Healthpraveeneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/health/movies_news/sleep54a95e51-4350-48b1-a1df-0cd4df5cca79-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/health/movies_news/sleep54a95e51-4350-48b1-a1df-0cd4df5cca79-415x250-IndiaHerald.jpgఏదైనా సరే సమపాళ్లల్లో ఉంటేనే బాగుంటుంది. కాస్త ఎక్కువైనా లేదంటే కాస్త తక్కువైనా కూడా చివరికి ప్రమాదమే అన్న విషయం తెలిసిందే. అయితే ఆరోగ్యానికి మంచి చేసే నిద్ర విషయంలో కూడా ఇదే జరుగుతూ ఉంటుంది. ప్రతిఒకరు రోజు ఏడు గంటల నుంచి 8 గంటల వరకు తప్పనిసరిగా నిద్ర పోవాల్సిందే. అయితే నిద్ర తక్కువ అయితే ఎన్నో ఆరోగ్య సమస్యలు కూడా వచ్చే అవకాశం ఉంటుంది అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఇలా నిద్రను నిర్లక్ష్యం చేయడం కారణంగా ఇప్పటికే ఎంతోమంది ఎన్నో ఆరోగ్య సమస్యలతో బాధపడుతూ ఆసుపత్రిలో చుట్టూ తిరుగుతూ ఉండడం కూడా చూస్Sleep{#}Heart;Cigarette;Kanna Lakshminarayanaఅతి నిద్ర.. మద్యం, సిగరెట్ తాగడం కంటే ప్రమాదకరమా?అతి నిద్ర.. మద్యం, సిగరెట్ తాగడం కంటే ప్రమాదకరమా?Sleep{#}Heart;Cigarette;Kanna LakshminarayanaSat, 24 Feb 2024 13:15:00 GMTఏదైనా సరే సమపాళ్లల్లో ఉంటేనే బాగుంటుంది. కాస్త ఎక్కువైనా లేదంటే కాస్త తక్కువైనా కూడా చివరికి ప్రమాదమే అన్న విషయం తెలిసిందే. అయితే ఆరోగ్యానికి మంచి చేసే నిద్ర విషయంలో కూడా ఇదే జరుగుతూ ఉంటుంది. ప్రతిఒకరు రోజు ఏడు గంటల నుంచి 8 గంటల వరకు తప్పనిసరిగా నిద్ర పోవాల్సిందే. అయితే నిద్ర తక్కువ అయితే ఎన్నో ఆరోగ్య సమస్యలు కూడా వచ్చే అవకాశం ఉంటుంది అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఇలా నిద్రను నిర్లక్ష్యం చేయడం కారణంగా ఇప్పటికే ఎంతోమంది ఎన్నో ఆరోగ్య సమస్యలతో బాధపడుతూ ఆసుపత్రిలో చుట్టూ తిరుగుతూ ఉండడం కూడా చూస్తూ ఉంటాం.


 అయితే నిద్ర ఆరోగ్యానికి మంచిది అనుకొని కొంతమంది 8 గంటలకంటే ఎక్కువగా నిద్ర పోవడం చేస్తూ ఉంటారు. ఇక ఎప్పుడూ నిద్రమత్తులోనే ఉంటూ ఉంటారు. పగలు రాత్రి అని తేడా లేకుండా నిద్రలో మునిగితేలుతూ ఉంటారు అన్న విషయం తెలిసిందే. ఎలాగో నిద్రపోతే హెల్త్ కు మంచిదే కదా అనుకుంటూ ఉంటారు. కానీ నిద్ర ఎక్కువైతే ఇక మరింత ప్రమాదం అని ఎప్పుడూ నిపుణులు హెచ్చరిస్తూ ఉంటారు అన్న విషయం తెలిసిందే. సాధారణంగా మద్యపానం ధూమపానం ఆరోగ్యానికి హానికరం అని అంటూ ఉంటారు. కానీ అతి నిద్ర ఈ రెండిటి కంటే అత్యంత ప్రమాదకరమని నిపుణులు హెచ్చరిస్తూ ఉన్నారు.


 సాధారణంగా కొంతమంది కాస్త సమయం దొరికిన కూడా ఇలా నిద్రలోకి జారుకుంటూ ఉంటారు. అయితే 9 గంటల కంటే ఎక్కువగా నిద్రపోతే శరీరంలో ఎన్నో రకాల మార్పులు వస్తాయి అని నిపుణులు సూచిస్తూ ఉన్నారు. ఇక 10 గంటలు నిద్రించేవారు ఎప్పుడు నీరసంగా ఉంటారు అంటూ నిపుణులు చెబుతున్నారు. అతిగా నిద్రపోతే మద్యం, సిగరెట్ తాగడం కన్నా ఎక్కువ ప్రమాదం అంటూ హెచ్చరిస్తూ ఉన్నారు నిపుణులు. అలాగే ఎక్కువగా నిద్రించేవారు తలనొప్పి, వెన్నునొప్పి, స్థూలకాయం, మధుమేహం, గుండె జబ్బులు లాంటి సమస్యలను ఎదుర్కొంటారు అంటూ నిపుణులు హెచ్చరిస్తున్నారు. అందుకే నిద్ర తక్కువ కాకుండా ఎక్కువ కాకుండా జాగ్రత్త పడాలని సూచిస్తూ ఉన్నారు.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>