BreakingChakravarthi Kalyaneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/breaking/134/rs-praveen-ku-revanth-reddy-tweet9509d4a8-e72e-4a77-b54f-c7bffde7bbcb-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/breaking/134/rs-praveen-ku-revanth-reddy-tweet9509d4a8-e72e-4a77-b54f-c7bffde7bbcb-415x250-IndiaHerald.jpgగురుకుల టీచర్ల రిక్రూట్‌మెంట్‌ విషయంలో జనరల్‌ మెరిట్‌ లిస్టు పెట్టి.. ఆర్డర్‌ ప్రకారం భర్తీ చేయాలని బీఎస్పీ తెలంగాణ అధ్యక్షుడు ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌ కుమార్‌ పెట్టిన సోషల్ మీడియా పోస్టుకు సీఎం రేవంత్ రెడ్డి వెంటనే స్పందించారు. మన తెలంగాణ యువతకు సంబంధించిన సమస్యని ప్రజా ప్రభుత్వం దృష్టికి తీసుకురావాలనే మీ ప్రయత్నానికి నా ధన్యవాదాలని తెలిపారు. గడిచిన పదేళ్లలో తెలంగాణ యువత ఎంత దగాపడిందో, వారి భవిష్యత్తు మీద గత ప్రభుత్వం ఏ విధంగా కోలుకోలేని దెబ్బ తీసిందో మనందరం చూశామన్న సీఎం రేవంత్ రెడ్డి.. ఆ దశాబ్ద కాల revanth reddy{#}Telangana;Reddy;Yevaru;media;CM;Governmentఆర్.ఎస్.ప్రవీణ్ పోస్టుకు రేవంత్ అదిరే జవాబు?ఆర్.ఎస్.ప్రవీణ్ పోస్టుకు రేవంత్ అదిరే జవాబు?revanth reddy{#}Telangana;Reddy;Yevaru;media;CM;GovernmentSat, 24 Feb 2024 23:44:20 GMTగురుకుల టీచర్ల రిక్రూట్‌మెంట్‌ విషయంలో జనరల్‌ మెరిట్‌ లిస్టు పెట్టి.. ఆర్డర్‌ ప్రకారం భర్తీ చేయాలని బీఎస్పీ తెలంగాణ అధ్యక్షుడు ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌ కుమార్‌ పెట్టిన సోషల్ మీడియా పోస్టుకు సీఎం రేవంత్ రెడ్డి వెంటనే స్పందించారు. మన తెలంగాణ యువతకు సంబంధించిన సమస్యని ప్రజా ప్రభుత్వం దృష్టికి తీసుకురావాలనే మీ ప్రయత్నానికి నా ధన్యవాదాలని తెలిపారు. గడిచిన పదేళ్లలో తెలంగాణ యువత ఎంత దగాపడిందో, వారి భవిష్యత్తు మీద గత ప్రభుత్వం ఏ విధంగా కోలుకోలేని దెబ్బ తీసిందో మనందరం చూశామన్న సీఎం రేవంత్ రెడ్డి.. ఆ దశాబ్ద కాల విషాదాన్ని సాధ్యమైనంత త్వరగా అధిగమించాలని, ఎలాంటి పొరపాట్లకు తావివ్వకుండా, మన యువత భవితను పునర్నిర్మించాలనే సంకల్పంతో మా ప్రభుత్వం నిర్విరామంగా పని చేస్తోందన్నారు.


గురుకుల టీచర్ల రిక్రూట్‌మెంట్‌కు సంబంధించి మీరు లేవనెత్తిన విషయాలను, ఇచ్చిన సూచనలను నిశితంగా పరిశీలించి, సమస్యను త్వరితగతిన పరిష్కరించాలని సంబంధిత అధికారులను ఆదేశిస్తామని సీఎం రేవంత్ రెడ్డి జవాబు ఇచ్చారు. పార్టీలకు, రాజకీయాలకు అతీతంగా తెలంగాణ పునర్నిర్మాణానికై ఎవరు కలిసి వచ్చినా వారి విలువైన సూచనలు, సహకారం తీసుకోవడానికి, వారితో కలిసి పనిచేయడానికి ప్రజా ప్రభుత్వం ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటుందని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు.


తమ ప్రయత్నం.. తమ తాపత్రయం అంతా.. తెలంగాణ ప్రజల మంచి కోసమే తప్ప, గుర్తింపు కోసం కాదని మీకు సవినయంగా మనవి చేస్తూ, మీరు మున్ముందు కూడా ప్రజా సమస్యలేమైనా సరే మా ప్రభుత్వం దృష్టికి తీసుకురావాలని కోరుకుంటున్నానని సీఎం రేవంత్ రెడ్డి జవాబు ఇవ్వడం ఆసక్తి రేపింది.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chakravarthi Kalyan]]>