoviesAnilkumareditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/tollywoodb52b0837-6790-45a1-b077-30c8a1b63e74-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/tollywoodb52b0837-6790-45a1-b077-30c8a1b63e74-415x250-IndiaHerald.jpgసుప్రీమ్ హీరో సాయి ధరమ్ తేజ్ గత ఏడాది 'విరూపాక్ష' సినిమాతో ప్రేక్షకులు ముందుకు వచ్చాడు. కార్తీక్ దండు దర్శకత్వం వహించిన ఈ సినిమా గత ఏడాది విడుదలై బ్లాక్ బస్టర్ సక్సెస్ సాధించి సాయి తేజ్ కెరియర్ లోనే హైయెస్ట్ కలెక్షన్స్ అందుకున్న చిత్రంగా రికార్డు క్రియేట్ చేసింది. ఇక విరూపాక్ష విడుదలైన దాదాపు ఏడాది కావస్తున్నా సాయి తేజ్ నెక్స్ట్ ప్రాజెక్ట్ పై ఎలాంటి అప్డేట్స్ లేవు. నిజానికి సంపత్ నందితో రీసెంట్ గా 'గాంజా శంకర్' సినిమాని అనౌన్స్ చేశాడు. దాంతోపాటు మరో ప్రాజెక్టును కూడా లైన్లో పెట్టినప్పటికీ tollywood{#}Chitralahari;Mythri Movie Makers;Kishore Tirumala;sampath;Karthik;Blockbuster hit;Success;Audience;Hero;News;Cinemaఆ సీక్వెల్ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన మెగా హీరోఆ సీక్వెల్ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన మెగా హీరోtollywood{#}Chitralahari;Mythri Movie Makers;Kishore Tirumala;sampath;Karthik;Blockbuster hit;Success;Audience;Hero;News;CinemaSat, 24 Feb 2024 16:40:00 GMTసుప్రీమ్ హీరో సాయి ధరమ్ తేజ్ గత ఏడాది 'విరూపాక్ష' సినిమాతో ప్రేక్షకులు ముందుకు వచ్చాడు. కార్తీక్ దండు దర్శకత్వం వహించిన ఈ సినిమా గత ఏడాది విడుదలై బ్లాక్ బస్టర్ సక్సెస్ సాధించి సాయి తేజ్ కెరియర్ లోనే హైయెస్ట్ కలెక్షన్స్ అందుకున్న చిత్రంగా రికార్డు క్రియేట్ చేసింది. ఇక విరూపాక్ష విడుదలైన దాదాపు ఏడాది కావస్తున్నా సాయి తేజ్ నెక్స్ట్ ప్రాజెక్ట్ పై ఎలాంటి అప్డేట్స్ లేవు. నిజానికి సంపత్ నందితో రీసెంట్ గా 'గాంజా శంకర్' సినిమాని అనౌన్స్ చేశాడు. దాంతోపాటు మరో ప్రాజెక్టును కూడా లైన్లో పెట్టినప్పటికీ బడ్జెట్ సమస్యల కారణంగా ఈ రెండు ప్రాజెక్ట్స్ ఇంకా హోల్డ్ లోనే ఉన్నాయి. 

దానికి తోడు విరూపాక్ష సక్సెస్ తర్వాత ఈ మెగా హీరో భారీ రెమ్యూనరేషన్ డిమాండ్ చేస్తున్నాడు. ఇదిలా ఉంటే సాయి తేజ్ 'చిత్రలహరి' సీక్వెల్ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తాజా సమాచారం బయటికి వచ్చింది. 'విరూపాక్ష' కంటే ముందు తేజు కెరియర్లో 'చిత్రలహరి' బెస్ట్ ఫిలిం గా నిలిచింది. ఇప్పటిదాకా వరుస ప్లాప్స్ తో సతమతమవుతున్న సాయి తేజ్ కి 'చిత్రలహరి' మంచి బూస్ట్ ఇచ్చింది. 2019లో ప్రేక్షకులు ముందుకు వచ్చిన ఈ సినిమాని కిషోర్ తిరుమల డైరెక్టర్ చేశారు. ఇక ఇప్పుడు ఈ సినిమాకి సీక్వెల్ ని పట్టాలెక్కించేందుకు కిషోర్ తిరుమల సిద్ధమవుతున్నట్లు సమాచారం. ఇప్పటికే ఆయన చిత్రలహరి సీక్వెల్ కి

సంబంధించి స్క్రిప్టుపై వర్క్ చేస్తున్నారు. సాయి తేజ్ కూడా ఈ సీక్వెల్ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు ఫిలిం సర్కిల్స్ లో టాక్ వినిపిస్తోంది. movie MAKERS' target='_blank' title='మైత్రి మూవీ మేకర్స్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>మైత్రి మూవీ మేకర్స్ ఈ సీక్వెల్ ని నిర్మించనున్నట్లు ఇన్సైడ్ వర్గాల సమాచారం. త్వరలోనే ఈ సీక్వెల్ కి సంబంధించి అఫీషియల్ అనౌన్స్మెంట్ రానుంది. ఈ సీక్వెల్ తో పాటు సాయితేజ్ మరికొన్ని కొత్త ప్రాజెక్ట్ కోసం చర్చలు జరుపుతున్నాడు. ఇప్పటికే ఇద్దరు కొత్త డైరెక్టర్స్ సాయి తేజ్ కి స్క్రిప్ట్ నెరేట్ చేసినట్లు తెలుస్తోంది. ఆ ఇద్దరు డైరెక్టర్స్ ప్రస్తుతం ఫైనల్ నెరేషన్ కోసం స్క్రిప్ట్ పై కసరత్తులు చేస్తున్నారు. వీటిని కూడా త్వరలోనే అఫీషియల్ గా అనౌన్స్ చేయనున్నారు. మరోవైపు సాయి తేజ్ కూడా ప్రస్తుతం బరువు తగ్గే పనిలో ఉన్నాడు. అందుకోసం ఇప్పటికే కసరత్తులు కూడా మొదలుపెట్టాడు.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Anilkumar]]>