HealthPurushottham Vinayeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/health/movies_news/health-tips064bccdf-d2c1-4aa5-9a00-1decad336291-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/health/movies_news/health-tips064bccdf-d2c1-4aa5-9a00-1decad336291-415x250-IndiaHerald.jpgవేసవి కాలంలో ఆహారం తింటూ చాలా సులువుగా బరువు తగ్గొచ్చు. వేసవిలో కచ్చితంగా తినాల్సిన ఆహారాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.సీజనల్ పండ్లయినా పుచ్చకాయలు, మామిడి, బెర్రీలు కచ్చితంగా తినాలి. వాటిలో నీటి శాతం కూడా ఎక్కువ. పైనాపిల్, పీచెస్ వంటివి మన శరీరాన్ని హైడ్రేటింగ్‌గా ఉంచేందుకు ఉపయోగపడతాయి. అవి తినడం వల్ల అందే క్యాలరీలు తక్కువే. కొవ్వు శాతం సున్నా. వేసవిలో కొబ్బరినీళ్ళకు మించిన ఔషధం లేదు. వీటిలో ఎలక్ట్రోలైట్స్ పుష్కలంగా ఉంటాయి. రోజుకో కొబ్బరి బోండం తాగిన చాలు, రోజంతా శరీరంలో వేడి పెరగకుండా అడ్డుకోవHealth Tips{#}Ice cream;Aqua;oil;Cholesterolవేసవి కాలంలో పాటించాల్సిన ఆహార నియమాలు?వేసవి కాలంలో పాటించాల్సిన ఆహార నియమాలు?Health Tips{#}Ice cream;Aqua;oil;CholesterolSat, 24 Feb 2024 13:21:12 GMTవేసవి కాలంలో ఆహారం తింటూ చాలా సులువుగా బరువు తగ్గొచ్చు. వేసవిలో కచ్చితంగా తినాల్సిన ఆహారాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.సీజనల్ పండ్లయినా పుచ్చకాయలు, మామిడి, బెర్రీలు కచ్చితంగా తినాలి. వాటిలో నీటి శాతం కూడా ఎక్కువ. పైనాపిల్, పీచెస్ వంటివి మన శరీరాన్ని హైడ్రేటింగ్‌గా ఉంచేందుకు ఉపయోగపడతాయి. అవి తినడం వల్ల అందే క్యాలరీలు తక్కువే. కొవ్వు శాతం సున్నా. వేసవిలో కొబ్బరినీళ్ళకు మించిన ఔషధం లేదు. వీటిలో ఎలక్ట్రోలైట్స్ పుష్కలంగా ఉంటాయి. రోజుకో కొబ్బరి బోండం తాగిన చాలు, రోజంతా శరీరంలో వేడి పెరగకుండా అడ్డుకోవచ్చు. పండ్లు లేదా కూరగాయలతో చేసిన సలాడ్‌ను రోజూ తినాలి. ఇది తేలికపాటి ఆహారం. శక్తిని మాత్రం అందిస్తుంది.కడుపు చల్లగా ఉండేందుకు ఐస్‌క్రీం, శీతల పానీయాలు వంటివి కూడా తీసుకోవద్దు. ఐస్ క్రీం జీర్ణక్రియ సమయంలో శరీర ఉష్ణోగ్రతను పెంచుతుంది. జలుబు, జ్వరం వంటివి ఎటాక్‌ చేస్తాయి.


కాబట్టి ఇలాంటి కృత్రిమ పానీయాలకు దూరంగా ఉండండి.చికెన్-మటన్ వంటి ఆహారాలు శరీరాన్ని డీహైడ్రేట్ చేస్తాయి. కాబట్టి వేసవిలో మాంసానికి దూరంగా ఉండటం మంచిది. అలాగే స్పైసీ ఫుడ్ ఎక్కువగా తినకూడదు. ఇది అధిక చెమట, నిర్జలీకరణానికి దారితీస్తుంది. కాలం ఏదైనా కానీ శరీరాన్ని ఎల్లప్పుడూ హైడ్రేటెడ్ గా ఉంచుకోవాలి. అందుకే మంచి నీళ్లు ఎక్కువగా తాగండి.వేసవి కాలంలో ఎక్కువగా నూనె, వేపుడు పదార్థాలకు దూరంగా ఉండటం మంచిది. జంక్ ఫుడ్స్ అనారోగ్యం కలిగిస్తాయి. ముఖ్యంగా వేసవిలో ప్రాసెస్ చేసిన, వేయించిన ఆహారాలకు పూర్తిగా దూరంగా ఉండాలి. నూనె పదార్థాలు తీసుకోవడం వల్ల పొట్ట భారంగా మారి జీర్ణక్రియ మందగిస్తుంది. ఈ విధంగా వేసవి కాలంలో ఈ ఆహార నియమాలు పాటిస్తూ ఉండండి. అలాగే ఖచ్చితంగా రాత్రిపూట 8 గంటలు నిద్రపోండి. ఉదయాన్నే ఖచ్చితంగా మినిమం 30 నిముషాలు పాటు వ్యాయామం ఖచ్చితంగా చెయ్యండి. అప్పుడే ఆరోగ్యంగా చాలా చురుగ్గా ఉంటారు.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Purushottham Vinay]]>